Jump to content

అమెరికాలో తెలుగు వాళ్ల ప్రాక్సీ బతుకులు


Guest

Recommended Posts

ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువంటే కష్టతరమైన వ్యవహారం. ఎందుకంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం యూనివర్సిటీ పరిధిలో ఉండేవి. కానీ ఎప్పుడైతే లెక్కలేనన్ని కాలేజీలకి అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగిందో నాలుగేళ్ల చదువులో పాసవ్వడం పెద్ద సమస్యే కాదన్నట్టుగా తయారైంది.

ఎంసెట్లో ఏ ర్యాంకొచ్చినా, దండిగా ఫీజు కడితే సీటిచ్చే ఇంజనీరింగ్ కళాశాలలు కోకొల్లలు. ఏదో విధంగా నాలుగేళ్ల బీటెక్ చదువుని అయ్యింది అనిపించేసాక 2-3 లక్షల పారేస్తే స్టూడెంట్స్ తరపున జీ.ఆర్.ఈ, టోఫెల్ పరీక్షలు రాసే ప్రాక్సీ గాళ్లు కూడా దొరికేస్తున్నారు. దీనికి ఏకంగా అనధికారిక కన్సెల్టన్సీలే ఉన్నాయి. అంటే ఇంగ్లీషులో చాలా పదాలకు స్పెల్లింగులే తెలియని వాళ్లకి కూడా ఆ సబ్జెక్ట్స్ లో నిష్ణాతులైన వాళ్లు బినామీగా రాయడం వల్ల భారీ స్కోర్లొచ్చేస్తాయన్నమాట. ఆ స్కోరులతో మోసం చేసేది అమెరికానే కాబట్టి ఇండియాలో మనవాళ్లు దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదేమో! అది వేరే సంగతి. 

ఇంతకీ రియల్ టేలెంటుతో కష్టపడి చదివి జీ.ఆర్.ఈ, టోఫెల్ రాసి స్కోరులు తెచ్చుకునే విద్యార్థులతో పాటూ ఈ ప్రాక్సీ బ్యాచ్ కూడా విపరీతంగా ఉంటున్నారు. ఆ స్కోర్లతో అమెరికన్ యూనివర్సిటీలకి అప్లై చేసుకుంటే ఐ-20 లు (అడ్మిషన్స్) వచ్చేస్తున్నాయి. దానిని పట్టుకుని కాన్సులేట్ కి వెళితే గతంలో విసా వస్తుందన్న గ్యారెంటీ ఉండేది కాదు. కానీ ఈ మధ్యన అలా కాదు. ఇబ్బడి ముబ్బడిగా వీసాలిచ్చి పారేస్తున్నారు. 

ఇంతకీ ప్రాక్సీ స్కోరులతో అమెరికన్ యూనివర్సిటీల్లో చేరుతున్న తెలుగు విద్యార్థుల బతుకుల గురించి చెప్పుకుందాం. 

వాళ్లు ఫీజు కట్టి యూనివర్సిటీల్లో చేరతారు. కానీ చదవరు. వాళ్ల పక్షాన ప్రాజెక్టులు రాయడానికి, పరీక్షలు రాయడానికి కూడా అక్కడున్న మన తెలుగు కన్సెల్టెన్సీలు కొన్ని ప్రాక్సీలను అరేంజ్ చేస్తున్నాయి. అలా తమ తరపున ఎవరో పరీక్షలు రాయడంతో సెర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తున్నాయి సదరు యూనివెర్సిటీలు. 

