Jump to content

హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?


Peruthopaniemundhi

Recommended Posts

Nara Lokesh: హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు.

Nara Lokesh: హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

తాడికొండ: దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. రావెలలో ‘అమరావతి ఆక్రందన’ పేరుతో రాజధాని రైతులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయి.. నాలుగేళ్లు అయ్యింది. దుర్గగుడికి వెళ్తే పోలీసులు అడ్డుకుని కొట్టారు. బూటుకాళ్లతో తన్నారు. పొలాల్లో పనిచేసే కూలీలను పలుచోట్లకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. మేం ఏమైనా దొంగలమా? నక్సలైట్లమా? రాజధాని కోసం భూములు ఇవ్వడమే మేం చేసిన తప్పా?’’ అంటూ లోకేశ్‌ ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. 

హైకోర్టు మారుస్తామని ఎప్పుడూ అడగలేదు..

రాజధాని రైతుల ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ వారికి భరోసా ఇచ్చారు. ‘‘అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు. చిత్తూరు, నెల్లూరు. ప్రకాశం జిల్లాలకు అనేక పరిశ్రమలు తెచ్చాం. గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమలు తెచ్చాం. విశాఖ జిల్లాకు అదానీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ పరిశ్రమలు తెచ్చాం. 5 కోట్ల ఆంధ్రుల కోసం ఏటా 3 పంటలు పండే భూములను అమరావతి రైతులు త్యాగం చేశారు. ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టిన జగన్‌.. ఎన్నికల తర్వాత మాట తప్పారు.. మడమ తిప్పారు. అమరావతి రైతులను అన్ని రకాలుగా అవమానించారు. 3 రాజధానులు అంటున్నారు. ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా? హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని సీజేను ఎప్పుడూ అడగలేదు. విశాఖ ప్రజలను కూడా జగన్‌ మోసం చేస్తున్నారు.

Nara Lokesh: హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

కర్ణాటకకు ఫాక్స్‌కాన్‌ను మతం తీసుకెళ్లిందా?

ఏపీ పేపర్లలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, దాడుల వార్తలే కనిపిస్తున్నాయి. తెలంగాణ పేపర్లలో నిత్యం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలు. ఇక్కడి పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.  కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య జగన్‌ చిచ్చు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా? కర్ణాటకకు ఫాక్స్‌కాన్‌ మతం తీసుకెళ్లిందా?తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.. మిగతవారికి న్యాయం చేస్తారా? అమరావతిలో ఆపేసిన పనులన్నీ మేం వచ్చాక మళ్లీ ప్రారంభిస్తాం. అమరావతి రైతులు మరో 9 నెలలు ఓపిక పట్టాలి’’ అని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. 

వైకాపా రాక్షస పాలన అంతం చేద్దాం: శ్రీదేవి

ఈ ముఖాముఖి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని, అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే లోకేశ్ అని.. వారిద్దరూ అమరావతి రైతుల వెన్నంటే ఉంటారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రైతులను వదిలివేయరని స్పష్టం చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు అన్నారని.. కానీ, తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా లోకేశ్ కొండంత భరోసా ఇచ్చారన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది చెందుతుందన్నారు. అందరం కలిసి వైకాపా రాక్షస పాలన అంతం చేస్తే.. రాష్ట్రంతోపాటు రాజధానిని కాపాడుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Nara Lokesh: హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

  • Like 1
Link to comment
Share on other sites

55 minutes ago, kevinUsa said:

Evaro manchi script writer ni hire chesukunnaru anukunta

yeah..parvaaleedhu..antha baane vundhi

kaani CM candidate yevaro theliyatla. CBN or Pappu or PK ??

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, bharathicement said:

yeah..parvaaleedhu..antha baane vundhi

kaani CM candidate yevaro theliyatla. CBN or Pappu or PK ??

mee revenge script ni jaggad exceute chesadu but meeru anukunattu adhi only tdp varaku kadhu state motham implement chesadu  dani result TDP is coming back

enjoy it

cbn is cm

loki n pk ki antha scene ledhu ley 

 

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

mee revenge script ni jaggad exceute chesadu but meeru anukunattu adhi only tdp varaku kadhu state motham implement chesadu  dani result TDP is coming back

enjoy it

cbn is cm

loki n pk ki antha scene ledhu ley 

 

@HEROO lololo right leg or legt legg urr choice

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...