Jump to content

ఏపీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది


Undilaemanchikalam

Recommended Posts

ఏపీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది

ఈనాడు, దిల్లీ: గ్రామీణంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అత్యంత దుఃఖంతో ఈ సభ దృష్టికి తెస్తున్నానని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటానూ సమకూర్చలేదని వివరించారు. ఇది కచ్చితంగా ఆందోళనకర స్థితి అని పేర్కొన్నారు. వారితో నిరంతరం సంప్రదిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం..

ఇప్పటివరకు దేశంలో తెలంగాణ, దాద్రానగర్‌హవేలీ, దామన్‌దయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా, గుజరాత్‌, హరియాణ రాష్ట్రాలు తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు కుళాయిని అందుబాటులోకి తెచ్చాయి.
 

పుదుచ్చేరి, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లు 99%కిపైగా ఇళ్లకు నీరందిస్తున్నాయి.
బిహార్‌ 96.38% ఇళ్లకు కుళాయి నీరు ఇస్తోంది. మిజోరం (89.71%), సిక్కిం (86.16%), అరుణాచల్‌ప్రదేశ్‌ (84.50%), ఉత్తరాఖండ్‌ (78.41%), లద్ధాఖ్‌ (78.01%), మహారాష్ట్ర (77.44%), మణిపుర్‌ (76.63%), నాగాలాండ్‌ (73.07%) తర్వాతి స్థానాల్లో ఏపీ (70.05%) ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...