Jump to content

కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తున్న వైసీపీ


southyx

Recommended Posts

3 minutes ago, southyx said:

Oka Kuppam ne kaadhu. Mangalarigi lo a few months back open chesthe kulchesaru. Vaallu malla makeshift canteen vesi naduputhunte muncipal sibbandhi tho kulcheyinchaaru. Malli open chesinattu unnaru. Guntur lo same happened. Ippudu Kuppam 

 

Vaadi m()dda - politics chesukovachu gaani canteens meedha padithey emostadhi Lamdikodukulaki - some poor ppl may get benefited with these and especially during pandemic thr r so many ppl who are literally  struggling ! Political mileage kosam ayithe nuvvu kuda inko 10 canteens pettu and use them for a good cause anthey gaani ee leki panchayathi pettukuntey Sanka naakipothaadu. 

Link to comment
Share on other sites

Updated : 26 Aug 2022 04:32 IST

                                     వైకాపా విధ్వంసం

కుప్పంలో శాంతియుత నిరసన పేరుతో బల ప్రదర్శన

అధికార పార్టీ శ్రేణుల దాడులు

స్వాగత బ్యానర్లు, అన్న క్యాంటీన్‌ ఫ్లెక్సీల చింపివేత

వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటివైపు దూసుకెళ్లిన తెదేపా శ్రేణులు

పోలీసుల లాఠీఛార్జిలో చంద్రబాబు పీఏ మనోహర్‌ సహా పలువురికి గాయాలు

250822ap-main1a.jpg

ఈనాడు డిజిటల్‌- చిత్తూరు, న్యూస్‌టుడే- కుప్పం, కుప్పం పట్టణం: ప్రశాంతతకు నిలయమైన కుప్పం పట్టణం గురువారం రణరంగాన్ని తలపించింది.. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజున వైకాపా కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతియుత నిరసనల పేరిట అనుమతి తీసుకున్న అధికార పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంతోపాటు గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్‌ రవిచంద్రపై దాడి చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్దకు వెళ్లడానికి తెదేపా కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో చంద్రబాబు పీఏ మనోహర్‌, తెదేపా కార్యకర్త రాజుతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. దీనిని నిరసిస్తూ చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి అన్న క్యాంటీన్‌ వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వచ్చారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. వైకాపా దౌర్జన్యం, పోలీసుల వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. వైకాపా కార్యకర్తల దౌర్జన్యంపై తెదేపా శ్రేణులు స్పందించడంతో పట్టణంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కుప్పంలో దుకాణాలు, విద్యాసంస్థలు, బస్సుల రాకపోకలు ముందుగానే నిలిపేశారు. చంద్రబాబు పర్యటనలో వైకాపా శ్రేణుల ఆగడాలు, పోలీసుల ప్రేక్షకపాత్రపై తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి.

250822ap-main1b.jpg

గురువారం ఉదయం 10.30కు చంద్రబాబు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి వాహనంలో బయలుదేరి 10.45 గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించాల్సి ఉంది. చంద్రబాబు పర్యటన తొలిరోజే బుధవారం రామకుప్పం మండలం కొంగనపల్లి, కొల్లుపల్లిలో వైకాపా కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టి రెచ్చగొట్టడంతో రాళ్ల దాడి జరిగింది. తమ పార్టీ కార్యకర్తలపై తెదేపా శ్రేణులు దాడి చేశాయని.. గురువారం కుప్పం పట్టణంలో శాంతియుత నిరసన చేస్తామని కుప్పం వైకాపా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్యాలెస్‌ రోడ్డులోని భరత్‌ ఇంటికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుతో పాటు వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి ఉదయం 10.45 గంటలకు బస్టాండ్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం ఎదుట బైఠాయించారు. చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్యాలెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి, కాళ్లతో తొక్కారు. అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా బ్యానర్లను చించేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొందరు కార్యకర్తలు వి.కోట సీఐ ప్రసాద్‌బాబును నెట్టారు. గురువారం అన్నదానం చేస్తున్న దాత, తెదేపా నాయకుడు రవిచంద్రబాబుపై తొమ్మిది మంది దాడి చేశారు. ఎమ్మార్‌రెడ్డి కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమారు గంటసేపు వైకాపా శ్రేణులు అన్న క్యాంటీన్‌ వద్దే అరుపులు, ఈలలతో నానా హంగామా సృష్టించినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. అధికార పార్టీ శ్రేణుల ఆగడాలను పోలీసు సిబ్బంది డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరిస్తుండగా పుంగనూరు ప్రాంతానికి చెందిన ఓ సీఐ వారిని వారించడంతో కెమెరాను తీసేశారు.

