Jump to content

Kalatapaswi: కె.విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలో దంపతుల తుదిశ్వాస


Kool_SRG

Recommended Posts

దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

Kalatapaswi: కె.విశ్వనాథ్‌  సతీమణి జయలక్ష్మి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలో దంపతుల తుదిశ్వాస

దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K viswanath) ,భార్య జయలక్ష్మి (Jaya Lakshmi) (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు(Jaya Lakshmi passes away). చికిత్స పొందుతూ నిద్రలోనే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల రెండో తేదిన కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ కన్ను మూసిన సంగతి తెలిసిందే! అప్పటికే జయలక్ష్మి మంచానికే పరిమితమై ఉన్నారు. కె.విశ్వనాథ్‌- జయలక్ష్మి దంపతులు పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తదుపరి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది.

Link to comment
Share on other sites

తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకులుగా పేరొందిన కె విశ్వనాథ్ (K Viswanath) ఫిబ్రవరి 2న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతుండగానే మరో విషాద వార్త షాక్ ఇచ్చింది. కళాతపస్వి (Kalatapasvi) కన్నుమూసి నెల రోజులైనా గడవక ముందే ఆయన సతీమణి జయలక్ష్మి (Jayalakshmi) గుండె పోటుతో (Heart Attack) మరణించారు. కళాత్మక సినిమాలతో తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన కె విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన 24 రోజులకే ఆయన భార్య కూడా మరణించడం కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆవిడ వయసు 86 ఏళ్లు కాగా.. అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు జయలక్ష్మి.

 

కళాతపస్వి కె విశ్వనాథ్‌ చనిపోయే నాటికే జయలక్ష్మి మంచానికి పరిమితమై ఉన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6.15 గం.కు మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. విశ్వనాధ్ మాదిరే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. కె.విశ్వనాథ్‌, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే ఆయన ఇండియాకు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...