Jump to content

Nenu Meeku Baaga Kavalsinavaadini movie review


Telugumoviereviews

Recommended Posts

Nenu%20Meeku%20Baaga%20Kavalsinavaadini.

'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇతర కుర్ర హీరోల కంటే వేగంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది అతను నటించిన 'సెబాస్టియన్', 'సమ్మతమే' సినిమాలు విడుదల కాగా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 'సమ్మతమే' అయినా కాస్త పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది కానీ, 'సెబాస్టియన్' మాత్రం దారుణంగా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఇందులో కిరణ్ పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రం కిరణ్ కి విజయాన్ని అందించేలా ఉందో లేక కేవలం తాను చేసిన సినిమాల సంఖ్య పెంచుకోవడానికి అన్నట్లు ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

సిటీలో క్యాబ్ డ్రైవర్ గా పని చేసే వివేక్(కిరణ్)కి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న తేజు(సంజనా) గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా బాధగా, దేవదాసులా మందు తాగుతూ ఉంటుంది. అసలు ఆమె మనసులో ఉన్న బాధ ఏంటి? ఆమె ఇలా మద్యానికి బానిస ఎందుకైంది? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు వివేక్. తేజు జీవితంలో జరిగిన విషాదం ఏంటి? అసలు వివేక్ ఎవరు? అతనికి, తేజుకి సంబంధం ఏంటి? అతను తేజు గురించి తెలుసుకోవడానికి ఎందుకంత తపన పడుతున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

టైటిల్ అయితే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అని ఆసక్తికరంగా పెట్టారు కానీ సినిమానే ఆకట్టుకునేలా లేదు. రొటీన్ కథా కథనాలతో చాలా సాదాసీదాగా సాగిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరో ఇలాంటి రొటీన్ సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Nenu Meeku Baaga Kavalsinavaadini movie review

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...