ఈ ర్యాకెట్ ని గుర్తించి ఆ యూనివర్సిటీలు చర్యలు తీసుకోవా అని అడగొచ్చు. కానీ ఇక్కడొక నగ్నసత్యం తెలుసుకోవాలి. అమెరికాలో ఉన్న ప్రతి యూనివర్సిటీని, ప్రతి కాలేజిని గొప్పగా ఊహించేసుకోనక్కర్లేదు. ఏవో కొన్ని టాప్ 100 లేదా 200 యూనివర్సిటీలను మినహాయిస్తే మిగిలిన వాటిల్లో చెత్తవి బోలెడు. వాళ్లకి కావాల్సింది ఫీజులు చెల్లించే విద్యార్థులు. చదువుకోసం లక్షలు, కోట్లు ధారపోసే వెర్రితనం మనవాళ్లకే ఎక్కువ కనుక విషయం ఏమౌతున్నా చూసీ చూడనట్టు ఊరుకుని సర్టిఫికేట్ ఇచ్చేసే కాలేజీలు చాలా ఉన్నాయని ఒక సమాచారం. 

మరి చదువు పేరుతో అక్కడి దాకా వెళ్లిన ఈ విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా, చదవకుండా ఏం చేస్తారు? ఏముంది...ఆడ్ జాబ్స్ చేసుకుంటూ డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. ఇలా ప్రాక్సీ మార్గంలో అమెరికాకు తోలుకొచ్చిన కన్సెల్టన్సీలు నడిపే బ్రోకర్లు వీళ్లని కొందరు హీరోలకి సపోర్టింగ్ గా నినాదాలకి, వాళ్ల సినిమాలు విడుదలైనప్పుడు సినిమా హాల్స్ వద్ద రభస చేయడానికి, కులం గుంపులు కట్టించడానికి..ఇలా రకరకాలుగా వాడుతుంటారు.

ఇక్కడ ఒక సిగ్గుచేటైన విషయం కూడా చెప్పుకోవాలి. ఇండియాలో ఎన్నికలప్పుడు మందు,బిర్యాని ఇస్తే ర్యాలీల్లో జనం పాల్గొనడం తెలుసు. ప్రాక్సీ పద్ధతుల్లో అమెరికా వెళ్లి బతుకుతున్న ఎందరో యువకులు కూడా అదే మందు, బిర్యానికి బ్రోకర్లు చెప్పినట్టల్లా చేసేస్తున్నారు. అదీ పరిస్థితి. 

కథ అక్కడితో అయిపోదు. ఈ యువత నుంచి మళ్లీ భారీగా డబ్బులు తీసుకుని ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించేస్తారు. అదెలా సాధ్యం అని మీరు అడగొచ్చు? ఏ టేలెంటూ, సబ్జెక్టూ లేని ప్రాక్సీ బతుకులకి "మంచి" ఉద్యోగం ఎలా వస్తుంది అని మీకు సందేహం కలగొచ్చు. ఇక్కడ కూడా ప్రాక్సీమంత్రమే మరి! 

తమ పక్షాన ఒక నిష్ణాతుడు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాడు. ఆ కంపెనీ హెచార్ మేనేజర్ ని మన బ్రోకర్లు కొనేస్తారు. ఏ రకంగా అంటే.. తమ కేండిడేట్ పేరుతో ఒక ఫేక్ గ్రీన్ కార్డ్ ప్రింట్ చేసి దానిని హెచ్చార్ కి చూపిస్తారు. ఆ గ్రీన్ కార్డ్ సరైనదా కాదా అనేది సదరు హెచ్చార్ మేనేజర్ నిర్ధారించుకోవాలని ఎక్కడా చట్టం లేదు. గ్రీన్ కార్దే ఉంటే హెచ్ 1 బి వీసా వగైరాల ప్రస్తావనే ఉండదు. కనుక ఆ ప్రాక్సీ గ్రీన్ కార్డ్ నే పరిగణనలోనికి తీసుకుని ఉద్యోగం ఇచ్చేస్తాడు హెచ్చార్. 

ఒకవేళ భవిష్యత్తులో ఫేక్ గ్రీన్ కార్డుతో ఉద్యోగం పొందాడని ఏ ఎఫ్బీయై వాళ్లో పట్టుకున్నా కూడా హెచ్చార్ మేనేజర్ కి పోయేదేమీ ఉండదు. తాను కూడా మోసపోయాననే చెప్తాడు. శిక్ష పడినా, డిపోర్టేషన్ కి గురైనా అదంతా కేండిడేటే పడాలి. 

