Jump to content

Yashoda movie review


Telugumoviereviews

Recommended Posts

 

yashoda%20movie%20review.webp

చాలా రోజులుగా తెలుగు ప్రేక్షకులు 'యశోద' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కారణం.. అది సమంత చేసిన సినిమా కావడం. నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత అనేక కళ్లు ఆమెను వాచ్ చేస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల్ని భూతద్దంలోంచి చూస్తూ వస్తున్నాయి. విడాకులు ఆమె కెరీర్‌ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలని కూడా అనేకమంది మనసుల్లో ఉంది. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు తమిళ యువకులు డైరెక్ట్ చేసిన ఈ మొదటి తెలుగు సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇలా ఈరోజు మన ముందుకు వచ్చేసింది 'యశోద'.

కథ:- యశోద (సమంత) ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు బృంద అనే ఒక చెల్లెలు మాత్రమే ఉంటుంది. ఆమెకు ఏదో జబ్బుచేసి, ఆపరేషన్ చేయాల్సి రావడంతో అందుకు అవసరమైన డబ్బు కోసం వేరే దారి తెలీక పెళ్లి కాకుండానే సరోగేట్ మదర్ కావడానికి ఒప్పుకుంటుంది. అలా ఈవా అనే హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ తనలాంటి ఎంతోమంది అమ్మాయిలు యశోదకు తోడవుతారు. ఆ హాస్పిటల్‌ను మధు (వరలక్ష్మీ శరత్‌కుమార్) అనే ఆమె నిర్వహిస్తుంటుంది. యశోదకు గౌతం (ఉన్ని ముకుందన్) అనే డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇస్తుంటాడు. మరోవైపు ఒక కారు యాక్సిడెంట్‌లో ఒక పేరున్న వ్యక్తితో పాటు ఒక మోడల్ కూడా చనిపోతారు. అది యాక్సిడెంట్ కాదనీ హత్య అనీ తెలియడంతో ఆ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. హాస్పిటల్‌లో యశోదకు విచిత్రమైన షాకింగ్ ఘటనలు ఎదురవుతాయి. ఆ హాస్పిటల్‌లో నిజానికి ఏం జరుగుతోంది? అక్కడి మిస్టరీ ఏమిటి? కారు ప్రమాదం వెనుక ఉన్న వ్యక్తులెవరు? ఈ రెండింటికీ ఏమైనా లింక్ ఉన్నదా? అనే విషయాలు మనకు మిగతా కథలో తెలుస్తాయి. 

కొన్ని సీన్స్‌ను పక్కనపెడితే.. బలమైన క్యారెక్టరైజేషన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్‌తో వచ్చిన 'యశోద' అసలు సిసలు సినీ ప్రియులను ఏమాత్రం నిరాశపరచదు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Yashoda movie review and rating

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...