Jump to content

Ycp dogs unleashed.. nothing related to development again


psycopk

Recommended Posts

Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండింది.. శేషజీవితంలో కర్మఫలం అనుభవించాల్సిందే: మంత్రి అమర్నాథ్ 

01-09-2023 Fri 18:30 | Andhra
  • అవినీతికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా
  • అవినీతి కేసు నుండి తప్పించుకునేందుకే ఢిల్లీ పర్యటన అని విమర్శ
  • హెరిటేజ్ వ్యాపారంతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారా? అని ప్రశ్న
  • హిందూస్థాన్ టైమ్స్ పత్రికపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్
  • ఈ పత్రికపై కూడా లోకేశ్ కేసు వేస్తారా? చెప్పాలని నిలదీత
 
Minister Gudiwada Amarnath on Chandrababu it notices

ఐటీ శాఖ తనకు జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అవినీతికి ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా చేశారు. తన శేష జీవితంలో టీడీపీ అధినేత కర్మఫలం అనుభవించక తప్పదన్నారు. అవినీతి కేసుల నుండి బయటపడేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా ఆయన కూర్చున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాపం పండిందన్నారు. హెరిటేజ్ వ్యాపారంతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారా? అని ప్రశ్నించారు.

హిందూస్థాన్ టైమ్స్ కథనంతో చంద్రబాబు అవినీతి బహిర్గతమైందన్నారు. చంద్రబాబు ఏ విధంగా అక్రమమార్గంలో డబ్బులు సంపాదించారనే అంశంపై కథనం ప్రచురించారని తెలిపారు. తనకు అవినీతి అంటేనే తెలియదని చెప్పే చంద్రబాబు ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణల మీద ఎందుకు నోరు మెదపడం లేదని, ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. అవినీతిలో ప్రమేయం ఉంది కాబట్టే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. రెండెకరాల నుండి రూ.1 లక్ష కోట్లకు ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు పిండింది ఆవు పాలో.. గేదె పాలో కాదని, రాష్ట్ర ఖజానాను అన్నారు.

ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత తన ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బాబు అవినీతి గురించి ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఖజనాను నిలువునా దోచేశారని ఆరోపించారు. తన తల్లిని ఎవరూ తిట్టకపోయినా కేసులు పెట్టిన లోకేశ్ ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చేస్తూ కథనం రాసిన పత్రికపై కూడా కేసులు వేస్తారా? అని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Ambati Rambabu: చంద్రబాబుకు ఐటీ నోటీసుల వార్తలపై అంబటి రాంబాబు చురకలు 

01-09-2023 Fri 17:32 | Andhra
  • చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ మీడియాలో వార్తలు
  • సోషల్ మీడియా వేదికగా మంత్రి అంబటి స్పందన
  • రా.. కదలి రా! ఐటీ పిలుస్తోంది అంటూ ట్వీట్
 
Ambati Rambabu tweet on IT notices to Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు రావడంపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా 'ఐటీ పిలుస్తోంది రా' అంటూ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. 'రా ...కదలి రా ! ఐటీ పిలుస్తుంది  !! @ncbn' అంటూ ట్వీట్ చేశారు. 

చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు పంపిందంటూ ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీల నుంచి చంద్ర‌బాబుకు దాదాపు 118 కోట్ల మొత్తం ముడుపుల రూపంలో అందినట్లుగా ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చ‌ట్టం ప్ర‌కారం ఆ సొమ్ము అప్ర‌క‌టిత ఆదాయంగా పేర్కొంది. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ ప్రాథమిక ఆధారాలు సేకరించిందని మీడియా సమాచారం.

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులు అంటూ జాతీయ మీడియాలో కథనాలు... విజయసాయిరెడ్డి స్పందన 

01-09-2023 Fri 17:08 | Andhra
  • చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఆరోపణలు
  • చంద్రబాబు ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన ఐటీ శాఖ
  • సెంట్రల్ సర్కిల్లో కేసు
  • 153సీ సెక్షన్ కింద నోటీసులు
 
Vijayasai Reddy reacts on IT notice to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది! పలు మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు ప్రాథమిక అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్టు తెలుస్తోంది. 

ఐటీ శాఖ సెంట్రల్ సర్కిల్ లో కేసు నమోదైందని, 153సీ సెక్షన్ కింద నోటీసులు పంపినట్టు ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్నారు. కొన్ని బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఈ లెక్కాపత్రం లేని నగదు చంద్రబాబుకు ముట్టినట్టు ఐటీ శాఖ చెబుతోంది. ఇది అప్రకటిత ఆదాయంగా ఐటీ శాఖ అభివర్ణించింది. 

ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలన్నా కుదర్లేదని వెల్లడించారు. అడ్డంగా బుక్కైనా సరే బుకాయించడం బాబు గారి నైజం అని విజయసాయి విమర్శించారు. 

