Jump to content

Sita raman medha na opinion


anna_vendy

Recommended Posts

**కధే కదా ఎలాగైనా గోల్ గోల్ తిప్పచ్చు**

కొంచెం దేశభక్తి, దేశద్రోహం, కాశ్మీరు,కార్గిల్, జీహాద్, పాకిస్తాను, మన సైనికులు, దేశంకోసం యుద్ధం చేయడం, అంతలోనే పట్టుబడడం, విడుదలకోసం బేరం, పెళ్ళాంపిల్లల కోసం దేశద్రోహం, అలా మొత్తం మాస్ దేశభక్తి మిలటరీ మసాలా ఓ వైపు....

అనాధ సోల్జర్, ప్రేమతో కూడిన పిలుపుకే మొగం వాసి వుంటే మూటల మూటల ఉత్తరాలు, చిట్టీ ఆయాహై, ఆయాహై అని సంబరాలు, అందులో లేని బంధాలు, ప్రేమలు, పెళ్ళాలు, చెల్లెల్లు అలా సెంటిమెంటుతో కాల్చి డికాషాన్ వడపోసే హీరో,.సెంటిమెంటు మరోవైపు....

మహారాణి కోటను వదిలి ఓ సైనికుడు కోసం అనాధ కోసం అన్నీ వదిలి కులం,మతం వదిలి ఓ దేశ అధ్యక్షునికే కాబోయే కోడలు స్టేటస్ వదిలి లవ్ యూ రాజా అని చెంగుచెంగున మామూలు సైనికుడు కోసం రావడం,.. ఇన్షా అల్లా అనేట్లుండడం...

ఓ అనాధ రిచ్ గా పెరిగి లండన్ లో కారు తగలబెట్టడం, విపరీతమైన ద్వేషం ఆటిట్యూడ్, తాత అంటే గౌరవమే వుండదు కాని పదిలక్షలు కట్టేకి తాతను అడిగేకి రావడం,,.. ఈమెకు మన బట్టేబాజ్ అనుకుంటూ హైదరాబాదీ పనులన్నీ వదులుకొని తిరగడం,....

ఏమి సింక్ కాని కధ... అంతా కలగాపులగం,.. విపరీతమైన ట్విస్టులు,.. భాషా సినిమాలో మాదిరి ఫ్లాష్ బాక్ మీద ఫ్లాష్ బ్యాకులు.. అసలు ఏ పాత్ర ఎంట్రీ ఎందుకో.. ప్రతిపాత్రకుఒకటే బిల్డపు, మరల ట్రెజర్ హంట్ మాదిరి దేవులాడతా పోవడం,....

ఆ సినిమా కధ ఓ పది పాత సినిమాలు సిడి లు చూసి రాసుకోవడం... సీన్లు కాపీ, డైలాగులు కాపీ... బ్రహ్మోత్సవం, మహానటి,మల్లీశ్వరి,రోజా, గదర్ అలా చాలా వాటిని మిక్సిలో గిలకొట్టడం.... ఏమాత్రం సంబంధంలేని అటైర్, మేకప్ లు, బిల్డపులు... దీనికి మరలా ఇంతవరకూ ఇటువంటి ప్రేమకధ రాలేదని బిల్డపు రివ్యూ రాతలు..... ఆర్మీ మీద అవాకులు చెవాకులు పనికిమాలిన సీన్లు,.,,

సైనికుని రేడియో ఇంటర్వ్యూ విని ఓ అమ్మాయి చిలిపిగా జాలితో పెళ్ళాం అని ఉత్తరాలు రాస్తోంది అని ఎలివేషన్ బిల్డపు ఇచ్చి..తరువాత ఆమెను ముందే రక్షించింటే చూసి లవ్ లో పడిందని కధానాయకి పరువు తీయడము..... హీరోనేమో ఆమె ప్రిన్సెస్ అని పేపర్లో మొదటలోనే తెలిసినా తెలియనట్లు ముగ్గులో దింపి ఆమెకు తెలియనట్లు డ్రామాలాడి ఆఖరు సీన్లో వార్తాపత్రిక క్లిప్ చూపి అతని కారక్టరు పట్ల సాఫ్టుకార్నర్ ను లేపేయడం...... హీరోను చంపేసి, పధకమిచ్చేసి దేశభక్తి మనుషులలో వేయడం...ఇది ప్రేమ కధా,,, దేశభక్తి కధా, అని అనుమానం వచ్చే జంపింగ్ జపాంగ్ సీన్లుతో ఇష్ఠమొచ్చినట్లు కధనం స్క్రీన్ప్లే...

అసలు మన జవాన్లను మన ఆర్మీ డిస్ వోన్ చేసుకోవడం.... పాకిస్తాన్ ఆర్మీలో సింపతీ చూపించడం... మన ఆర్మీ ఆఫీసర్లను సెల్ఫిష్ గా చూపించడం. మన దేశ రహస్యాలు కోఆర్డినేట్సు ప్రాణభయం ఫామిలీ భయంతో చెప్పారని చూపడం.. అసలు మన జవాను పాక్ భూభాగంలో పడితే 60 గంటలలోనే అభినందన్ వర్ధమాన్ ను ఇటీవలే ఫిభ్రవరి 2019 లో వెనక్కి రప్పించిన మన భారతదేశ ఘనత, ఆయనకు వీరచక్ర అవార్డు ఇవ్వడం ఈ సినిమా తీసిన మేధావులకు తెలియదేమో,,, అసలు ఆర్మీ ఆఫీసర్లు చూస్తే మన మద్రాసు రెజిమెంటును అవమానంగా చూపించారని బొక్కలో వేస్తారు..ఈ తొక్కలో సినిమా తీసినోళ్ళను...

సీత కాని సీత నూర్జహాన్.... రాముడు కాని రాముడు దుల్హర్.. రామాయణం కు సంబంధంలేని గోలాయణం.,.
అంతా కలిపితే రామాయణంలో సీత,..సీతారామం.. కురుక్షేత్రంలో రావణసంహారం... దీపావళిలో సీతాకళ్యాణం అంత అసంబద్ధమైన వీరవిక్రమ, అవక్రమ,పరాక్రమ, దేశభక్తి, దేశద్రోహ, లవ్ కాదల్ ఇష్కు, పుస్కు, ఢాం ఢూం డుస్సు సినిమా,..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...