Jump to content

భాజపా ఎమ్మెల్యే తనయుడి లంచావతారం.. తీగలాగితే నోట్ల గుట్టలు


Undilaemanchikalam

Recommended Posts

ఎమ్మెల్యే తనయుడి లంచావతారం.. తీగలాగితే నోట్ల గుట్టలు..

ఎమ్మెల్యే తనయుడి లంచావతారం.. తీగలాగితే నోట్ల గుట్టలు..

బెంగళూరు: ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి రూ.40 లక్షలు లంచం(Bribe) తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు భాజపా ఎమ్మెల్యే తనయుడు. ఇప్పుడు అతడి ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు భారీ సొమ్మును గుర్తించారు. సుమారు రూ.6 కోట్ల నోట్ల గుట్టలను గుర్తించినట్లు శుక్రవారం వెల్లడించారు.

కర్ణాటక (Karnataka)లోని దావణగెరె జిల్లా చెన్నగిరి శాసనసభ్యుడు మాడాళు విరూపాక్షప్ప (Virupakshappa) తనయుడు ప్రశాంత్ (Prashanth Madal). ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. బెంగళూరు జలమండలిలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్‌.. ఈ టెండరు విషయంలో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఉప్పందించడంతో.. వారు ప్రశాంత్‌ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడి నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. 

మైసూర్ శాండల్ సబ్బు(Mysore Sandal Soap)ను తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(KSDL)కు విరూపాక్షప్ప ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నిన్న ప్రశాంత్‌ను అధికారులు ఈ కేఎస్‌డీఎల్‌ కార్యాలయంలోనే అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ.1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ఇంట్లో రూ. 6 కోట్లు గుర్తించినట్లు చెప్పారు.

కర్ణాటక(Karnataka)లో భాజపా(BJP) అధికారంలో ఉంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎంతో సహా అక్కడి నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన భాజపాను ఇరకాటం పడేసేదే.

కేఎస్‌డీఎల్‌ పదవికి ఎమ్మెల్యే రాజీనామా..

కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్‌ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోయారు. కేఎస్‌డీఎల్‌  కార్యాలయంలోనే లంచం డబ్బును లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ భాజపా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు.

Link to comment
Share on other sites

It’s a planned attack to save BJPfrom next election they got ground report that they are losing in karnataka .. cid vallu bjp cm ki cheppakunda cheyataniki valle emaina cbi ah to attack on opposition. It’s planned attack on him 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...