Jump to content

The Ghost movie back to back hits


kittaya

Recommended Posts

the-ghost-movie-review.webp

ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' చిత్రంతో అలరించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన నాగార్జున.. మరోసారి అదే జోనర్ ఫిల్మ్ 'ది ఘోస్ట్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రానికి 'పిఎస్‌వి గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకుడు కావడంతో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బాగానే ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నాగార్జునకు ఆశించిన విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
విక్రమ్(నాగార్జున) దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తుంటాడు. క్లిష్టమైన ఆపరేషన్స్ లో పాల్గొంటూ క్రిమినల్స్ పాలిట యముడిలా ఉండే విక్రమ్ ని తన చిన్ననాటి గతం వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు అనుకోని ఓ ఘటన కారణంగా అతను తన ప్రేయసి ప్రియ(సోనాల్ చౌహాన్)కి, ఇంటర్ పోల్ కి దూరమవుతాడు. అలా రోజులు గడిచిపోతుండగా చాలా ఏళ్ళ తర్వాత తన అక్క అను(గుల్ పానాగ్) నుంచి విక్రమ్ కి ఫోన్ వస్తుంది. తన మేనకోడలు అదితి(అనిఖా సురేంద్రన్)కి ప్రాణహాని ఉందని తెలిసి ఊటీ బయలుదేరుతాడు విక్రమ్. అసలు అదితిని చంపాలనుకుంటుంది ఎవరు? వాళ్లెవరో కనిపెట్టి విక్రమ్ వాళ్ళనుంచి అదితిని రక్షించగలిగాడా? అదితిని రక్షించే క్రమంలో విక్రమ్ తెలుసుకున్న విషయాలు ఏంటి? అదితిని చంపడానికి వచ్చిన వారికి, విక్రమ్ కి సంబంధమేంటి? అండర్ వరల్డ్ విక్రమ్ ని ఘోస్ట్ అని ఎందుకు పిలుస్తుంది? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

టీజర్, ట్రైలర్ చూసి అంచనాలు పెట్టుకొని 'ది ఘోస్ట్' సినిమాలకి వెళ్తే నిరాశ చెందక తప్పదు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్కడక్కడా మాత్రమే ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే యాక్షన్ ప్రియులను అలరించే అంశాలు మాత్రం ఇందులో పుష్కలంగా ఉన్నాయి. For more information visit Teluguone.com official website

Click here to get more details about The Ghost movie review and rating

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...