southyx Posted December 6, 2022 Report Share Posted December 6, 2022 సంచులే కాదు.. బూట్లూ నాసిరకమే! ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మొదలుకుని బూట్లు, సాక్సులు, ఏకరూప దుస్తుల దాకా అన్నీ ఉచితంగానే ఇస్తాం. Updated : 06 Dec 2022 11:35 IST ఏడాది తిరగకుండా పాడైన జీవీకే సామగ్రి ఈనాడు-అమరావతి బూట్ల పరిస్థితి ఇలా... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మొదలుకుని బూట్లు, సాక్సులు, ఏకరూప దుస్తుల దాకా అన్నీ ఉచితంగానే ఇస్తాం. వాటి నాణ్యత విషయంలోనూ రాజీపడబోం. వాటి కోసం ఏ విద్యార్థి తండ్రీ ఆర్థిక వ్యయ ప్రయాసలకోర్చనవసరం లేదు. జగనన్న విద్యా కానుక పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యాకానుక కిట్లలో సంచులు, బూట్ల నాణ్యత లేమి కనిపిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జేవీకే కిట్లలో భాగంగా ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగ్‌ల నుంచి కాళ్లకు ధరించే బూట్లు, సాక్సుల దాకా ప్రతిదీ మున్నాళ్ల ముచ్చటగానే ఉన్నాయి. బ్యాగుల వాపసు వ్యవహారం కొలిక్కి రాకుండానే బూట్లు కూడా ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌లు కనీసం ఆ విద్యా సంవత్సరం పూర్తికాకుండానే చిరిగిపోవటం, .జిప్పులు ఫెయిల్ అవటం వంటివి చోటుచేసుకున్నాయి. చాలా మంది పిల్లలు ప్రత్యామ్నాయంగా ఇంట్లో ఉన్న బ్యాగ్‌ల్లో పుస్తకాలు పెట్టుకుని రావటం, బూట్లకు బదులు చెప్పులు వేసుకుని రావటం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 3400కు పైగా పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 4.06 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభమైన నాటి నుంచి సెప్టెంబరు దాకా బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తూనే ఉన్నారు. చిరిగిపోయిన బ్యాగ్‌లు కిట్ ధర రూ.1996 జేవీకే కిట్‌లో పాఠ్యపుస్తకాలు మినహా మిగిలిన బ్యాగ్, బెల్ట్, షూ, సాక్సులు, ఏకరూపదుస్తులు ఇవి మొత్తం కలిపి రూ.1996. జత షూ, రెండు జతల సాక్సులు కలిపి రూ.130 నుంచి రూ.200 వరకు వెచ్చించారు. అన్ని లక్షలమంది విద్యార్థులకు సరఫరా చేసేటప్పుడు వాటి ధర ఇంకా తగ్గాలి. కానీ అంతే ధరతో కొన్నారు. అధికారులకు చూపిన నమూనా, సరఫరా చేసింది ఒక్కటేనా అంటే యంత్రాంగం స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. ఏ అర్థరాత్రి వేళో వాటిని ట్రాన్స్‌పోర్టులో పంపి తీసుకోవాలని హడావుడి చేసేవారని, అందువల్ల నాణ్యంగా ఉన్నాయా? నాసిరకంగా ఉన్నాయా అనేది కూడా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని కొందరు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted December 6, 2022 Report Share Posted December 6, 2022 Roju veskunevi one year la padavthayi kada.. look at his shoes with all the dust, I guess that kid is wearing them all day every day.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.