Jump to content

Contagium psychicum

JackSeal

Recommended Posts

ప్రపంచంలో భక్తి సినిమాలు అధికంగా వచ్చే దేశం భారతదేశమే. యూరోప్ అమెరికాలలో కూడా భక్తి సినిమాలు వస్తాయి. కానీ మనంతగా రావు. మనదేశానికున్న మతమూ,సంస్కృతి సాంప్రదాయంతోపాటు మనదగ్గర జరిగిన భక్తి ఉధ్యమాలు కూడా సగటు భారతీయులలో దేవుడి పట్ల ప్రేమను, భక్తినీ మనలో కలిగిస్తుంటాయి.

అందుకే భక్తి అంశంతో సినిమాలు తీసి నష్ట పోవడమనేది ఉండదు. వీటిని ఎలా తీసి రక్తి కట్టించాలో మనకు మాత్రమే తెలిసిన విద్యలా తయారయింది. వీటికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఎవరికోసం ఉద్దేశించి తీయాలో మేకర్స్ కి తెలుసు కాబట్టి ఆయా ప్రేక్షకులకు తగినట్టు తీయడం జరుగుతుంది. 

నాగుపాము అంశం చుట్టూ వేల సంఖ్యలో సినిమాలు వచ్చి వుంటాయి మన దేశంలో. తెలుగులో కూడా అవి ఒక ఉద్యమంలాగా వస్తుంటాయి. సాధారణ స్త్రీలు వీటిలో టార్గెటెడ్ ఆడియన్సు. అత్తమామల సాధింపులు, ఇంటింటి రామాయణాలు, ఇల్లాలి కష్టాల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత కామన్ సబ్జెక్టును తీసుకున్నారో. అందుకే ఇవి భలే అప్పీలింగ్ గా స్త్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ వీటికి ఆదరణ అలాగే ఉంది అంటే, ఈ రోజుకీ కుటుంబ విలువల్లో, సంబంధ బాంధవ్యాలలో కట్నకానుకాది సాధింపులల్లో మన సమాజంలో పెద్దగా మార్పులు రాలేదని అర్థం. 

ముఖ్యంగా ఈ సినిమాలు చూసి పూనకాలు వచ్చేలా చేయడంపై మేకర్స్ దృష్టి పెడతారు. కొన్ని సీన్లలో దేవుడి దర్శనం జరగడం వంటివి, ఆ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీక్షకులను ఉద్రేకులను చేస్తుంటాయి. ఉద్రేకం ఊగిపోయేంతగా తీసికెళ్ళి పూనకాలు వచ్చేలా చేయగలగడం ఎలా అన్నది మేకర్స్ ముందున్న ఛాలెంజ్. కోడి రామకృష్ణ, వాసు, రాఘవేంద్రరావు వంటి ఉద్ధండ దర్శకులు ఎవరి రీతిలో వారు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. పూనకాల గురించి కార్ల్ యూంగ్ చాలా రాశారు. మనిషిలోని ఇల్లాజికల్ ఎమోషనల్ పార్శ్వాన్ని గ్రీకులు కూడా అర్థం చేసుకున్నారని, రిచర్డ్ వాగ్నర్ చేసిన సంగీతం ఇటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేదని అంటాడు నీషే. 

 ఇటువంటి సినిమాలు వాటిలో జరిగే పూనకాలూ మనదేశంలో మాత్రమే కాదు, వివిధ దేశాల్లో జరిగాయని మనకు డాటా వుంది. మన దేశంలో సరైన స్టడీస్ జరగలేదు కానీ దగ్గరగా పరిశీలించినవారు లేకపోలేదు. కుటుంబపరంగా ఆర్థిక సామాజిక ఒత్తిడికి లోనౌతున్నవారికి పూనకాలు సర్వసాధారణంగా రావడం కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నేల టికెట్ , బెంచీ టికెట్ వారికి వచ్చే పూనకాలు కుర్చీ, బాల్కనీ టికెట్ వారికి రావడం లేదు. రావు అని కాదు. సంఖ్యా పరంగా చూస్తే నేలటికెట్ లో ఉన్నవారికి, సి క్లాస్ థియేటర్లలోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. బాల్కనీలో ఉండే వీరాభిమానికి ఎపుడూ పూనకం వచ్చి ఊగిపోవడం రాదు కానీ, అతడు నేలటికెట్ లో ఉండే అభిమాని పూనకంతో ఊగిపోవడాన్ని ఆమోదిస్తు గొప్పగా చెప్పుకోవడం కనిపిస్తూ ఉంటుంది. 

