Jump to content

చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు వల్ల గుండెపోటు వస్తుందని ఊదరకొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వాళ్లకు మంచి సమాధానం


JackSeal

Recommended Posts

దయచేసి అపోహలు వీడండి...
నిజాలు గ్రహించండి.... అనవసర ఆందోళనకు స్వస్తి చెప్పండి....
కింది విషయాలు జాగ్రత్తగా చదవండి
ఎందుకిలా? - 

2006 సమయంలో మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డాక్టర్లు గా పనిచేస్తున్న కాలంలో ఒక.నైట్ డ్యూటీలో కనీసం ఒకటి రెండు Brought dead కేసులు చూసేవాళ్ళం. అంటే వాళ్ళు అందరూ సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వలన ఆసుపత్రికి తీసుకొచ్చే లోపలే చనిపోయినవారు. ఒకరోజులో దాదాపు ఒక్కోసారి ఐదు ఆరు దాకా వీటి సంఖ్య ఉండేది. అంటే ఇది చాలా ఎక్కువ. ఇది కేవలం ఒక ఆసుపత్రిలో మాత్రమే వచ్చే brought dead cases.   అన్ని ఆసుపత్రులను కలిపితే ఈ సంఖ్య మరెంతగా ఉండేదో...

ఇపుడేమైంది?.

అప్పటికీ ఇప్పటికీ డిఫెరెన్స్ ఏంటి అంటే ఆ సడెన్ కార్డియాక్ డెత్ ల గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఇపుడు పెరిగిన సెల్ఫోన్లు, సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, న్యూస్ యాప్స్ వలన ప్రతీ మరణం రికార్డవుతోంది. 

ఇది ఒకందుకు మంచిది. ఎందుకంటే అసలెంత కార్డియాక్ రిస్క్ సమాజంలో పెరిగిందో తెలిపేందుకు ఇది డాక్టర్లకు,health care providers కూ,గవర్నమెంట్ పాలసీ మేకర్స్ కు ఉపయోగపడుతుంది.

కానీ మరో వైపు నుండి ఇది చెడ్డది. ఎందుకంటే ఒకప్పుడు బంధుమిత్రులకు తప్ప మిగితా జనాలకు తెలియని మరణాలు ఈ న్యూస్ విప్లవం వలన అందరు జన సామాన్యానికి తెలిసేలా చేయడంతో జనసామాన్యంలో ఒక సందిగ్ధత ఒక ప్యానిక్ పరిస్థితిని కలగజేస్తుంది. మరణాల రిపోర్టింగ్ మనకు కరోనా కాలంనుంచే పెరిగింది.

దీనిని ఎదుర్కోవడం ఎలా?.
మన తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో న్యూస్ ఆప్ లు ఉన్నాయి. పేపర్లు, వెబ్సైట్లున్నాయి. టీవీ ఛానల్స్ ఉన్నాయి. గమనించి చూస్తే మిత్రులారా! ఈ ఆరోగ్య సంబంధ విషయాలను పబ్లిష్ చేయడంలో వీటిల్లో వేటిల్లో కూడా డాక్టర్లు ఉద్యోగులు కాదు. హెల్త్ డెస్క్ లలో ప్రొఫెషనలిజం లోపం వారు ఆ వార్తను రాసే విధానంలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 

ముఖ్యంగా సెన్షేషనలిజం కోరుకునే వార్తా ఛానల్స్, న్యూస్ యాప్స్ తమ ఇష్టమున్న థంబ్ నెయిల్స్ పెడుతూ హెడింగ్ లను కూడా భయంగొల్పేలా రాస్తున్నాయి.   తమకు తెలియకుండా సమాజానికి  ఇవి కలుగజేసేచేటును వారికి వివరించి చెప్పగల మెఖానిజం మనకు లేదు. అంతర్జాతీయ మీడియా సంస్థలైన CNN Health, Newyork times Health , Mayo clinic news network, BBC health, health line వంటి పత్రికలు యాప్ లు తమతమ హెల్త్ డెస్కులలో డాక్టర్లను తప్పనిసరిగా నియమించుకుంటాయి. బయటకి వెళ్ళే ప్రతీ ఆరోగ్య సంబంధ అంశం ఆథెంటిక్ గానూ , సరైన సమాచారంగానూ, చదివిన జనసామాన్యంలో ఒక సైంటిఫిక్ అవగాహనను పెంపొంచేదిగానూ, అపోహలను తొలగించి వారిని ఎంపవర్ చేసేదిగానూ ఉండేందుకు వారు చక్కటి చర్యలు తీసుకుంటారు. మన దగ్గర ఇది ప్రధానమైన లోపం. 

ఆరోగ్య సంబంధ విషయంలో ఎవరైనా దానిని స‌రైన పద్ధతిలో ప్రెజెంట్ చేయకపోతే , ఆ తప్పుడు విషయంతో తప్పుడు అవగాహన, తప్పుడు అవగాహనతో జనం అస్థవ్యస్థ నిర్ణయాలను తీసుకునే దశ ప్రాప్తిస్తుంది. మన సమాజాల్లో సూడో సైన్సు ప్రబలడానికి పుకార్లను వ్యాప్తి చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. మీడియా చాలా బలమైనది. ప్రజలను సరైన పద్ధతిలో సరైన అవగాహన కలిగించగల సత్తా ఒక్క మీడియాకు మాత్రమే ఉంది. అది తన శక్తులను కేవలం పుకార్లను వ్యాపింపజేయడానికి పూనుకోవడం దారుణమైన విషయం. 

