Jump to content

Urdu influence on Telugu!


hyperbole

Recommended Posts

https://x.com/vinaych/status/1688980488701308928?s=61&t=Vmqh9neX_FIGq2W1J-t57A

 

a basic small conversation in Standard Telugu.

Ramu : Somu. Ela Unnavu? 
Somu : Nenu Kulasane! Nuvvu? 
Ramu : Nenu Kuda Kulasane, enni rojullayyindi kada manam Kalisi? 
Somu : Emiti, chala Husharuga unnavu? 
Ramu : Naaku PeLLi *Nishayam ayyindi! 
Somu : Edi *vadhuvuni chupinchu.
Ramu : Idigo Maa Jodi ela undhi? 
Somu : Ammayi to polisthey nuvvu maamooluga unnavu. 
Ramu : ChaaLLe Badayi! 
Somu : Aakhariki 
neeku kuda Pellavthunde! 
Ramu : Avunu neeku Kallajodu eppudu vacchindi? 
Somu : *Mitrama ivi Nakili KallaJoLLu Asalainavi kadhu. 
Ramu : Sare, Selavu Mari!

See Bold are Urdu and *Bold are Sanskrit. Urdu has occupied our Language almost 25% of the vocabulary! And Sanskrit can occupy upto 50% vocabulary and the left is Telugu!

even more words like Maaji, Vaida, Taraphuna, Raseedu, manjooru, vakeelu, Jawabu etc. Jaldi (fast) , Jaaga ( Land), Bandhu ( Stop/Close) , Paisalu ( Money) , Bapu ( Father), Chetri ( Umbrella) , Macchardaan ( Mosquito net), Karabu ( Spoil) 

 

Link to comment
Share on other sites

3 hours ago, hyperbole said:

https://x.com/vinaych/status/1688980488701308928?s=61&t=Vmqh9neX_FIGq2W1J-t57A

 

a basic small conversation in Standard Telugu.

Ramu : Somu. Ela Unnavu? 
Somu : Nenu Kulasane! Nuvvu? 
Ramu : Nenu Kuda Kulasane, enni rojullayyindi kada manam Kalisi? 
Somu : Emiti, chala Husharuga unnavu? 
Ramu : Naaku PeLLi *Nishayam ayyindi! 
Somu : Edi *vadhuvuni chupinchu.
Ramu : Idigo Maa Jodi ela undhi? 
Somu : Ammayi to polisthey nuvvu maamooluga unnavu. 
Ramu : ChaaLLe Badayi! 
Somu : Aakhariki 
neeku kuda Pellavthunde! 
Ramu : Avunu neeku Kallajodu eppudu vacchindi? 
Somu : *Mitrama ivi Nakili KallaJoLLu Asalainavi kadhu. 
Ramu : Sare, Selavu Mari!

See Bold are Urdu and *Bold are Sanskrit. Urdu has occupied our Language almost 25% of the vocabulary! And Sanskrit can occupy upto 50% vocabulary and the left is Telugu!

even more words like Maaji, Vaida, Taraphuna, Raseedu, manjooru, vakeelu, Jawabu etc. Jaldi (fast) , Jaaga ( Land), Bandhu ( Stop/Close) , Paisalu ( Money) , Bapu ( Father), Chetri ( Umbrella) , Macchardaan ( Mosquito net), Karabu ( Spoil) 

 

may be వ్యావహారిక భాషోద్యమం is the reason…

 

more from wiki…

తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారథ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు, వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.

చరిత్ర

1907లో జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతని ముఖ్య సమస్య. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి మద్దతు ఇతనికి లభించింది.

1912-13లో స్కూలుఫైనల్‌లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలు ఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.) ఇచ్చాడు. ఆధునిక భాషకు లక్ష్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్యరచించిన కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులుఅధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.

1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు "గిడుగు". సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.

స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగంఅధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించారు.

1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.

1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచంనలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో "Miscellany of Essays" (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు.

1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" అనే సాహిత్యపత్రికను ప్రచురించారు.

1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

అభిప్రాయాలు

గ్రాంథిక భాషావాదుల అభిప్రాయాలు

అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.

వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.

వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.

వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.

వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి ? ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.

నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.

వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.

శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.

వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు

వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.

వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేవు.

తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత్తవ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.

వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.

వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం.

గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.

వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.

వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితుల భాష

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...