Jump to content

క్రికెట్‌లోనూ సాయిరెడ్డి దందా. ఏసీఏలో అల్లుడికో పదవి.. అల్లుడి అన్నకో పదవి. మిగతా వాటిలోనూ అనుయాయులకే చోటు


southyx

Recommended Posts

క్రికెట్‌లోనూ సాయిరెడ్డి దందా

‘అన్నీ మనకే.. అన్నింటిలో మనవాళ్లే’ అన్న సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌నీ (ఏసీఏ) తమ కుటుంబ కంపెనీలా మార్చేశారు.

Published : 21 Nov 2022 03:04 IST
 
 
 
 
 
 

ఏసీఏలో అల్లుడికో పదవి.. అల్లుడి అన్నకో పదవి
మద్యం కుంభకోణం నిందితుడే అధ్యక్షుడు!
మిగతా వాటిలోనూ అనుయాయులకే చోటు

201122ap-main2a.jpg

ఈనాడు, అమరావతి, విశాఖ: ‘అన్నీ మనకే.. అన్నింటిలో మనవాళ్లే’ అన్న సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌నీ (ఏసీఏ) తమ కుటుంబ కంపెనీలా మార్చేశారు. అధ్యక్షుడు సహా ఎపెక్స్‌ కౌన్సిల్‌లోని అన్ని పోస్టుల్నీ బంధుగణంతో, అనుయాయులతో నింపేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే సాయిరెడ్డి ఏసీఏని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన 4 నెలలకు జరిగిన ఏసీఏ ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ‘ఎపెక్స్‌ కౌన్సిల్‌’ పదవులన్నీ సాయిరెడ్డి బంధుగణం, ఆయన అనుయాయులపరం కాబోతున్నాయి. సాయిరెడ్డి అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, అరబిందో సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డికి అధ్యక్ష పదవి, అల్లుడు రోహిత్‌రెడ్డికి ఉపాధ్యక్ష పదవి, సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త గోపీనాథ్‌రెడ్డికి కార్యదర్శి పదవి, మిగతా పదవులు మరికొందరు అనుయాయులకు.. ఇలా ఏసీఏ ఎన్నికల ప్రక్రియ ముగియకముందే పదవుల పందేరం జరిగిపోయింది. ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. ఎన్నిక లాంఛనమే. మరో మూడేళ్లపాటు వీరే ఏసీఏను ఏలబోతున్నారు. పైగా ఎన్నికల అధికారిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రమాకాంత్‌రెడ్డిని నియమించడం విశేషం. క్రికెట్‌ సంఘాలపై రాజకీయ పెత్తనం చాలాచోట్ల ఉన్నదేకానీ.. మరీ ఇలా సొంత కంపెనీలోలా పదవులన్నీ పంచేసుకోవడం ఎక్కడా ఉండదేమో! విశాఖను ముఖ్యమంత్రి జగన్‌ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిందే తడవు.. సాయిరెడ్డి విజయవాడ నుంచి ఏసీఏ కార్యాలయాన్ని విశాఖకు హడావుడిగా తరలించేశారు. మంగళగిరి సమీపంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణాన్ని గత మూడేళ్లుగా ఏసీఏ ఉద్దేశపూర్వకంగానే పూర్తి చేయలేదన్న ఆరోపణలున్నాయి.

పక్కా వ్యూహంతో ఏసీఏపై పట్టు..

