Jump to content

సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌.. కూడలికి శ్రీకాంతాచారి పేరు


Peruthopaniemundhi

Recommended Posts

ఎల్బీనగర్‌ కూడలిలో రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఎల్బీనగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. 

Updated : 25 Mar 2023 18:13 IST

Hyderabad: సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

‘‘ ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టాం. ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరు లోపు పూర్తి చేసి ప్రారంభిస్తాం. నాగోల్‌ మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేస్తాం. ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తాం. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానిస్తాం. ఏడాదిన్నరలోపే కొత్తపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తాం. జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం’’ అని కేటీఆర్‌ అన్నారు. ఎల్బీనగర్‌ కూడలికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

One of the worst junctions in hyd. Denamma aa junction daggarey 20-30 mins thenguthadi evening time lo. 
 

ekkada anna meeru undedi @Vaampire

Link to comment
Share on other sites

17 minutes ago, Tyrannosauraus_Rex said:

L.B. Nagar junction used to give me nightmares. I really want to see how this new flyover has ameliorated the situation.

Eppudu no stopping Kaka..very smooth.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...