తమ కంటి నుంచి ఏ తప్పు తప్పించుకోలేనంత బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెప్పుకునే అమెరికాలో ఎంత డొల్లతనం ఉందో చూడండి! కొలంబస్ వందలేళ్ళ క్రితం అమెరికాను కనుగొని కొల్లగొడితే, మన తెలుగువాళ్లు ప్రస్తుత అమెరికాలోని డొల్లతనాన్ని కనిపెట్టి ఈ విధంగా కొల్లగొడుతున్నారు. ఇది సిగ్గుమాలినతనం. 

మొత్తానికి అలా ప్రాక్సీ పద్ధతిలో పొందిన ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత కేండిడేట్ కి, కొంత బినామీగా పని చేస్తున్న నిష్ణాతుడికి పరేసి మిగతాది ఈ బ్రోకర్లే తింటున్నారు. 

ప్రాక్సీ ఎంప్లోయీస్ గా పని చేసే నిష్ణాతులు కూడా అధికశాతం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే. స్టూడెంట్ వీసా మీద ఉంటూ కూడా అమెరికాలో ఇళ్లు కొనగలిగే యువకులు ఉంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఏకకాలంలో ఎన్ని బినామీ ఉద్యోగాలు చేసి ఎంతెంత సంపాదిస్తున్నారో! 

నిజానికి ఎంట్రీ లెవిల్ ఉద్యోగాల్లో పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల్లో భయంకరమైన వర్క్ ప్రెజర్ ఉండదు. కనుక ఎబోవ్ ఏవరేజ్ స్టూడెంట్స్ కి అయినా కూడా 3-4 ఉద్యోగాలు చేయడం పెద్ద కష్టం కాదు, సంపాదించాలన్నా యావ ఉంటే చాలు. 

ఆ విధంగా అడుగడుగునా ప్రాక్సీ బతుకులు బతుకుతున్న మన తెలుగువాళ్లు అమెరికాలో ప్రతి నగరంలోనూ కనిపిస్తున్నారు. ఒక్క "తెలుగువాళ్ళే" ఈ రకంగా అమెరికాకి తరలి వెళ్తున్నవాళ్లు! ఇతర భారతీయుల కేసులు పెద్దగా కనపడవు. కనపడ్డా ఒకటి అరా ఉంటే ఉండొచ్చు తప్ప ఇంత మూకుమ్మడిగా, ఇబ్బడిముబ్బడిగా, ఒక జాతికి చెందిన గుంపుగా మాత్రం కనపడరు. 

అమెరికాలో కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి ప్రాక్సీ వ్యాపారం చేస్తున్న తెలుగువాళ్ల వల్ల అక్కడి లోకల్ సిటిజెన్స్ కి ఉద్యోగాలు రావడం లేదు. దానికి కారణం టేలెంటున్న ఒక్కొక్క విద్యార్థి, లేదా టెకీ నాలుగైదు ప్రాక్సీ ఉద్యోగాలు చెసేస్తున్నాడు మరి. ఎప్పుడైతే "వర్క్ ఫ్రం హోం" విధానం కామనై పోయిందో ఈ పరిస్థితి మరింత పెరిగింది. అందుకే "కం బ్యాక్ టు ఆఫీస్" అంటే రామని మారాం చేస్తున్న తెలుగు టెకీలు ఎక్కువగా ఉన్నారిప్పుడు. 

దొంగ దారిలో అమెరికాలోకి చొరబడ్డ మెక్సికన్లు ఏవో ఆడ్ జాబ్స్ చేసుకుంటూ బతికేస్తుంటారు. ఇప్పుడు వాళ్లకి పోటీగా మన ప్రాక్సీగాళ్లు తయారయ్యారు. ఆడ్ జాబ్స్ చేసుకోవడం, తమ బ్రోకర్లని సాయపడడం లాంటివి చేసుకుంటూ గడిపేస్తున్నారు. ప్రాక్సీ జాబ్ ద్వారా వచ్చే సగం జీతమో, పావు జీతమో రానే వస్తుంది. 

