Jump to content

రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్‌ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్‌


Peruthopaniemundhi

Recommended Posts

భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) కూడా గతంలో ప్రధాని మోదీ పేరును కించపర్చేలా మాట్లాడిందని, ఆమెపై ఇప్పుడు కేసు పెడతారా? అని కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె చేసిన పాత ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్‌ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని మోదీ (Modi) ఇంటిపేరును కించపర్చారన్న అభియోగాలపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష పడటం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం (Disqualification) రద్దవడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్న వేళ.. భాజపా (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో ఖుష్బూ.. ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు.

2018లో ఖుష్బూ (Khushbu Sundar) కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ కుంభకోణాలను ప్రస్తావించిన ఆమె.. ‘‘మోదీ (Modi) అంటే అర్థం అవినీతి అని మార్చాలి. అది సరిగ్గా సరిపోతుంది’’ అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్‌ (Rahul Gandhi) కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది.

దీంతో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఇప్పుడు ఖుష్బూ పాత ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై కూడా కేసు పెడతారా అంటూ భాజపాను ప్రశ్నిస్తున్నారు. 2022లో ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భాజపాలో చేరిన తర్వాత నేతలపై కేసులు మాయమవుతున్నాయని దుయ్యబడుతున్నాయి. ఈ క్రమంలో ఖుష్బూ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

2019లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ (Rahul Gandhi).. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భాజపా నేత పూర్నేశ్‌ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ న్యాయస్థానం.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన 24 గంటల్లోగా రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Vongify party :giggle: - em old strategies ra 😂😂

she made personal comments directly on Modi - she didn’t abuse the whole community where as RaGa gave accreditation to that whole community who has Modi name !
Kushbu made those comments while she was in Congress itself ! 
now she is in BJP, she says RaGa told  her to say those words and RaGa will need to appear to the court again if someone files case 😂😂😂 - appudu maa Vongify party

pisukkovadame-raoramesh.gif

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...