Peruthopaniemundhi Posted July 3, 2023 Report Share Posted July 3, 2023 నా సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు 03-07-2023 Mon 17:53 | Telangana నేను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించిన రఘునందన్ మూడింట్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ తన గెలుపు తర్వాతే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారని వ్యాఖ్య వందల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలవలేదన్న రఘునందన్ బండి సంజయ్ వందల కోట్ల రూపాయల యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్న పార్టీ కోసం పదేళ్లుగా పని చేస్తున్నాను.. అధ్యక్ష పదవి కోసం నేను అర్హుడిని కాదా? పార్టీలో నాకు గౌరవం ఇవ్వాలి... సేవలకు తగిన ప్రతిఫలం దక్కకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... పదేళ్లుగా పార్టీ కోసం తనలా ఎవరూ కష్టపడలేదన్నారు. దుబ్బాకలో తన విజయాన్ని చూసిన తర్వాతే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారన్నారు. తనకు పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పదవి, జాతీయ అధికార ప్రతినిధి... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలన్నారు. కొన్ని విషయాల్లో తనకు తన కులమే శాపం కావొచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. దుబ్బాక నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఉప ఎన్నికల్లో తనకు ఎవరూ సాయం చేయలేదని, తాను మాత్రం బీజేపీలోనే ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, గెలవలేదన్నారు. అదే రూ.100 కోట్లు నాకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో తనను చూసే గెలిపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో మరొకరిని నియమిస్తారనడం వాస్తవమే అన్నారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాథమన్నారు. ఆయన పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని, అలాంటి వ్యక్తి వందల కోట్ల రూపాయలతో యాడ్స్ ఎలా ఇచ్చారని నిలదీశారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఫోటోలతో ఓట్లు రావని, రఘునందన్, ఈటల రాజెందర్ బొమ్మలతోనే వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అన్నారు. తెలంగాణ శాసన సభలో బీజేపీకి శాసన సభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదని, వారి దృష్టికి తీసుకువెళ్తే అదేమిటని అడిగారు తప్ప తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.