Jump to content

Gudivada lo kalyan ram ni dhinchali

Higher_Purpose

Recommended Posts

నందమూరి కళ్యాణ్ రామ్ గారిని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలి.. 

గుడివాడ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం కోల్పోయింది.. గత రెండు ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం లోను, గడచిన మూడు ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం లోను తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడం చాలా బాధాకరం.. పార్టీ వ్యవస్థాపకుడు, మహనీయుడు, అన్న నందమూరి తారకరామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గుడివాడ., పుణ్యదంపతులు నందమూరి తారకరామారావు - బసవరామతారకం గార్లు ఇద్దరు జన్మించిన ఊళ్లు నిమ్మకూరు, కొమరవోలు పామర్రు నియోజకవర్గం లోనివి.. 

కావున, ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు గెలిచి పూర్వ వైభవం సాధించటం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా అవసరం..!!

ముఖ్యంగా.. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడు గారిని, లోకేష్ గారిని, బాలయ్య గారిని పరుష పదజాలంతో దూషిస్తూ, అన్నగారి కుమార్తె అయిన భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించి ఎంతో నీచానికి ఒడిగట్టాడు.. 

గుడివాడ, పామర్రు నియోజకవర్గాలలో ఉన్న నందమూరి కుటుంబసభ్యులను, బంధువులను, అభిమానులను, కమ్మ సామాజికవర్గీయులను మాయమాటలు చెప్పి, చంద్రబాబుగారి పైన, లోకేష్ గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన లేనిపోయిన మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, తనవైపుకు తిప్పుకుని తెలుగుదేశం పార్టీని దారుణంగా బలహీనపరిచాడు.. 

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా రకరకాల కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ గుడివాడ, పామర్రు ప్రాంతాలలో బలహీనపడి, కంచుకోటలుగా ఉన్న  ఊళ్లలో ఓటమి చవిచూస్తూ అవమానింపబడుతున్నది.. 

గుడివాడలో గత రెండు ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్ లు ఓడిపోవటానికి స్థానికంగా పార్టీ లో ఉన్న వర్గాల కుమ్ములాటలు ఒక ప్రధాన కారణం.

2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు ఎన్నికల నిర్వాహణ సరిగా చేయకపోవటం, ఒంటెద్దుపోకడలు, నిధుల పంపిణి క్షేత్రస్థాయిలో సరిగ్గా జరగకపోవటం, పిన్నమనేని వర్గం అంతర్గతంగా కొడాలి నానితో సన్నిహితంగా ఉండటం, నానికి పిన్నమనేని కుటుంబం ఆర్ధికంగా సహాయం చేశారనే ప్రచారం జరగటం, ఇవన్నీ కలిసి కొడాలి నాని కుయుక్తులు, కుట్రల పాచికలు తోడయ్యి తెలుగుదేశం ఓటమి చవిచూసింది..

2019 ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని అవినాష్ కు ఆ నియోజకవర్గం పూర్తిగా కొత్తకావడం, సరిగ్గా ఎన్నికల ముందు నియోజకవర్గానికి రావటం, స్థానికంగా పార్టీ లో ఉన్న వర్గాలు అవినాష్ కు పూర్తిగా సహకరించకపోవటం వల్ల మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. 

ప్రస్తుతం గుడివాడ లో ఆశావహులుగా ఉన్న వారిలో ఎవరికీ  2024 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా మిగిలిన వారు సహకరించే అవకాశంలేదు.. స్వతహాగా తెలుగుదేశం పార్టీ సైతం చాలా బలహీనంగా ఉంది.. దానికి తోడు వర్గాల కుమ్ములాటలు.. 

కావున.. గుడివాడ నుండి ఈసారి ఇప్పుడున్న వారు కాకుండా.. నందమూరి కుటుంబం నుండి స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి రెండవ కుమారుడు, సినీ హీరో  అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గారిని గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి గా బరిలోకి దింపితే బాగుంటుంది.. 

కళ్యాణ్ రామ్ గారు అభ్యర్థి అయితే ఎన్నో సమీకరణాలు కలిసివస్తాయి.. నందమూరి కుటుంబానికి ఆ ప్రాంతంలో ఉన్న ఆదరణ, స్థానికంగా ఉన్న బంధుత్వాలు, అభిమానుల బలం అనుకూలిస్తాయి.. 

స్వతహాగా కళ్యాణ్ రామ్ గారి తండ్రిగారు అయిన నందమూరి హరికృష్ణ గారికి గుడివాడ, మరియు పరిసర ప్రాంతాలతో ఎంతో అనుబంధం ఉంది, ఎందరో మిత్రులు ఉన్నారు.. హరికృష్ణ గారి అబ్బాయి కావటం కళ్యాణ్ రామ్ గారికి అదనపు బలం.

