ఈనాడు, దిల్లీ: గ్రామీణంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్‌జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అత్యంత దుఃఖంతో ఈ సభ దృష్టికి తెస్తున్నానని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధిం