Jump to content

Kompa deesi pisco anna aithe kaadu kada


csrcsr

Recommended Posts

 

301761315_106565468850659_29541290920207

 

కొంత మంది CID వాళ్ళు తాలిబన్లు , ISIS వాళ్ళకి పుట్టినట్టు ఉన్నారు , 2 సంవత్సరాల పిల్లల్ని చంపుతారట 🤦

Link to comment
Share on other sites

Em lathkoru lanjalunnarra db lo.. ninna thega dramalu dengaru kadara dallas aunties vishyamlo? Mana rights lafada anukunta.. ekkadalenininity chupinchanaru.. ippudud own country own state lo okkanni kukkani kottinattu kodithe reasons vethukuthunnaru.. comedy chesthunnaru

Link to comment
Share on other sites

దుస్తులు విప్పి మరీ కొట్టారు
న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమైన యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు వెంగళరావు
గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
వర్గ వైషమ్యాలు ప్రేరేపిస్తున్నారని కేసు
కోర్టులో చెబితే నా రెండేళ్ల కుమారుణ్ని చంపేస్తామన్నారు
సీఐడీ చెప్పినట్లు వినకపోతే నా కుటుంబం మిగలదని బెదిరించారని మేజిస్ట్రేట్‌కు బాధితుడి వాంగ్మూలం
అమరావతి, న్యూస్‌టుడే- గుంటూరు నేరవార్తలు, లీగల్‌: వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ, పరిపాలనలో తప్పిదాల్ని ఎత్తిచూపుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేసే ‘ఘర్షణ’ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావు (34)ను సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రజల్లో వర్గ వైషమ్యాలను ప్రేరేపిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అంతమొందిస్తానంటూ బెదిరిస్తున్నారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీసీలోని సెక్షన్‌ 153ఏ, 505 (2), 506, 386, 120బీ, ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్తుండగా తెలంగాణలోని కోదాడ వద్ద గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెంగళరావు సీఐడీ అధికారుల అదుపులోనే ఉన్నారు. ‘సీఐడీ పోలీసులు నన్ను దుస్తులు విప్పి, తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని మీతో చెబితే నా రెండేళ్ల కుమారుడ్ని చంపేస్తామంటూ బెదిరించారు’ అని వెంగళరావు న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆయన్ను గుంటూరు ఆరో అదనపు మెజిస్ట్రేట్‌ శృతి ఎదుట హాజరుపరిచారు. విచారణ పేరిట సీఐడీ పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారంటూ వెంగళరావు.. న్యాయమూర్తికి వివరించగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. దానిలో ప్రధానాంశాలివీ.
చిత్రహింసలు పెట్టారు..
‘నా రెండు చేతులు పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్ర పెట్టి అరికాళ్లపై కొట్టారు. బల్లపై పడుకోబెట్టి, నా నడుంపై కూర్చొని కాళ్లు పైకి ఎత్తి కొట్టారు. ఒక కర్రతో నా వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి నన్ను భయపెట్టారు. ‘ఎంపీ రఘురామకృష్ణరాజును కొడితేనే దిక్కులేదు. నిన్ను కొడితే కోర్టులు ఏం చేయగలవు? నిన్ను కొట్టిన విషయం న్యాయమూర్తితో చెబితే నువ్వు బయటకు వచ్చాక నిన్ను చంపేసినా కూడా కోర్టులు ఏమీ చేయలేవు. మేం చెప్పినట్లు వింటేనే బతుకుతావు. లేదంటే నువ్వు, నీ కుటుంబం మిగలదు’ అని బెదిరించి కొట్టి, నాతో ఓ కాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఆ కాగితంలో ఉన్న విషయాలేవీ వాస్తవాలు కాదు.
ఇంకోసారి వీడియోలు చేస్తే చంపేస్తాం..
యూట్యూబ్‌ వీడియోల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఇంకోసారి మాట్లాడితే చంపేస్తాం. కావాలనుకుంటే వైకాపాకు అనుకూలంగా వీడియోలు చేసుకో. లేదంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ సీఐడీ అధికారులు నన్ను బెదిరించారు. ‘మేం కొట్టామని నువ్వు బయట చెప్పినా ఎవరూ నమ్మరు. నీకు ఒంటిపై గాయాల్లేవు. అదే మా టాలెంట్‌’ అని అన్నారు. ‘నాకు భార్య, రెండేళ్ల కుమారుడు, 60 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులు ఉన్నారు. నన్ను చంపేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది’ అని వెంగళరావు వాపోయారు.
కొట్టామని చెబితే బెయిల్‌ రాదని బెదిరించారు
‘మేం కొట్టామని న్యాయమూర్తితో చెబితే నీకు బెయిల్‌ రాదు. కొట్టలేదని చెబితేనే బెయిల్‌ వస్తుంది. నెల రోజుల కిందట వెంకటేశ్‌ అనే వ్యక్తి తనను సీఐడీ అధికారులు కొట్టారని న్యాయమూర్తితో చెప్పారు. అతనికి రెండు నెలలు బెయిల్‌ రాలేదు. నీకూ అదే పరిస్థితి వస్తుంది’ అంటూ సీఐడీ అధికారులు తనను బెదిరించారని వెంగళరావు వాంగ్మూలం ఇచ్చారు.
శుక్రవారం రాత్రి సీఐడీ పోలీసులు వెంగళరావుకు ప్రాథమిక వైద్యపరీక్షలు జరిపించి, మేజిస్ట్రేట్‌ శృతి ఇంటి వద్ద హాజరుపరిచారు. పోలీసులు కొట్టడంతో తన ఒంటికి గాయాలయ్యాయని ఆయన చూపించడంతో న్యాయమూర్తి తిరిగి వైద్యపరీక్షలకు ఆదేశించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో వెంగళరావును సుమారు 11.55 గంటలకు జీజీహెచ్‌కు వైద్యపరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. శనివారం ఉదయం వైద్యులు పరీక్షలు చేసి, నివేదికను సీల్డ్‌ కవర్‌లో జడ్జికి అందజేస్తారు.
Andhra News: దుస్తులు విప్పి మరీ కొట్టారు
కదలికలపై నిఘా పెట్టి..
గురువారం కుప్పంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో డీజీపీని కలవటానికి వెళ్లిన బృందంలో వెంగళరావు ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆయన కదలికలు, సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టి హైదరాబాద్‌ వెళుతున్న ఆయన్ను కోదాడలో అదుపులోకి తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య, తల్లిదండ్రులు, తెదేపా నాయకులతో కలిసి శుక్రవారం ఉదయం సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ తెదేపా నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, చిట్టాబత్తిన చిట్టిబాబు, తదితరులు ఆందోళనకు దిగారు. గతేడాది అక్టోబరులో రేషన్‌కార్డు తొలగించారని గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించినందుకు నాపైన, నా కుమారుడిపైనా పోలీసులు కేసు పెట్టారని వెంగళరావు తల్లి సుబ్బమ్మ మీడియాతో చెప్పారు. ట్రాక్టరు నడుపుతూ జీవిస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించారు.
301040647_611915300466105_47060874374613
301863709_611915370466098_44864075956519
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...