కొడాలి నాని ని నిలువరించాలి అంటే ముందు అతని దూకుడును కట్టడి చెయ్యాలి.. అతని నోటికి అడ్డుకట్ట వేయాలి.. కళ్యాణ్ రామ్ గారు తెలుగుదేశం అభ్యర్థి అయితే.. కొడాలి నాని దూకుడు గా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది, అతను నోరు జారటానికి వీలు లేని స్థితి ఏర్పడుతుంది

  • Upvote 1
Link to comment
Share on other sites

నందమూరి కళ్యాణ్ రామ్ గారు అభ్యర్థి కావడం వల్ల.. 
1. నందమూరి అభిమానులు అంతా పార్టీకి అనుకూలంగా  సంఘటితం అవుతారు..
2. కమ్మ సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వస్తారు..
3. ఇన్నాళ్లుగా నిద్రాణమై ఉన్న గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో ఊపు, ఉత్సాహం వస్తాయి.. 
4. పార్టీ కి దూరమైన స్థానికంగా ఉన్న నందమూరి బంధుగణం మరల దగ్గరవుతారు..
5. హరికృష్ణగారి కుమారుడనే సానుభూతి, అభిమానం పనికొస్తాయి..
6. ఆర్ధిక వనరులకు లోటు ఉండదు..
7. నందమూరి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల.. కేవలం గుడివాడ లోనే కాక.. పరిసర ప్రాంతాలు, ఉమ్మడి కృష్ణ జిల్లా మొత్తం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.. 
8. పార్టీ వ్యవస్థాపకుడైన అన్నగారి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల స్థానికంగా ఉన్న వర్గాలు కూడా సహకరించి సమష్టి గా పనిచేస్తారు..
9. కొడాలి నాని దూకుడు, దుర్భాషలను నిలువరించవచ్చు.. 
10. గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి..
11. ఈ ప్రయత్నం లో విజయం సాధిస్తే.. యువకుడు కావడం వల్ల రాబోయే ఇరవై సంవత్సరాల వరకు నాయకత్వం వెతుక్కోవాల్సిన పని ఉండదు..

Link to comment
Share on other sites

17 minutes ago, Higher_Purpose said:

Bokkale, gudivada vallu true ntr followers anduke cbn lakkunna party ki vote vestale 

Link to comment
Share on other sites

So what exactly are the reasons for Kodali Nani's popularity in Gudiwada. 

iyalrepu politics la 4 times consecutively gelavadam ante mazaak kadu..and more over first three time  MLA ga party was in opposition..aina kuda 4th time gelchindu....antha strong uh local lo ?

Link to comment
Share on other sites

8 hours ago, Higher_Purpose said:

నందమూరి కళ్యాణ్ రామ్ గారు అభ్యర్థి కావడం వల్ల.. 
1. నందమూరి అభిమానులు అంతా పార్టీకి అనుకూలంగా  సంఘటితం అవుతారు..
2. కమ్మ సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వస్తారు..
3. ఇన్నాళ్లుగా నిద్రాణమై ఉన్న గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో ఊపు, ఉత్సాహం వస్తాయి.. 
4. పార్టీ కి దూరమైన స్థానికంగా ఉన్న నందమూరి బంధుగణం మరల దగ్గరవుతారు..
5. హరికృష్ణగారి కుమారుడనే సానుభూతి, అభిమానం పనికొస్తాయి..
6. ఆర్ధిక వనరులకు లోటు ఉండదు..
7. నందమూరి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల.. కేవలం గుడివాడ లోనే కాక.. పరిసర ప్రాంతాలు, ఉమ్మడి కృష్ణ జిల్లా మొత్తం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.. 
8. పార్టీ వ్యవస్థాపకుడైన అన్నగారి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల స్థానికంగా ఉన్న వర్గాలు కూడా సహకరించి సమష్టి గా పనిచేస్తారు..
9. కొడాలి నాని దూకుడు, దుర్భాషలను నిలువరించవచ్చు.. 
10. గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి..
11. ఈ ప్రయత్నం లో విజయం సాధిస్తే.. యువకుడు కావడం వల్ల రాబోయే ఇరవై సంవత్సరాల వరకు నాయకత్వం వెతుక్కోవాల్సిన పని ఉండదు..

Harikrishna ikkada nundi poti chesinappudu 4th place vachhindhi.

Ippudu Harikrishna meedha saanubhoothi tho valla abbayi ki vestara ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...