Jump to content

Kantara kannada movie


KrishnaDevaRaya

Recommended Posts

9 hours ago, Starblazer said:

Rakshit Shetty cartel undi... vaadi below average movies kooda KGF range lo leputaru. they manage IMDB ratings, reviews, and run social media campaigns. mostly shettys political backing kooda untundi. vaadini pan-India star cheyyalani Baahubali time nundi PR campaigns run chestunnaru but anukunnantha workout avvaledu. Kantara lo vaalla anna hero & director ga chesadu. so, kontha varaku fake undochu. moreover, Kannada culture chupinchadu, so TG la vaallu kooda regional feeling tho konchem positive ga respond ayi untaru. movie chusthe thappa cheppalem.

Most kannada movies are overrated. Recent movie vikrant rona pedda hit, movie chuste em ledu. 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

23 minutes ago, IamBhagatSingh said:

Most kannada movies are overrated. Recent movie vikrant rona pedda hit, movie chuste em ledu. 

Kannada ollu KGF is India's biggest Kalacondom ani feel itu untaru...

Kananda film fans act like bangladesh cricket fans....

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, sarfaroshi said:

Kannada ollu KGF is India's biggest Kalacondom ani feel itu untaru...

Kananda film fans act like bangladesh cricket fans....

ee sala cup namde :giggle:

  • Haha 1
Link to comment
Share on other sites

13 hours ago, Starblazer said:

Rakshit Shetty cartel undi... vaadi below average movies kooda KGF range lo leputaru. they manage IMDB ratings, reviews, and run social media campaigns. mostly shettys political backing kooda untundi. vaadini pan-India star cheyyalani Baahubali time nundi PR campaigns run chestunnaru but anukunnantha workout avvaledu. Kantara lo vaalla anna hero & director ga chesadu. so, kontha varaku fake undochu. moreover, Kannada culture chupinchadu, so TG la vaallu kooda regional feeling tho konchem positive ga respond ayi untaru. movie chusthe thappa cheppalem.

Yes vaadi avane srimannarayana lepithe chusa , worst untadhi dhanni ela leparu anipinchindhi 

  • Upvote 1
Link to comment
Share on other sites

kantara-telugu-review.webp

'కేజీఎఫ్' తర్వాత కన్నడ సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. 'కేజీఎఫ్'ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇటీవల వచ్చిన 'కాంతార'పై అందరి దృష్టి పడింది. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొని రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. రేపటి నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది.

'కాంతార' తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. డబ్బింగ్ సినిమా పరంగా చూస్తే తెలుగులో 'కాంతార' అడ్వాన్స్ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. పైగా ఇప్పుడు థియేటర్స్ లో 'గాడ్ ఫాదర్' తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దానికితోడు సోమవారం నుంచి 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. తెలుగులోనూ 'కాంతార' హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఈ వారం తెలుగు సినీ ప్రియులకు ఇదే ఫస్ట్ ఛాయస్ కానుంది. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 300 కి పైగా థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Kantara movie latest updates

Link to comment
Share on other sites

kantara.webp

రెండు వారాల క్రితం విడుద‌లైన క‌న్న‌డ చిత్రం 'కాంతార' సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీని తీసిన హోంబ‌ళే ఫిలిమ్స్ నిర్మించ‌డం ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. క‌న్న‌డంలో న‌టునిగా, ద‌ర్శ‌కునిగా త‌న‌దైన ముద్ర‌వేసిన రిష‌బ్ శెట్టి న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఉన్న‌త స్థాయిలో ఉన్నాయ‌నే పేరు వ‌చ్చింది. ఒరిజిన‌ల్ రిలీజైన రెండు వారాల త‌ర్వాత తెలుగులో దాన్ని గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా రిలీజ్ చేయాల‌ని అల్లు అర‌వింద్ సంక‌ల్పించారు. అలా వ‌చ్చిన 'కాంతార' తెలుగు వెర్ష‌న్ ఎలా ఉందంటే...

