Jump to content

Safest place to keep your phone - Brazil style


BattalaSathi

Recommended Posts

Bizarre Love Story : ఫోన్‌ కొట్టేసినోడితో బ్రెజిల్‌ యువతి ప్రేమాయణం.. రెండేళ్లుగా సాగుతోందట

Eenadu
~3 minutes

ప్రేమ (Love) ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరిలోనైనా పుడుతుందంటారు. ఓ చోరీ నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ బ్రెజిలియన్స్‌ ప్రేమకథ గురించి చదివేయండి. 

Published : 27 Jul 2023 02:12 IST

26072023cellphone_1.jpg

Image : Milton Neves twitter

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సెల్‌ఫోన్‌ చోరీ చేసిన దొంగతోనే ఓ బ్రెజిల్‌ (Brazil) యువతి ప్రేమలో (Love)  పడింది. వారిద్దరూ కలిసి తమ లవ్‌స్టోరీని (Love story) వివరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. తాము ఎలా పరిచయమయ్యామో యువతి ఇమాన్యులా అందులో వివరించింది. ‘నేను ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అతడు అదే వీధిలో నివాసం ఉంటున్నాడు. అకస్మాత్తుగా వచ్చి నా ఫోన్‌ లాక్కొని పారిపోయాడని’ తన ఫస్ట్‌ డేట్‌ గురించి చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఫోన్‌లో ఆమె ఫొటో చూడగానే తన మనసు మారిపోయిందని ఆ దొంగ తన ప్రేమ కథను వెల్లడించాడు. 

డార్క్‌వెబ్‌లో ఆరితేరిన 8 ఏళ్ల బాలుడు.. ఏకే-47 రైఫిల్‌ ఇంటికి తెప్పించుకున్నాడు!

‘నేను క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాను. మీకు తెలుసా.. అంతవరకు నా జీవితంలో ఏ అమ్మాయికి చోటు లేదు. ఫోన్‌లో వాల్‌పేపర్‌పై ఆమె ఫొటో చూడగానే ఎంత అందమైన జుట్టు ఈమెది అనుకున్నాను. ఇలాంటి అమ్మాయిని రోజూ చూడలేమని నాకు నేను సంజాయిషీ ఇచ్చుకున్నాను. ఆ అమ్మాయి ఫోన్‌ దొంగతనం చేసినందుకు ఎంతగానో బాధపడ్డానని’ చెప్పాడు. ఈ కథంతా విన్న తరువాత ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘అయితే నువ్వు మొదట ఆమె ఫోన్‌ కొట్టేశావ్‌.. తరువాత అమె మనసు దోచేశావ్‌’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దానికి ఆ దొంగ ‘కచ్చితంగా’ అంటూ బదులిచ్చాడు. వీరిద్దరూ కలిసి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. 

ఈ దొంగ ప్రేమ కథ వైరల్ కావడంతో ట్విటర్‌లో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలాంటి అసంభవమైన ప్రేమకథలు బ్రెజిల్‌లో మాత్రమే పుడతాయని’ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘ప్రేమ పుష్పం ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా వికసిస్తుందని’ మరికొందరు కవితాత్మకంగా రాసుకొచ్చారు. ‘వినడానికి కామెడీగా ఉన్నా ఇది రియల్‌.. ఎందుకంటే అది బ్రెజిల్’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...