Jump to content

Tadipatri: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య


psycopk

Recommended Posts

Tadipatri: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య 

03-07-2023 Mon 07:31 | Andhra
  • అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • పని ఒత్తిడే ప్రాణం తీసిందన్న ఆయన కుమార్తె భవ్య
  • తన వల్ల కావడం లేదని చెబుతూ తనవద్ద బాధపడేవారని ఆవేదన
 
Tadipatri CI Ananda Rao Committed Suicide

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. 

రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారని, అయినా ఎక్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు తన వద్ద బాధపడ్డారని భవ్య తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, Dallas_c_how_dare said:

Something fishy? Obuelreddy aka jagan hand vunda? Bathroom lo babai

SI CI ni champe antha level ki vellarule. Teesi pakkana padestaru. 

Link to comment
Share on other sites

Enta jaffas hand lekunda ila jaragade anukuna.. confirm chesadu peddi reddy

JC Prabhakar Reddy: సీఐ ఆత్మహత్య విషయం తెలియగానే.. తెల్లవారుజామున 4 గంటలకే పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారు?: జేసీ ప్రభాకర్ రెడ్డి 

05-07-2023 Wed 12:49 | Andhra
  • పెద్దారెడ్డి ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారన్న జేసీ
  • సీఐ ఫోన్ డేటాను పెద్దారెడ్డి డిలీట్ చేశారని ఆరోపణ
  • సీఐ సూసైడ్ లెటర్ ఏమైందని ప్రశ్న
 
Why MLA Pedda Reddy went to CIs house in early hours asks JC Prabhakar Reddy

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఐ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే... తెల్లవారుజామున నాలుగు గంటలకే సీఐ ఇంటికి పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టాలని సీఐపై పెద్దారెడ్డి ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. తెల్లవారుజామునే సీఐ ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి ఆయన్ ఫోన్ డేటాను డిలీట్ చేశారని అన్నారు. సీఐ రాసిన సూసైడ్ లెటర్ ఏమైందని ప్రశ్నించారు. 

ఓ కేసులో వైసీపీ నేత ఫయాజ్ బాషా పేరును తొలగించాలని పెద్దారెడ్డి సీఐపై ఒత్తిడి తెచ్చారని జేపీ తెలిపారు. ఆనందరావు కుటుంబసభ్యులను కూడా పెద్దారెడ్డి బెదిరించారని జేసీ చెప్పారు. మౌనంగా ఉండాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సాయం రాదని హెచ్చరించారని తెలిపారు. సీఐది ముమ్మాటికీ హత్యేనని అన్నారు. పెద్దారెడ్డే ఉరి వేసి చంపేశాడేమోననే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. 

టీడీపీ అధికారంలోకి రాగానే ఆనందరావు కేసును రీఓపెన్ చేస్తామని... ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని తెలిపారు. మా అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని గతంలో పోలీస్ అసోసియేషన్ పెద్ద ఇష్యూ చేసిందని... ఇప్పుడు సాక్షాత్తు సీఐ చనిపోతే మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...