Jump to content

పాలెగాండ్ల గాండ్ల పాలనలో ఇంతకంటే ఏమి ఆశిస్తాము... శ్రీకాకుళం జిల్లాలో తల్లి,కూతురిని వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని వేయించి చంపాలని చూశారు


southyx

Recommended Posts

29 minutes ago, kingcasanova said:

mana prabhutvam lo manaku champe hakku ledha ani YCP nayakulu prasnisthe javaaabu meee dhaggara undha? 

mana prabhutva erpaatu kosam enni thyaagaalu jarigaayo meeku theliyadha,

mandalaaaniki inni murder lu chesukovachu ani oka permit ichesthe, eee godvalu undav

Ippatam village lo jarigina sanghatana meedha monna oka YCP payteem batch same comment vesadu. Janalu Jagan ki 5 years adhikaram iccharu. YCP vaallaki evari intloki ayina velladini adhikaram icchinattu ani.

Link to comment
Share on other sites

23 hours ago, southyx said:

Ippatam village lo jarigina sanghatana meedha monna oka YCP payteem batch same comment vesadu. Janalu Jagan ki 5 years adhikaram iccharu. YCP vaallaki evari intloki ayina velladini adhikaram icchinattu ani.

anthegaa, okariddarni lepa leka pothe power lo undi em laabham? adhi prajaswamyaaniki siggu chetu

  • Upvote 1
Link to comment
Share on other sites

మీకో దండం.. పురుగుమందు తాగి చస్తున్నాం

అధికారపక్షం నాయకుల వేధింపులకు తాళలేక.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన తల్లీకుమారులు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated : 15 Nov 2022 04:04 IST
 
 
 
 
 
 

వైకాపా నాయకుల వేధింపులు భరించలేక తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నం
కలకలం రేపిన సెల్ఫీ వీడియో.. ఇల్లు కూల్చేసి వేధిస్తున్నారని ఆవేదన
ప్రాణాపాయ స్థితిలో కాకినాడ జీజీహెచ్‌లో చేరిక

141122ap-main35b.jpg

 

 

ఈనాడు- కాకినాడ, న్యూస్‌టుడే- బిక్కవోలు: అధికారపక్షం నాయకుల వేధింపులకు తాళలేక.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన తల్లీకుమారులు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న వీరిని కుటుంబీకులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 60ఏళ్ల తల్లి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. 36 ఏళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

స్థలం కోసమేనా..?

కామాక్షి కుటుంబం రోడ్డును ఆనుకుని రెండు సెంట్ల భూమిలో గుడిసె వేసుకుని 40 ఏళ్లుగా ఉంటోంది. వీరికి పక్కనే బాదిరెడ్డి అప్పారావు ఇల్లు ఉంది. వీరిమధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఈ స్థలాన్ని ఆనుకుని 48 సెంట్ల జిల్లా పరిషత్తు భూమిలో లే ఔట్‌ వేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ఇక్కడున్న కామాక్షి ఇల్లు తొలగిస్తే.. లే ఔట్‌ వేయడం తేలిక అవుతుందన్న వ్యూహంతో పావులు కదిపినట్లు ప్రచారం సాగుతోంది. కొత్త ఇల్లు మంజూరైనందున ఇప్పుడున్న ఇల్లు తీసేయాలని ఓ నాయకుడు వీరికి చెప్పారు. దాన్ని నమ్మి, 4 నెలల కిందట ఇల్లు తీసేశారు. అయినా ఇల్లు మంజూరవకపోవడంతో మోసపోయామని గుర్తించి.. అక్కడే టెంటు వేసుకుని ఉంటున్నారు. ఈలోగా జడ్పీ స్థలాన్ని వీళ్లు ఆక్రమించారని ఎంపీడీవోకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీవో సిబ్బందితో వెళ్లి టెంటు తీయించేసి.. స్థలం చుట్టూ కంచె వేయించారు. దీంతో నిలువ నీడలేదన్న ఆవేదనతో కామాక్షి, మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశారు.

ఆత్మహత్యాయత్నంపై కేసు

కామాక్షి రెండో కుమారుడు దుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో.. తల్లి, కుమారుడి ఆత్మహత్యాయత్నం వ్యవహారంపై కేసు నమోదుచేసినట్లు బిక్కవోలు ఎస్సై పి.బుజ్జిబాబు తెలిపారు.

ఫిర్యాదుల ఆధారంగానే తొలగించాం: ఎంపీడీవో

స్పందనలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణను తొలగించామని అనపర్తి ఎంపీడీవో ఝాన్సీ తెలిపారు. తొలగించడానికి అక్కడ ఏమీ లేదని.. సామగ్రే ఉందని చెప్పారు. అక్కడున్న మిగిలిన స్థలానికి సర్వే చేసి కంచె వేస్తామన్నారు.

93లోనే ఆస్పత్రి కట్టాం: ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

తాను పంచాయతీ స్థలం ఆక్రమించి ఆసుపత్రి నిర్మిస్తే పదిహేనేళ్ల పాటు తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తండ్రి అధికారంలో ఉన్నారని, ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. 1993లోనే తాము ఆసుపత్రి నిర్మించామని చెప్పారు.


మా చావుకు కారణం మీరే..