Link to comment
Share on other sites

Perni Nani: హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా?: చంద్రబాబు సహా ఆ ముగ్గురికి పేర్ని నాని సవాల్ 

01-09-2023 Fri 16:21 | Andhra
  • తాత్కాలిక రాజధాని పేరుతో ముడుపులు కొట్టేశారని ఆరోపణ
  • ఐటీ నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని నిలదీత
  • హిందుస్థాన్ టైమ్స్‌లో పెద్ద వార్త వస్తే ఆ ముగ్గురు ఎందుకు రాయలేదని ప్రశ్న
  • లోకేశ్ పాదయాత్ర ఆపేసి, తన తండ్రి అవినీతి వార్తపై స్పందించాలని సవాల్
 
Perni Nani challanges Chandrababu Naidu

తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ముడుపులు కొట్టేశారని, ఆయన గుట్టును ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ బయటపెట్టిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ మేరకు హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో వార్త వచ్చిందన్నారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశాడో బయటపడిందన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో కాంట్రాక్టులు కట్టబెట్టి కంపెనీల నుండి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఈ ముడుపుల వ్యవహారం నడిపారన్నారు. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్ల ముడుపులు అందాయన్నారు. మనోజ్ పార్థాని ముడుపులు ఇచ్చినట్లుగా తేలిందన్నారు.

హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా? చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూస్థాన్ టైమ్స్ తప్పుడు వార్తలు రాసిందా? లేక చంద్రబాబు అమాయకులా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజం కాదా? ఇందులో ముడుపులు తిన్నారా? లేదా? ఇన్‌కం ట్యాక్స్ సెప్టెంబర్ 22న నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు పెదవి విప్పలేదు? హిందుస్థాన్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అమరావతిలోనే ఇంత తీసుకుంటే మిగతా పనుల్లో ఎంత తీసుకున్నారో? అని అనుమానం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు కట్టబెట్టి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

ఆ ముగ్గురు ఎందుకు రాయలేదు?

జగన్-మోదీ, జగన్-భారతి, జగన్-విజయలక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నారో రాయగలిగే సత్తా కలిగిన ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు ఈ వార్తను ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడో ఏడాది క్రితం నోటీసులు ఇస్తే ఎవరికీ తెలియకుండా ఉందన్నారు. కనీసం హిందూస్థాన్ టైమ్స్‌లో ఇంత పెద్ద వార్త పడితే టీడీపీ అనుకూల మీడియా ఎందుకు రాయలేదన్నారు. కనీసం... చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇస్తుందా? ఎంత ధైర్యం అని లేదా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెడిపోయిందని అయినా రాయాలి కదా అన్నారు. కానీ ఈ వార్తను వారు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

చంద్రబాబు గారూ! గుర్తు పెట్టుకోండి...

చంద్రబాబు గారూ! మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని ఎన్టీఆర్ ఆత్మ వెంటాడుతుందని నాని హెచ్చరించారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ పైనుండి కక్ష తీసుకునే పనిలో ఉన్నారని, అదే సమయంలో జగన్‌ను ఆశీర్వదిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌కు మీరు వెన్నుపోటు పొడిస్తే మీకు రాజకీయాల్లో కుక్కచావును జగన్ చూపిస్తున్నాడన్నారు. పార్టీ అయినా, వ్యక్తి అయినా.. ఏదైనా చంద్రబాబు తనకు అవసరం ఉంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని, కానీ అవసరం తీరితే మాత్రం చెత్తకుండిలో వేస్తాడని విమర్శించారు. ఎవరినైనా వాడుకొని వదిలేయడంలో టీడీపీ అధినేత దిట్ట అన్నారు.

చంద్రబాబుకు నిజాయతీ ఉంటే మీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ ద్వారా రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి రూ.120 కోట్ల ముడుపులు తీసుకున్నది నిజమా? కాదా? చెప్పాలన్నారు. హిందూస్థాన్ టైమ్స్ రాసిన దాంట్లో నిజం లేదా? వాస్తవం బయటకు రావాలన్నారు. అలాగే ఏబీఎన్, ఈనాడు, టీవీ5లకు తాను సవాల్ విసురుతున్నానని, చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన వార్త రాయాలన్నారు. పద్మశాలి ఆడకూతురుపై పరువు నష్టం దావా వేయడం కాదని, నీ పాదయాత్ర ఆపేసి, నీ తండ్రి అవినీతిపై మాట్లాడాలని లోకేశ్ కు నాని సూచించారు. అలాగే హిందూస్థాన్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేస్తావా? అని సవాల్ చేసారు. ఇన్‌కం ట్యాక్స్ నోటీసులపై కూడా స్టే తెచ్చుకుంటారా? అని ప్రశ్నించగా, విజయమ్మ, లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్లపై చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నాడని, ఇప్పుడు కూడా అలాగే తెచ్చుకుంటాడని ఎద్దేవా చేశారు.  

