Telugumoviereviews Posted October 14, 2022 Report Share Posted October 14, 2022 'కేరింత', 'మనమంతా', 'ఓ పిట్ట కథ' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన తాజా చిత్రం 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ టీజర్, ట్రైలర్ యూత్ ని ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: చిన్నప్పటి నుంచి అర్జున్(విశ్వంత్) జీవితంపై అతని బాబాయ్(హర్ష వర్ధన్) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు అవ్వడంతో అమ్మాయిలకు దూరంగా ఉండమని చిన్నప్పటి నుంచే అర్జున్ కి నూరి పోస్తుంటాడు బాబాయ్. దానికితోడు అర్జున్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా అతడు అమ్మాయిలకు దూరంగా ఉండేలా చేస్తాయి. అలాంటి అర్జున్, తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే వాళ్ళు చూసిన అమ్మాయిని కాకుండా తనకి తగ్గ జోడీని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంటాడు. తనకి ఎలాంటి అమ్మాయి కావాలి?, ఆమెలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని తెలుసుకునే క్రమంలో మంచి జాబ్ ని కూడా వదిలేసి 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'గా మారతాడు. అసలు అర్జున్ అలా ఎందుకు మారాల్సి వచ్చింది? అతనికి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికిందా? దివ్య(మాళవిక సతీశన్) ఎవరు? ఆమె రాకతో అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ. 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే ఆలోచన బాగున్నా.. లవ్, కామెడీ, ఎమోషన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా.. అటు నవ్వించలేక, ఇటు ఏడిపించలేక ఉడికి ఉడకని కిచిడిలా తయారైంది చిత్రం. ప్రథమార్థం కొంతలోకొంత నయం అనుకున్నా, ద్వితీయార్థం మరీ నీరసంగా నడిచింది. For more information visit Teluguone.com official website Click here to get more details about Boyfriend for Hire movie full review and rating Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.