ఇలాంటి వాళ్లని తయారు చేసి వందల, వేల కోట్లల్లో రిక్రూట్మెంట్ కన్సెల్టెన్సీలు సంపాదిస్తున్నాయి. వాటి ఓనర్స్ మన తెలుగు వాళ్లే. వారిలో అందరూ 100% ఇదే పని చేస్తున్నారని కాదు. ఎంద్తో కొంత అయితే ఏదో ఒక స్థాయిలో చేస్తున్న మాటైతే నిజం. ఎక్కడికక్కడ అన్నీ మేనెజ్ చేస్తుంటారు కనుక దొరకనంత వరకు వీళ్లు దొరలే. అలా సంపాదించిన డబ్బుతో ఇండియాలో రాజకీయ నాయకులకి విరాళాలివ్వడం, లేదా సినిమా వ్యాపారంలో చేతులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. 

గతంలో ఇలా సంపాదించిన కొందరు కన్సెల్టెన్సీ ఓనర్స్ అక్కడి చట్టానికి దొరికిపోయే పరిస్థితి వస్తే అప్పటికప్పుడు టెక్సాస్ గుండా మెక్సికోలోకి పారిపోయి, అటునుంచి షిప్ ఎక్కి ఎప్పటికో భారతదేశానికి చేరిన వ్యక్తులు కూడా ఉన్నారు. డబ్బుంటే ప్రపంచంలో ఎవ్వరినైనా మేనేజ్ చేయగలం అన్న ధీమాతో పారిపోయి, విజయవంతంగా అదే మేనేజ్మెంటుతో ఇండియాకి తిరిగొచ్చి ఇక్కడే రాజకీయ, సినీ ముసుగులో బతికేస్తున్నారు. వీళ్లు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టరు..అక్కడి తెలుగు సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకున్నా సరే!

ఇదీ అమెరికాలోని తెలుగువాళ్ల ప్రాక్సీ బతుకుల్లోని చీకటి కోణం. ఇండియా నుంచి తమ పిల్లల్ని సరైన అవగాహనతో, న్యాయమైన పద్ధతిలో అమెరికా పంపాలని ఆలోచించే తల్లిదండ్రులు సరే. ఇలాంటి ర్యాకెట్ గురించి తెలియక, తెలిసినా పర్వాలేదులే అని నమ్మించే కొందరి బుట్టలో పడడం వల్ల తమ పిల్లలను టేలెంటు లేకపోయినా అమెరికాకి తోలేయడానికి ఉవ్విళ్లూరుతున్నవాళ్లున్నారు. పిల్లల ప్రయోజకత్వాన్ని సంస్కారవంతమైన, న్యాయమైన జీవితం గడపడం ద్వారా లెక్క వేస్తారా లేక కేవలం ఎన్నో కొన్ని డాలర్లు సంపాదిస్తూ అమెరికాలో స్థిరపడిపోవడంతో కొలుస్తారా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. రెండో మార్గమైనా పర్వాలేదనుకుంటే దొరికిపోతే ఎదురోవాల్సిన అవమానాలు, చట్టాల్ని కూడా పర్వాలేదనుకోగలగాలి. 

రానున్న 2024లో రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ర్యాకెట్ మీద కచ్చితంగా ఉక్కుపాదం మోపబడుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే తమ పౌరుల అవకాశాలకి విఘాతం కలిగించే ఏ విధానాన్ని ఆ పార్టీ ఉపేక్షించదు. తస్మాత్ జాగ్రత్త! 

 

 

Link to comment
Share on other sites

 విజయవంతంగా అదే మేనేజ్మెంటుతో ఇండియాకి తిరిగొచ్చి ఇక్కడే రాజకీయ, సినీ ముసుగులో బతికేస్తున్నారు 

Link to comment
Share on other sites

ee article rasinodiki... USA and EUROPE emi chesayo telidhu okapudu.... 

money kosam chese danda..... gurinchi emi telidhu... 

illeterates unnantha kalam.... edo edo rastharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...