141122ap-main35a.jpg

‘మా ఇల్లు పడగొట్టేశారు. మా బిడ్డలను మాకు కాకుండా చేస్తున్నారు. మీకో దండం. మమ్మల్ని చిత్రహింసలకు గురిచేశారు. బాధ భరించలేక మేం చచ్చిపోతున్నాం. మందు తాగి చస్తున్నాం. మా చావుకు కారణం.. బాదిరెడ్డి అప్పారావు, బాదిరెడ్డి భీమన్న, కిలపర్తి వీర్రాజు, యామన దుర్గారావు.’

సెల్ఫీ వీడియోలో తల్లీకుమారులు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ ఆవేదన


బాధ్యత వైకాపా నాయకులదే: నల్లమిల్లి

ఈ పరిస్థితికి వైకాపా నాయకులే కారణమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు జడ్పీ భూములు ఆక్రమించి అపార్టుమెంట్లు కడుతున్నారని.. ఆ ఆక్రమణలు తొలగించాలని డిమాండు చేశారు. అనపర్తిలో గ్రామ పంచాయతీకి చెందిన వీధిని ఆక్రమించి గంగిరెడ్డి నర్సింగ్‌హోం కట్టేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే తన నర్సింగ్‌ హోం ఆక్రమణలు తొలగించి మిగిలిన ఆక్రమణల సంగతి చూడాలన్నారు.

Link to comment
Share on other sites

వైకాపా నాయకుల వేధింపులకు మహిళ బలి

వైకాపా నాయకుల వేధింపులకు తాళలేక ఓ అభాగ్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృత దేహాన్ని చూడనీయకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు.

Published : 16 Nov 2022 02:42 IST
 
 
 
 
 
 

మృతదేహాన్ని చూడనీయకుండా భర్తను అడ్డుకున్న పోలీసులు
విశాఖ జిల్లా ముదపాక పంచాయతీలో దారుణం

151122ap-main7a.jpg

 

 

పెందుర్తి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల వేధింపులకు తాళలేక ఓ అభాగ్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృత దేహాన్ని చూడనీయకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు, కడియాల అచ్చియ్యమ్మ (36) తోబుట్టువులు. సోదరులిద్దరూ గ్రామంలోని రెండు సెంట్ల స్థలాన్ని అచ్చియ్యమ్మకు బహుమానంగా ఇచ్చారు. కొన్నాళ్లుగా ఆ స్థలానికి సంబంధించి వీరికి.. స్థానిక వైకాపా నాయకుల మధ్య వివాదం నడుస్తోంది. వైకాపా నాయకుల వేధింపులు భరించలేక సోమేశ్వరరావు పురుగుల మందు తాగి ఈ ఏడాది సెప్టెంబరు 9న చనిపోయారు. అచ్చియ్యమ్మకు చెందిన రెండు సెంట్లను వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లో దాన్ని ఖాళీ చేయాలని ముదపాక పంచాయతీ కార్యదర్శి కె.నాగప్రభు ఈ నెల 2 నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి అచ్చియ్యమ్మ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పలుచోట్ల వెదికారు. వారి నివాసానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృత దేహాన్ని గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు, ఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంటకు గోవిందపురం చేరుకున్నారు. బావిలో నీరు అధికంగా ఉండటంతో మోటార్లతో తోడించారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అచ్చియ్యమ్మ మృతదేహాన్ని బయటకు తీయించారు.

151122ap-main7b.jpg

కడసారి చూపునకు నిరాకరణ..

అచ్చియ్యమ్మ మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొస్తుండగా భర్త చిన్నారావు, సోదరుడు భీమేశ్వరరావు చూసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు పక్కకు లాగేసి మృతదేహాన్ని అంబులెన్సులో పెట్టేశారు. దీంతో వారు అంబులెన్సు ఎదుట బైఠాయించారు. గ్రామస్థులు వాహనాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు. మృతదేహం ఉన్న అంబులెన్సును గ్రామస్థులు మళ్లీ అడ్డుకుంటారనే ఉద్దేశంతో డ్రైవర్‌ వేగంగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో గ్రామస్థులను చెదరగొడుతున్న ఎస్‌ఐ రాంబాబు కాలి పైనుంచి అంబులెన్సు వెళ్లిపోయింది. ఆయన కాలు వెనక్కు మెలి తిరిగి విరిగిపోయింది.

151122ap-main7c.jpg


ల్యాండ్‌ పూలింగ్‌ను అడ్డుకున్నారనే కక్షతో..

ముదపాక గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌ అక్రమాలకు అడ్డు పడుతున్నారని సోమేశ్వరరావు, భీమేశ్వరరావు కుటుంబంపై వైకాపా నాయకులు కక్ష కట్టారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అచ్చియ్యమ్మ మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, రసీదు ఇవ్వకుండా పోలీసులు జాప్యం చేయడంతో పెందుర్తి స్టేషన్‌కు చేరుకుని బండారు అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులను నిలదీయడంతో ఎట్టకేలకు రసీదు ఇచ్చారు. అచ్చియ్యమ్మ మృతికి కారకులపై కేసులు నమోదు చేసే వరకు పోస్టుమార్టానికి అంగీకరించేది లేదని ఆయన స్పష్టంచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సారిపల్లి గణేశ్‌, సియ్యాద్రి బాలచంద్ర, ఇప్పిలి కనకరాజుపై ఐపీసీ సెక్షన్‌ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...