Jump to content

Nene Vasthunna Movie review


Telugumoviereviews

Recommended Posts

nene-vasthunna-movie-review.webp

తమిళ్ హీరో ధనుష్ కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. 'రఘువరన్ బి.టెక్' సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఓటీటీలోనూ ఇక్కడ ధనుష్ సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువే. పైగా ఇటీవల 'తిరు' సినిమాతో ఆకట్టుకున్నాడు. ధనుష్ సినిమా వస్తుందంటే తెలుగులోనూ అంతోఇంతో బజ్ ఉండటం సహజం. అయితే అతని తాజా చిత్రం 'నేనే వస్తున్నా' గురించి  మాత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. పైగా ఈ చిత్రానికి '7G బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. దానికితోడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. అయినప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు. మరి సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం అంతే సైలెంట్ గా వెళ్లిపోయేలా ఉందో లేక మౌత్ టాక్ తో హిట్ కొట్టేలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఇది కవల సోదరుల కథ. ప్రభు(ధనుష్), కథిర్(ధనుష్) కవల సోదరులు. ప్రభు సాధారణంగా ఉంటే, కథిర్ మాత్రం చిన్నతనం నుంచే వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పదేళ్ల వయస్సులోనే మనషుల ప్రాణాలు తీసే అంత పైశాచికంగా అతని ప్రవర్తన ఉంటుంది. దీంతో కథిర్ కి భయపడి ప్రభుని దూరంగా తీసుకెళ్లి పెంచుతుంది తల్లి. ప్రభు పెద్దవాడై మంచి ఉద్యోగం చేస్తూ భార్య, కూతురితో ఆనందంగా జీవిస్తుంటాడు. అయితే కూతురికి 10-12 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఒకసారి ముగ్గురు కలిసి ఉత్తరభారదేశం ట్రిప్ కి వెళ్లి వస్తారు. అప్పటి నుంచి కూతురి ప్రవర్తనలో మార్పు వస్తుంది. తనకు మాత్రమే కనిపించే ఓ అదృశ్య వ్యక్తితో మాట్లాడుతుంటుంది. అసలు ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? కథిర్ కి, అతనికి సంబంధమేంటి? ఈ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? అతని నుంచి కూతురిని రక్షించుకోవడం కోసం ప్రభు ఏం చేశాడు? అనేది మిగతా కథ.

ధనుష్, సెల్వ రాఘవన్ కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం. అయితే ఈ 'నేనే వస్తున్నా' సినిమా సగం ఉడికించి ప్రేక్షకుల మీదకు వదిలిన సైకలాజికల్ థ్రిల్లర్. కొన్ని కొన్ని సన్నివేశాలు, ధనుష్ నటన కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Dhanush's Nene Vasthunna movie review

Link to comment
Share on other sites

  • 5 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...