Peruthopaniemundhi Posted November 18, 2022 Report Share Posted November 18, 2022 Chandrababu: ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు కర్నూలు: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైకాపా శ్రేణులు నినాదాలు చేస్తే.. సీఎం డౌన్ డౌన్ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడికి రావడంతో ఘర్షణ తారస్థాయికి చేరింది. పోలీసులు ఉన్నా వైకాపా కార్యకర్తలను అదుపు చేయకపోవడంతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు యూనిఫాం తీసేసి రావాలి.. ‘‘సీఎం జగన్ రాయలసీమ ద్రోహి. పోలీసులు యూనిఫాం తీసేసి రావాలి.. మీతో కాకపోతే మేమే చూసుకుంటాం. ఎస్పీ ఏం చేస్తున్నారు? ఎవరికి కాపలా కాస్తున్నారు? పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా. రాయలసీమలో ముఠా నాయకులను అణచివేసిన పార్టీ తెదేపా. మిమ్మల్ని అణచివేయడం కష్టమేమీ కాదు. రాజకీయ రౌడీలు వస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి. చేతకాని దద్దమ్మ జగన్. కర్నూలులో బెంచ్ పెట్టాలని నేనే చెప్పాను. మీ వల్ల కాకపోతే చెప్పండి .. నేనే చూసుకుంటా. ఓడిపోతారని తెలిసి జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న వైకాపా శ్రేణులు ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి.. అంతకు ముందు తెదేపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని మౌర్యా ఇన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 2వేల మంది తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కర్నూలు జిల్లా పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదరించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయన్నారు. వైకాపా నాయకులంతా ఓ మాఫియాగా మారారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి.. ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. 50 ఫెడరేషన్లు పెట్టి ఛైర్మన్లు పెట్టారని, వారికి జీతాలు, కుర్చీలు కూడా లేవన్నారు. ఏ2 విశాఖపట్నంను దోచేస్తున్నారని, విశాఖలో 50 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted November 18, 2022 Report Share Posted November 18, 2022 ippudu choodu maa Jagan Anna and his batch will say "maa lady police lani uniform ippi rammantunnadu ee kaama CBN" ani start chestharu.. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 18, 2022 Report Share Posted November 18, 2022 Ah golla lk ni guvva pagala mingali bro @southyx dig or something savang ni replace chesadu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.