ఇదొక అంటువ్యాధిలా జరుగుతుంది. ఒకరిని చూసి మరొకరికి రావడం. సూక్ష్మ క్రిముల ద్వారా జబ్బు ఒకరినుండి ఒకరికి పాకినట్టు( contagium vivum) పూనకం అనేది సజెషన్ ద్వారా ఒకరినుండి మరొకరికి పాకుతుంది (contagium psychicum) అంటాడు పూనకాలమీద విస్తృతంగా స్టడీ చేసిన బెక్తెరేవ్ అనే రష్యన్ న్యూరాలజిస్టు. (Suggestion and its role in social life by V.M. Bekhterev) వీటికి ఆమోదం దొరకడం నిజానికి విషాదం. సినిమా ద్వారా ఆమోదం దొరకడం మరింత విషాదం. "అసలా సినిమా చూస్తే నాకైతే పూనకం వచ్చేసింది" అని చెప్పుకోవడం చూస్తుంటాం. నిజానికి సినిమా ఫీవర్ వంటిదొకటి ఆవహించి అందరూ గొప్పగా వుందని చెప్పుకుంటున్న తరుణంలో ఒక sense of groupings వంటిదేదో వచ్చి అబ్బా నాకు కూడా తెగ నచ్చేసిందని చెప్పుకోవడం వంటిది ఇది. సర్వ సాధారణమైనదే. కానీ నిజంగా పూనకం రావడమనేది వ్యక్తి అస్థిరమైన మానసిక స్థితి కదా!. దీనికెందుకు ఆమోదం తెలపాలి?. Rtc x roads లో సినిమా చూస్తే వచ్చే కిక్కు ప్రసాద్ ఐమాక్స్ లో క్లాస్ ఆడియన్స్ మధ్యన చూస్తే రాదనేవారు కోకొల్లలు. వాళ్ళు స్వతహాగా పేపర్లను చింపి గాలిలో వేయరుగానీ అభిమాన హీరో సినిమా అలా అల్లరిచేసి పూనకాలు తెప్పించేచోటే చూడాలని అనుకుంటారు. ఇది కంటాజియమ్ సైకికం కి మంచి ఉదాహరణ.

ఆ సినిమాలో ముందు వరుసలో ఇద్దరుముగ్గురికి పూనకం వచ్చేసింది.జడలు విరబోసుకుని అరవడం మొదలెట్టారు తెలుసా అని సాగతీసి చెప్పడంలో సినిమా ఎంతో బాగుందని ఉబ్బిపోతూ చెప్పడం ఉంది. కానీ నిజానికి ఆ సినిమా సున్నితమైన నిలకడలేనీ లేదా సామాజికార్థిక బలంలేని కొందరిని తమలోపల ఉన్న స్థితిని బయటకు పడవేసిందని తెలుసుకోవడం అవసరం. సినిమా ప్రమోటర్స్ ఇలా పూనకాలు రావడం చాలా గొప్ప విషయం అన్నట్టు ప్రచారం చేసుకోవడం దానిని మరింత పెంచి పోషించినట్టు ఔతుందా కాదా?. హీరో వీర ఫ్యాన్స్,  కూడా మా హీరో సినిమా చూస్తే మీకు ఇంక పూనకాలే అని గర్వంగా చెప్పుకోవడం ఒక అన్ బాలెన్స్డ్ మానసిక స్థితికి ఆమోదం తెలపడమే. పిచ్చితనాన్ని స్వాగతించడమే కదా. ఇలాంటి వల్నరబుల్ ప్రజానీకాన్ని తయారు చేయడం, వారి మానసిక స్థితులను exploit చేసి డబ్బు సంపాదించడం అన్నది ఏ రకంగాను ఎంకరేజ్ చేయవలసిన అంశం కాదు.

ఐతే కేవలం సినిమా వరకే కాక క్రికెట్, రాజకీయాలకు కూడా ఈ పూనకాల వ్యాప్తి జరుగుతోంది. అభిమానం ఉండడం వేరు. ఆ అభిమానం పూనకంగా మారడం వేరు. కంటికి కనిపించని సూక్ష్మ జీవుల్లాగే వార్తలు వండివార్చి జనాలమీదకు వదలడం వాటి బారిన పడి మానసిక సమతౌల్యతను కోల్పోయి ఊగిపోవడం ప్రస్తుతం మనం చూస్తున్న చిత్రం. ఈ పిచ్చితనానికి విస్తృత జనామోదం దొరకడమే శోచనీయాంశం.

Link to comment
Share on other sites

29 minutes ago, JackSeal said:

Arey Sickular l koduka endukura anta edupu

mi valla meeda chala movies poye chusi chill Avvu 

Dibt cry everything , with this type of negativity you can’t survive long .. Nuvvu chala undelivered batakali e progress chudataiki ayena sare 

  • Sad 1
Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

yatra ah list lo vundha?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...