 

Link to comment
Share on other sites

Vellla cbn guirnchi matladedi

Vijayasai Reddy: సీబీఐ కోర్టుకు వచ్చి, వెళ్లిన విజయసాయిరెడ్డి... ఎందుకంటే..! 

01-09-2023 Fri 12:56 | Andhra
  • విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు అనుమతి
  • గతంలో తన పాస్ పోర్టును కోర్టుకు అప్పగించిన విజయసాయి
  • కోర్టుకు వచ్చి పాస్ పోర్టును తీసుకెళ్లిన వైసీపీ ఎంపీ
 
Vijayasai Reddy takes his passport deposited in CBI Court

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వచ్చారు. సీబీఐ కోర్టుకు గతంలో అప్పగించిన తన పాస్ పోర్టును తీసుకుని వెళ్లారు. నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నిన్న అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన పాస్ పోర్టును తీసుకున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి తెలిపారు. అమెరికా, యూకే, దుబాయ్, జర్మనీ, సింగపూర్ దేశాల్లో పర్యటించేందుకు ఆయనకు కోర్టు అనుమతిని ఇచ్చింది. 

మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ ను కూడా విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూసేందుకు అక్కడకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును జగన్ కోరారు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు వెళ్లేందుకు జగన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తన భార్యతో కలిసి జగన్ లండన్ కు వెళ్లనున్నారు. 

Link to comment
Share on other sites

YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి 

01-09-2023 Fri 14:31 | Andhra
  • సీబీఐ కోర్టుకు రెండోసారి హాజరైన అవినాశ్ రెడ్డి
  • జైల్లో ఉన్న నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు
  • తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా
 
YS Avinash Reddy attends CBI court

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. కేసులో సీబీఐ కోర్టుకు ఆయన రావడం ఇది రెండో సారి. అవినాశ్ ను ఈ కేసులో సీబీఐ ఏ8గా చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు 145 పేజీలతో కూడిన మూడో ఛార్జ్ షీట్ ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. తదుపరి విచారణను కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

ఈ చిన్న దానికే 118 కోట్లు కొట్టేసాడంటే....అమరావతి పేరు చెప్పి ఇంకెంత కొట్టేశాడో! ఇందుకే అనేది అమరావతి లో ఒక్క ఇటుక కూడా పడనియ్యకూడదు అని! భలే దొరికాడు! 

money-telugu.gif

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

abbo.. intakee jail kellindi evaro? CITI_c$y

ఒకడు ఢిల్లీ లో వంగలేదు...అందుకే వెళ్ళాడు! ఇంకోడు ఢిల్లీ లో యాభై సంవత్సరాలుగా ఒంగుంటున్నాడు...అందుకే వెళ్ళలేదు! 

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు పాపాలు ఒక్కటొక్కటి బయటకొస్తున్నాయి: మంత్రి కొట్టు సత్యనారాయణ 

01-09-2023 Fri 19:38 | Andhra
  • చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ వేలకోట్లు దోచుకున్నారని ఆరోపణ
  • అవినీతి చేసి వ్యవస్థలను మేనేజ్ చేశాడన్న కొట్టు
  • ఇరుక్కుంటానని తెలిసి ఢిల్లీలో కాళ్లబేరానికి వెళ్లాడని విమర్శ
 
Minister Kottu Satyanarayana on IT notices to Chandrababu

చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేతకు ఆదాయపుపన్ను శాఖ నోటీసుల నేపథ్యంలో కొట్టు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు దగ్గర దొరికించి చాలా తక్కువ అన్నారు. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇసుక.. ఇలా అన్నింటా దోచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మేనేజ్ చేయడంలో నిపుణుడు కాబట్టి అవినీతికి పాల్పడిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీకి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు కేవలం శాంపిల్ అన్నారు.

టిడ్కో ఇళ్ల పేరుతో పేదల నుండి ఒక్కొక్కరి దగ్గరి నుండి రూ.3 లక్షలు దోచుకున్నాడన్నారు. డబ్బులు రాని ఆరోగ్యశ్రీ, 108 వంటి వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలియడం వల్లే నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్లబేరానికి వెల్లాడన్నారు.

Link to comment
Share on other sites

34 minutes ago, Telugodura456 said:

Corruption money aithe why only IT department notices. Is IT department the one to decide what is corruption money ?

Lol….itluntadayya pulka galla dhamak. 
 

118 crs edikelli vachinayi ani adugutunaru IT Dept vallu…2 acres batch, does not own any properties neither have any shares…118 CRs blck to white chesukunadu donga lekkala tho

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...