Jump to content

Alluri, krishna vrinda vihari


JAI_NTR

Recommended Posts

  • JAI_NTR changed the title to Alluri movie v/s vrinda vihari
  • JAI_NTR changed the title to Alluri, krishna vrinda vihari

Krishna%20Vrinda%20Vihari.webp

2018లో వచ్చిన 'ఛలో'తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య ఆ తర్వాత ఆ స్థాయి విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ గ్యాప్ లో అతను హీరోగా నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవేవీ సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'కృష్ణ వ్రింద విహారి'. మొదటి సినిమా 'అలా ఎలా'(2014)తో దర్శకుడిగా మెప్పించిన అనీష్ ఆర్.కృష్ణ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు 'లవర్', 'గాలి సంపత్'తో నిరాశపరిచాడు. ఇది అతని దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా. మరి ఈ చిత్రం హీరోగా నాగ శౌర్యకి, డైరెక్టర్ గా అనీష్ కి విజయాన్ని అందించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:

తల్లి చాటు బిడ్డలా పద్ధతి, విలువలతో పెరిగిన బ్రాహ్మణ యువకుడు కృష్ణ చారి(నాగ శౌర్య) జాబ్ చేయడం కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ తన ఆఫీస్ లో టీమ్ లీడ్ అయిన వ్రింద(షెర్లీ సెటియా)తో ప్రేమలో పడతాడు. తనకి పూర్తి విరుద్ధమైన అలవాట్లు ఆమెకి ఉన్నాయని తెలిసినా, ఆమెకి పిల్లలు పుట్టరని తెలిసినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. పైగా కృష్ణ తల్లి అమృతవల్లి(రాధిక) చనిపోయిన తన తల్లి తనకు మనవరాలిగా పుడుతుందని ఆశ పడుతుంది. ఈ క్రమంలో వ్రిందని పెళ్లి చేసుకోవడం కోసం కృష్ణ ఏం చేశాడు? అతను చెప్పిన ఒక అబద్దం కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరికి కృష్ణ, వ్రింద పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారా? తెలియాలంటే సినిమా చూడాలి.

'అంటే సుందరానికీ' చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తుంటే పదే పదే ఆ సినిమా గుర్తుకొచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి 'అంటే కృష్ణకీ' అనే టైటిల్ కూడా పెట్టాలనిపిస్తుంది. ఆ సినిమా చూడని వాళ్లకి మాత్రం 'కృష్ణ వ్రింద విహారి' పర్లేదు అనిపిస్తుంది. పెద్దగా అంచనాల్లేకుండా కుటుంబమంతా కలిసి కాసేపు కాలక్షేపానికి చూద్దామనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Krishna Vrinda vihari Movie review and rating

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...