క‌థ‌
1847లో క‌ర్ణాట‌క ప‌శ్చిమ క‌నుమ‌ల్లో ఉన్న త‌న అట‌వీ భూమిని స్థానిక గిరిజ‌నుల‌కు దానం చేస్తాడు ఆ ప్రాంత రాజు. దాని వ‌ల్ల అత‌నికి అంత‌దాకా ఉండ‌ని మ‌న‌శ్శాంతి ల‌భిస్తుంది. కాలం గ‌డుస్తుంది. 1970లో అత‌ని వంశానికి చెందిన వార‌సుడు ఆ భూమిని తిరిగి త‌మ‌కు ఇచ్చెయ్యాల‌ని గిరిజ‌నుల‌ను వారికి అత్యంత ప్ర‌ధాన‌మైన భూత‌కోల పండ‌గ స‌మ‌యంలో అడుగుతాడు. కానీ దైవాగ్ర‌హానికి గురై మ‌ర‌ణిస్తాడు. 1990కి వ‌చ్చేస‌రికి కంబాల ఆట (కాడెద్దుల ప‌రుగు పందెం)లో మొన‌గాడిగా ఆ అడ‌విలో పేరు తెచ్చుకుంటాడు శివ (రిష‌బ్ శెట్టి). ఫారెస్ట్ ఆఫీస‌ర్ ముర‌ళీధ‌ర్ (కిశోర్‌) ఆ ప్రాంతాన్ని అట‌వీశాఖ‌కు స్వాధీనం చేసి, దాన్ని రిజ‌ర్వ్ ఫారెస్ట్ చెయ్యాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఈ విష‌యంలో శివ‌, ముర‌ళీధ‌ర్ మ‌ధ్య గొడ‌వ పెరిగి పెద్ద‌ద‌వుతుంది. శివ ప్రేమించే లీల (స‌ప్త‌మి గౌడ‌) అక్క‌డే ఫారెస్ట్ గార్డ‌వుతుంది. ఆమె డ్యూటీలో చేరిన రోజే, త‌న మ‌న‌సుకు విరుద్ధంగా త‌న ప్రాంతంలోనే కంచె వేసే ప‌నులు ప్రారంభించాల్సి వ‌స్తుంది. 

మ‌రోవైపు శివ‌తో త‌న‌కు కావాల్సిన ప‌నుల్ని చేయించుకుంటూ వ‌స్తుంటాడు దొర దేవేంద్ర‌ (అచ్యుత్ కుమార్‌). ఒక‌సారి శివ ఓ పెద్ద చెట్టును రంపంతో కోస్తుంటే.. అది ప్ర‌మాద‌వ‌శాత్తూ అప్పుడే అటువైపు వ‌స్తున్న ముర‌ళీధ‌ర్ జీపుపై ప‌డుతుంది. అంద‌రూ చ‌నిపోయి ఉంటార‌నే భ‌యంతో శివ‌, అత‌ని స‌హ‌చ‌రులు పారిపోతారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?  త‌న పూర్వీకులు దానం చేసిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల‌నుకొనే దేవేంద్ర ఏం చేశాడు? ఫారెస్ట్ ఆఫీస‌ర్ ముర‌ళీధ‌ర్ ప‌ట్టిన పంతం నెగ్గిందా? శివ‌, లీల ఒక్క‌ట‌య్యారా? తండ్రి బాట‌లో శివ కూడా కోల ఆడ‌తాడా? అనే విష‌యాలను మిగ‌తా క‌థ‌లో చూస్తాం.

క‌థా క‌థ‌నాల ప‌రంగా, అభిన‌యం ప‌రంగా, దృశ్య‌ప‌రంగా 'కాంతార' ఒక అసాధార‌ణ చిత్రం. రిష‌బ్ శెట్టి అనే ఒక నట ద‌ర్శ‌కుడు అంతా తానై చెల‌రేగిపోయి చేసిన ఒక నాట్య విలాసం. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా మిస్ చేసుకోకూడ‌ని ఒక మ్యాజిక్ ఫిల్మ్‌. For more information visit Teluguone.com official website

Click here to get more details about Kantara movie review and rating

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...