Jump to content

AP CID pundakors


psycopk

Recommended Posts

చేతులు పైకి కట్టి అరికాళ్లపై కొట్టారు.. నా కుటుంబాన్ని చంపేస్తామన్నారు : ఏపీ సీఐడీపై మెజిస్ట్రేట్ కు యూట్యూబ్ నిర్వాహకుడు వెంగళరావు వాంగ్మూలం 

27-08-2022 Sat 11:39
  • 'ఘర్షణ' యూట్యూబ్ నిర్మాహకుడు బొబ్బూరి వెంగళరావును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • టార్చర్ పెట్టారంటూ మేజిస్ట్రేట్ కు వెంగళరావు వాంగ్మూలం
  • రఘురామకృష్ణరాజుకే దిక్కులేదు.. నిన్ను కోడితే కోర్టులు ఏం చేస్తాయన్నారని చెప్పిన వెంగళరావు
AP CID tortured me told Bobburi Vengala Rao to Magistrate

వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న 'ఘర్షణ' యూట్యూబ్ నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సులో వస్తుండగా... కోదాద వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయనను నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. ఆ తర్వాత ఆయకు ప్రాథమిక వైద్య పరీక్షలను నిర్వహించి... నిన్న రాత్రి గుంటూరు ఆరో అదనపు మెజిస్ట్రేట్ శృతి ఎదుట ఆమె నివాసంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ శృతి నమోదు చేసుకున్నారు. 

తన రెండు చేతులను పైకి కట్టేసి, వాటి మధ్యలో కర్ర పెట్టి, అరికాళ్లపై కొట్టారని మేజిస్ట్రేట్ కు వెంగళరావు చెప్పారు. బల్లపై పడుకోబెట్టి, తన నడుంపై కూర్చొని, కాళ్లు పైకి ఎత్తి కొట్టారని తెలిపారు. తన వృషణాల్లో కూడా పొడిచే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొడితేనే దిక్కులేదు... నిన్ను కొడితే కోర్టులు ఏం చేస్తాయని సీఐడి పోలీసులు అన్నారని చెప్పారు. నిన్ను కొట్టిన విషయం కోర్టుకు చెప్పకూడదని, ఒక వేళ చెపితే బయటకు వచ్చాక నిన్ను చంపినా కోర్టులు ఏమీ చేయలేవని హెచ్చరించారని అన్నారు. తాము చెప్పినట్టు వింటేనే బతుకుతావని... లేకపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా మిగలదని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. తనను కొట్టిన తర్వాత ఒక కాగితంపై సంతకం చేయించుకున్నారని... ఆ కాగితంలో ఉన్న విషయాలు వాస్తవాలు కాదని తెలిపారు. 

తాము కొట్టామని మేజిస్ట్రేట్ కు చెపితే నీకు బెయిల్ కూడా రాదని, కొట్టలేదని చెపితేనే బెయిల్ వస్తుందని చెప్పారని వెంగళరావు తెలిపారు. సీఐడీ అధికారులు తనను కొట్టారని రెండు నెలల క్రితం న్యాయమూర్తితో వెంకటేశ్ అనే వ్యక్తి చెప్పాడని... ఆయనకు బెయిల్ రావడానికి రెండు నెలలు పట్టిందని చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ వీడియోల్లో మాట్లాడితే చంపేస్తామని సీఐడీ అధికారులు హెచ్చరించారని చెప్పారు. కావాలనుకుంటే వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేయాలన్నారని తెలిపారు. తాము చెప్పినట్టు వినకుంటే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని హెచ్చరించారని చెపుతూ కంటతడి పెట్టుకున్నారు. మేము కొట్టినట్టు బయట చెప్పినా ఎవరూ నమ్మరని... ఒంటిపై గాయాలు లేకుండా కొట్టడమే తమ ట్యాలెంట్ అని చెప్పారని తెలిపారు. తనకు భార్య, రెండేళ్ల కుమారుడు, 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు ఉన్నారని... తనను చంపేస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పారు. 

వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ శృతి నమోదు చేశారు. సీఐడీ పోలీసులు కొట్టిన గాయాలను మేజిస్ట్రేట్ కు వెంగళరావు చూపించారు. దీంతో, ఆయనకు తిరిగి వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. దీంతో, రాత్రి 11.55 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జీజీహెచ్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో జడ్జికి అందజేయనున్నారు. మరోవైపు వెంగళావుపై సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు

Link to comment
Share on other sites

Power lo daakha vasthey cheyali anukuntey eelu vinaru. Oka 5-10 min motham poi station ki antunchali. Okokka police lk ni guddaludadesi kottali antha lbr lk ni recruit cheskunadu 420 gadu

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Repu tdp power loki vaste ee naa kodukulu aa state lo dakuntaro chudam

Ante last time TDP power lo vunapudu ila chesinanduke...YCP ollu ulta latkainchi kodtunaru ani talk mari...

Political Punch gaadini etla lopala esinaro marchipoinara ? anti-TDP comments pettinanduku lock la esi methaga thominaru, marchipoinara ? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...