250822ap-main1c.jpg

తెదేపా శ్రేణులతో కలిసి చంద్రబాబు బైఠాయింపు
కుప్పం పట్టణంలో వైకాపా నాయకులు, కార్యకర్తల దాష్టీకాలు, తెదేపా శ్రేణులపై దాడులు.. పోలీసుల చోద్యం చూడటాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బాబునగర్‌, పాతపేట, నేతాజీ రోడ్డు మీదుగా కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వచ్చారు. ఆయనతో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో బస్టాండ్‌ ప్రాంగణం నిండిపోయింది. ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వైపుగా తెదేపా శ్రేణులు దూసుకెళ్లే ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు తెదేపా కార్యకర్తలపై లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో లక్ష్మీపురానికి చెందిన రాజుకు గాయపడ్డారు. చంద్రబాబు అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా బ్యానర్లను చించి ధ్వంసం చేసిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ శ్రేణులతో పాటు బైఠాయించారు.

పోలీసుల తీరుపై విమర్శలు
వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద, పార్టీ శ్రేణులు ర్యాలీగా వస్తున్న సమయంలో పోలీసులు వారికి భారీగా భద్రత కల్పించారు. అన్న క్యాంటీన్‌, ప్యాలెస్‌ రోడ్డు మార్గంలో తెదేపా ఫ్లెక్సీలను చించేస్తున్నా పట్టించుకోలేదు. తెదేపా కార్యకర్తలు, నాయకులపై.. వైకాపా శ్రేణులు దాడికి దిగినా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సమయంలో ఈ విధంగా వ్యవహరిస్తారా? అంటూ స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

250822ap-main1d.jpg

Link to comment
Share on other sites

Malli ee roju ధ్వంసం start chesaru. intha psycho gaallu entra veellu.

 

Published : 31 Aug 2022 03:59 IST
 

                                      అన్న క్యాంటీన్‌ ధ్వంసం

కుప్పంలో అర్ధరాత్రిషెడ్లు కూల్చివేత

ఎండలోనే కొనసాగిన అన్నదానం

300822ap-main4a.jpg

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా-ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నక్యాంటీన్‌ను సోమవారం అర్ధరాత్రి అగంతుకులు ధ్వంసం చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఇక్కడ ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 86 రోజులుగా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటుచేసి అన్నదానం చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ ట్రస్టు బ్యానర్లు, షామియానాలను చించేశారు. సమాచారం తెలుసుకున్న తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నంతో పాటు కార్యకర్తలు అక్కడికి చేరుకొని ధ్వంసమైన అన్నక్యాంటీన్‌ను పరిశీలించారు.

ఇది అధికార పార్టీ నాయకుల పనేనని పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించారు. దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎండలోనే అన్నదానం చేపట్టారు. భోజనం పెడుతున్న తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కొన్ని రోజులు పోతే భోజనం తినే పేదవాడిపైనా కేసులు పెట్టేలా ఉన్నారని మునిరత్నం విమర్శించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద   తెదేపా బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి చించి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం పురపాలక అధికారులు రంగప్రవేశం చేసి అన్నక్యాంటీన్‌ బ్యానర్లు, షామియానాలను తొలగించారు. ప్రజలు, ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు బస్సులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండటంతో పక్కకు ఒరిగిన షెడ్లు తొలగించామని పురపాలక కమిషనర్‌ రవిరెడ్డి చెప్పారు.

300822ap-main4b.jpg

ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌ ఆగ్రహం: ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 201 అన్నక్యాంటీన్లను మూసేశారన్నారు. పేదవాడి నోటికాడ కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. కుప్పంలో దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.

ఆటంకాలు ఎదురైనా అన్నదానం కొనసాగించండి: చంద్రబాబు
‘పేదవాడి ఆకలి తీర్చేందుకు తెదేపా అన్నం పెడుతుంటే.. వరుసగా దాడులు చేయించి, కేసులు పెట్టి అధికార పార్టీ అడ్డుకోవాలని చూస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించండి. ఈ దాడిని గ్రామగ్రామాన ప్రజలకు తెలిసేలా చేయండి. మనం మంచి చేయాలని ప్రయత్నిస్తే చెడు చేసేందుకు అధికారపార్టీ రౌడీలు ఉంటారు. వాళ్ల అంతు చూస్తా. అన్నక్యాంటీన్‌ వద్ద, ప్రధాన నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేద్దాం. అవసరమైతే కోర్టుకెళ్దాం. కుప్పం నుంచే ధర్మపోరాటం ప్రారంభిద్దాం’ అని తెదేపా శ్రేణులకు చంద్రబాబు భరోసా కల్పించారు. మంగళవారం నియోజకవర్గ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. శాంతియుతంగా ఉన్న కుప్పం.. వైకాపా వల్ల రణరంగంగా మారిందని, ప్రజలు వైకాపాను బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...