ఇపుడు పెరిగిన రిపోర్టింగ్ విషయమే తీసుకుంటే, అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు పెరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐతే ఈ రిపోర్ట్ చేసినవారం సత్యానికంటే సెన్షేషనలిజంను ఆశ్రయించడం కనిపిస్తుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా అలా కుప్పకూలిపోయాడని రాసే రాతలలో నిజానిజాలు చూడవలసి ఉంటుంది. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు ఉండవచ్చు. తప్పుడు సమాచారంతో మందులు ఆపేసిన వారు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండెజబ్బులే కావొచ్చు. CRHD కావొచ్చు. యువకులలో HOCM కావొచ్చు, Aortic stenosis కావొచ్చు. Aortic dissection కావొచ్చు. Alcoholic Dilated cardimyopathy లు కావొచ్చు, అకస్మాత్తుగా ఊడిపడే అరిథ్మియాలు కావొచ్చు. పుట్టినప్పుడే గుండె రక్తనాళాల్లో ఉండే లోపాలు కావొచ్చు. ఇలా ఎన్నో రకాల కారణాల వలన గుండె అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటుంది. ఇపుడు అన్నింటినీ "గుండెపోటు" Heart attack అని జమకట్టేస్తున్నారంటే ఏమని అర్థం?. వారికి సెన్షేషనలిజం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో లేదని అర్థం. దీని వలన అయ్యో గుండెపోట్లు పెరిగిపోతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి.

గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇపుడు అన్నింటికీ ఒకే కారణం. వాక్సీన్ అని మరో అమానవీయ ప్రచారం. ఒక తప్పుడు విషయాన్ని నిజంగా తమకు తెలిసినట్టే మాట్లాడేవారిని ఏమనాలి. ఎలా పడితే అలా మందులను, పరిహారాలను సూచించే వారిని ఏమనాలి?. దేశంలో ఎప్పటినుండో గుండెమరణాలు పైనున్న కారణాలవలన ఆగుతూనే ఉన్నాయి. కానీ దీనిని వాక్సీన్లతో ముడిపెట్టడం వలన దేశ వ్యాప్తంగా కోటాను కోట్లలో వాక్సీన్లు వేసుకున్న వారి మనఃస్థితి ఏమిటి?. ఇందులో బీపీలు షుగర్లు ఉండి బతకీడుస్తున్న సీనియర్ సిటిజన్ల పరిస్థితి ఏంటిది?.  జబ్బులతోపాటు జంటను కోల్పోయి ఒంటరిగా జీవిస్తూన్న పెద్దమనుషులు కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో ఉంటే వారిని తప్పుడు సమాచారంతో బెంబేలెత్తించేవారిని ఏమనాలి?. వారిగోడును ఎవరితో చెప్పుకోవాలి. ఇంతగా వొట్టిపోయిందా మన సమాజం అనిపిస్తుంది. ఆలోచించలేదా?. పెద్దలను, సమాజంలోని బలహీనులను గౌరవించడం అంటే వారిని భయభ్రాంతులకు లోనుచేయడమా?. ఇదేం సాడిజం?. దీనికి వాక్సిన్లతో లింకు పెడుతూ "మేమూ పోతాం మనమూ పోతాం మీరూ పోతారు" అంటూ భయపడటం భయపెట్టడం  అదేదో సరదా వ్యవహారం అన్నట్లు పోస్టులు రాసేవారిని ఏమనాలి?. మిత్రులారా ఆలోచించండి!. వాక్సీన్లకూ , గుండెజబ్బులకూ ఎలాంటి సంబంధం లేదని సైంటిఫిక్ కమ్యూనిటి ప్రపంచవ్యాప్తంగా చెబుతూనే ఉంది. గుండె జబ్బులు రాను రానూ పెరుగుతున్నాయనీ ఇదే సైంటిఫిక్ కమ్యూనిటీ గత ఇరవై యేళ్ళు గా చెబుతూనే ఉంది. హెచ్చరిస్తూనే ఉంది. వీటిని ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలూ, ప్రజలూ ఈరోజు దీనిని అన్యాయంగా వాక్సిన్లకు అంటగట్టి మరింత భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఒక రెండు అంశాలు ఒకేసారి జరుగుతున్నపుడు ఆ రెంటికి సంబందాన్ని  ఊహించడం అన్నది ఒక ఆలోచనాధోరణిలోని లోపం. దీనిని అసోసియేషన్ ఫాలసీ అంటారు. దీనికి లోనై వాక్సిన్ వేసుకున్న కోట్లాది ప్రజల జీవితసాఫల్యతమీద దెబ్బ కొట్టి వారి QUALITY OF LIFE ని అనవసర అపోహలతో దారుణంగా దెబ్బతీస్తున్నారు. ప్రశాంతంగా జీవించవలసిన వారి హక్కులను బలవంతంగా గుంజుకుని హాసిస్తున్నారు. ఇది దయచేసి చేయకండి.

  ప్రపంచ వ్యాప్తంగా ఏ కార్డియాలజీ సొసైటీ కూడా వాక్సీన్ లకు గుండెపోటులకు సంబంధాన్ని ధృవీకరించలేదు. నిర్ద్వంద్వంగా కొట్టిపాడేసింది. ఎవరో ఒకరిద్దరు డాక్టర్లు చెప్పిన విషయాలను అభిప్రాయాలను అద్భుతమైన సైన్సు అనుకునే దశనుండి విముక్తి చెందండి. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...