Jump to content

development chetakanapudu em chestam?? unnavatini taakatu pedatam.. perlu marustam...


psycopk

Recommended Posts

ప్రతిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆంధప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి విడదల రజనీ ఈ సవరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసన సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉండి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కావాలనే సభ్యులతో గొడవ చేయించారని ఆరోపించారు.

ఎన్టీఆర్ కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఎన్టీఆర్ పై తనకు మమకారమే ఉందన్నారు. కానీ, ఎన్టీఆర్ అనే పదమే చంద్రబాబుకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బ్రతికే ఉండేవారని అన్నారు. ఎన్టీఆర్ బ్రతికి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని అన్నారు. 

అంతకుముందు ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ... రూపాయి డాక్టర్ గా వైఎస్ఆర్ అందరికీ సుపరిచితం అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్‌ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు  చేశారని, వాటిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని తెలిపారు. ఆ క్రెడిట్ తీసుకోవాలనే .. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు.

Link to comment
Share on other sites

రెండూ ఒకే రోజు.. దేవుడి స్క్రిప్ట్‌.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో..?: నారా లోకేశ్ ట్వీట్‌

21-09-2022 Wed 20:05
  • ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చిన జ‌గ‌న్ స‌ర్కారు
  • ఇది జరిగిన కొన్ని గంట‌ల‌కే జ‌గ‌న్ అధ్య‌క్ష ఎన్నిక చెల్ల‌దంటూ ఈసీ ప్ర‌క‌ట‌న‌
  • రెండింటినీ మిక్స్ చేసి జ‌గ‌న్‌పై సెటైర్ వ‌దిలిన లోకేశ్
nara lokesh satires on ap cm ys jagan
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ బుధ‌వారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. సీఎం హోదాలో విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును అసెంబ్లీ వేదిక‌గా వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా జ‌గ‌న్ మార్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. 

వ‌రుస‌గా జ‌రిగిన ఈ రెండు కీల‌క ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌పై నారా లోకేశ్ సెటైర్ సంధించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యకుడు కాకుండా పోయాడు అంటూ లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జ‌రిగాయ‌ని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జ‌గ‌న్ భ‌విష్య‌త్తు ఏమిటోనన‌ని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న ట్వీట్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్ర‌తిని కూడా ఆయ‌న జ‌త చేశారు.
Link to comment
Share on other sites

ప్రభుత్వం మారిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతాం: సీఎం రమేశ్

21-09-2022 Wed 16:58
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టిన జగన్ ప్రభుత్వం
  • ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేని జగన్ పేర్లు మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న రమేశ్
  • వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని మండిపాటు
Will rename health university as NTR university says CM Ramesh
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును తొలగించడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని అన్నారు. 

ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సుగ్గుగా సమర్థించుకోవడం దారుణమని చెప్పారు. దేశ, విదేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి తెలుగువాడిని ఆవేదనకు గురి చేస్తోందని చెప్పారు.

మూడేళ్ల పాలనలో ఒక్క రోడ్డు, భవనం, ప్రాజెక్టును కూడా నిర్మించలేని జగన్ పాత వాటి పేర్లను మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని చెప్పారు.
Link to comment
Share on other sites

జగన్ ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో తెలియదు: నారా లోకేశ్

21-09-2022 Wed 16:35
  • ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చిన వైసీపీ ప్రభుత్వం
  • అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం.. మండిపడిన లోకేశ్
  • బిల్లులను ఏకపక్షంగా ఆమోదిస్తున్నారని విమర్శ 
  • తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్టీఆర్ పేరే పెడతామని ఉద్ఘాటన
Lokesh slams CM Jagan decision on NTR Health University name change
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శించారు. 

ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వైసీపీ నేతలు కూడా ఇష్టపడడంలేదని అన్నారు. ఏ ఆత్మతో మాట్లాడి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదని వ్యంగ్యం ప్రదర్శించారు. 'మేం అధికారంలోకి వచ్చాక ఇదే రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి' అని పేర్కొన్నారు. రాష్ట్రాలకు కూడా పేర్లు మార్చుకుంటూ పోతే ఇంకెలా ఉంటుందో చూడండని అన్నారు. 