క్రికెట్‌కు విశేష ఆదరణ ఉండడంతో సంఘాలు ఆర్థికంగానూ పరిపుష్టంగా ఉన్నాయి. ఐపీఎల్‌ మొదలయ్యాక.. బీసీసీఐ నుంచి వచ్చే నిధులూ పెరిగాయి. ప్రస్తుతం ఏటా రూ.40 కోట్లకుపైగా నిధులు వస్తున్నాయని, భవిష్యత్తులో రూ.70 కోట్ల వరకు వస్తాయని సమాచారం. అప్పట్లో ఏసీఏలో భాజపా నేత గోకరాజు గంగరాజు హవా కొనసాగేది. 2019లో వైకాపా వచ్చాక.. సాయిరెడ్డి మంత్రాంగంతో గోకరాజు వర్గం వైదొలగింది. 2019 సెప్టెంబరు 22న జరిగిన ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలకు ముందే వైకాపాలో చేరిన, వెంకటగిరి రాజ కుటుంబానికి చెందిన వి.వి.ఎస్‌.ఎస్‌.కె.కె.యాచేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పెదనాన్న కుమారుడు సాయికృష్ణ యాచేంద్ర ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానల్‌ సీఈవోగా పని చేస్తున్నారు. కృష్ణా జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ కార్యదర్శిగా, అదే అసోసియేషన్‌కు చెందిన కె.ఎస్‌.రామచంద్రరావు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వారిద్దరూ గోకరాజు వర్గానికి చెందినవారని చెబుతారు. వారిని కొన్నాళ్లకే బయటకు పంపేశారు. కోశాధికారిగా సాయిరెడ్డికి సన్నిహితుడు, ఇటీవల అత్యంత వివాదాస్పదమవుతున్న దసపల్లా భూముల వ్యవహారంలో, ఆ భూములకు యజమానులుగా చెబుతున్న వారితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్న అష్యూర్‌ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన గోపీనాథ్‌రెడ్డి ఎంపికయ్యారు. దసపల్లా భూముల డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిధులు అష్యూర్‌ కంపెనీకి, సాయిరెడ్డి అల్లుడు, కుమార్తెకు చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ నుంచే వెళ్లాయన్న ఆరోపణలున్న విషయమూ తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు సాక్షి పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌గా పనిచేసి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న ధనుంజయరెడ్డి ఏసీఏ సభ్యుడిగా అప్పట్లో ఎన్నికయ్యారు.

అన్ని పదవులూ వారివే..

ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు రెండూ సాయిరెడ్డి తమ కుటుంబ సభ్యులతోనే నింపేస్తున్నారు. అధ్యక్ష పదవికి శరత్‌చంద్రారెడ్డి పోటీ పడుతుండగా, ఉపాధ్యక్ష పదవికి సాయిరెడ్డి తన అల్లుడు రోహిత్‌రెడ్డిని రంగంలోకి దించారు. ఇప్పటి వరకు కోశాధికారిగా ఉన్న గోపీనాథ్‌రెడ్డిని ఏకంగా కార్యదర్శిగా చేస్తున్నారు. ఏసీఏలో అధ్యక్షుడి తర్వాత, కొన్ని సందర్భాల్లో అధ్యక్షుడి కంటే కీలకమైంది కార్యదర్శి పదవే. కోశాధికారిగా ఎంపిక కానున్న ఆడిటర్‌ ఎ.వి.చలం.. గోపీనాథ్‌రెడ్డికి సన్నిహితుడని సమాచారం. విశాఖలో పలు కీలక ప్రాజెక్టులు చేస్తున్న విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. విజయవాడకు చెందిన వ్యాపారవేత్త ఎ.రాకేశ్‌ సంయుక్త కార్యదర్శిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఏసీఏ ప్రస్తుత సీఈవో శివారెడ్డితో సత్సంబంధాలున్నాయని తెలిసింది. కౌన్సెలర్‌గా పోటీ చేస్తున్న పురుషోత్తం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి సన్నిహితుడు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వెంకట శివారెడ్డి వైకాపా నాయకుడే. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఆయన గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుత శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయన మేనమామ. గతంలో ఏసీఏలో సీఈవో పోస్టు లేదు. 2019లో కొత్త పాలక మండలి ఏర్పడ్డాక.. ఆ పోస్టును సృష్టించి శివారెడ్డిని నియమించారు. వీరిలో ఒకరికి విశాఖకు చెందిన స్వామీజీ ఆశీస్సులున్నట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

25 minutes ago, jaathiratnalu said:

Started by the Pachha tammullu and now it’s teddy times and all other eligible are loosers 

TDP time lo vaallu ekkuvaga icchina positions list unte ikkada veyi. Be it TTD positions, Univ VCs, Advisors, number of MLAs and MPs and etc. Nenu YCP vaallavi 1000s lo vestha. Cover chesukoku. Ae Govt lo kooda intha vicchalavidi kula gajji nenu choodaledhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...