"మోదీ గారు దేశ ప్రధానిగా రెండో పర్యాయం కూడా గెలిచారు. కానీ ఢిల్లీలో ఇందిరా గాంధీ పేరుతో ఎయిర్ పోర్టు ఉంటే ఆమె పేరును ఆయన తొలగించలేదు. హైదరాబాదులో ఉన్న ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు తొలగించలేదు. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, వామపక్షాలు ఖండిస్తున్నాయి. సభలో తామెంత పోరాడినా 9 బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకున్నారు" అని లోకేశ్ మండిపడ్డారు. 

తమకు భయపడి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే పెట్టారని, వీళ్లు పిరికివాళ్లని, ఈ సైకో తమను తట్టుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరే పెడతామని లోకేశ్ స్పష్టం చేశారు. ఇది ఇవాళ పెట్టిన పేరు కాదని, 1998లో చంద్రబాబు పెట్టిన పేరని అన్నారు. చంద్రబాబు హయాంలోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వచ్చిందని వెల్లడించారు.
Link to comment
Share on other sites

మేం కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావు: అచ్చెన్నాయుడు

21-09-2022 Wed 14:49
  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు
  • బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
  • టీడీపీ సభ్యుల సస్పెన్షన్
  • తుళ్లూరు పీఎస్ ఎదుట బిల్లు ప్రతులను దగ్ధం చేసిన టీడీపీ నేతలు
Atchannaidu leads protest against NTR Health University name change
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. 

వారు శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. 

నిరసన సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్ కు అర్థంకావడంలేదని తెలిపారు. 

టీడీపీ హయాంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్ పేరు తొలగించలేదని వెల్లడించారు. సీఎం జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించండి: జగన్ కు వల్లభనేని వంశీ విన్నపం

21-09-2022 Wed 12:32
  • ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలన్న వంశీ
  • ఎన్టీఆర్ జిల్లాను సీఎం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని వ్యాఖ్య
  • ఎన్టీఆర్ కు టీడీపీ కంటే వైసీపీ ప్రభుత్వమే ఎక్కువ గుర్తింపునిచ్చిందన్న వంశీ
Vallabhaneni Vamsi requests Jagan to continue NTR name to health university
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని విన్నవించారు. పెద్ద మనసుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారని... జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, విప్లవాత్మకమని చెప్పారు. ఎన్టీఆర్ కు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వని గుర్తింపును కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని కొనియాడారు. ఎన్టీఆర్ చొరవతోనే హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటయిందని... ఈ నేపథ్యంలో యూనివర్శిటీకి ఆయన పేరునే కొనసాగించాలని కోరారు.
Link to comment
Share on other sites

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడంపై అసంతృప్తి... యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా..

21-09-2022 Wed 12:16
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడంపై అసంతృప్తి
  • ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదన్న యార్లగడ్డ
  • టీడీపీ సిద్ధాంతాలను చంద్రబాబు పాటించడం లేదని విమర్శ
Yarlagadda resigns to Adhikara Bhasha Sangham
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై సొంత పార్టీలో సైతం కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్సార్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని... కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని... అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

తెలుగుగంగ ప్రాజెక్టుకు 'ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు'గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నామకరణం చేశారని గుర్తుచేశారు. అందుకే తనకు వైఎస్సార్ అంటే అంత గౌరవమని అన్నారు. చంద్రబాబుపై తనకు కోపం ఉండటానికి కారణం ఏమిటంటే... టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన వెళ్తున్నారని అన్నారు. వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు. 

అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని... అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని... కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సిద్ధంగా ఉంటే... చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని ఆయన భావించారని చెప్పారు.
Link to comment
Share on other sites

చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించి మీ పేరు పెట్టుకోండి... హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై చంద్రబాబు ఫైర్

21-09-2022 Wed 09:37
  • ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం
  • 1986లో ఈ హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్న చంద్రబాబు
  • ఈ యూనివర్శిటీతో వైఎస్సార్ కు ఏం సంబంధమని ప్రశ్న
Chandrababu fires on NTR health university name change
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరును పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన బిల్లును కాసేపటి క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... ఎన్టీఆర్ పేరు తొలగింపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 

'ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్సార్ సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.  

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, వైఎస్సార్ కు ఏం సంబంధం ఉంది?

దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా... ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...