Jump to content

SAI Uncle On CBN Arrest


Anta Assamey

Recommended Posts

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ వార్తను మీడియా ద్వారానే తెలుసుకున్న గవర్నర్ 

09-09-2023 Sat 18:07 | Andhra
  • కనీస సమాచారం లేకపోవడంపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం 
  • అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటున్న నిపుణులు 
  • 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి అనుమతి తీసుకోని వైనం
 
AP governor response on Chandrababu Naidu arrest

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి గవర్నర్ కార్యాలయాన్ని సీఐడీ అధికారులు సంప్రదించలేదని తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం-2018 సవరణల ప్రకారం ప్రజాప్రతినిధులు, అంతకుముందు మంత్రులుగా పని చేసినవారు నిర్వహించిన శాఖల్లో అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వస్తే వాటిని క్రోడీకరించి గవర్నర్‌కు నివేదికను సమర్పించాలని, ఆ తర్వాత గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని విచారణ చేపట్టాలని న్యాయ నిపుణులు అంటున్నారు. 

అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ(సీ) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ కూడా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే అరెస్టు గురించి తెలుసుకున్నారని తెలుస్తోంది. దీంతో మాజీ సీఎం అరెస్ట్‌పై ఆయన విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమన్న సీబీఐ మాజీ డైరెక్టర్.. ఆయన ఏం చెప్పారంటే..! 

09-09-2023 Sat 15:58 | Andhra
  • అవినీతి నిరోధక చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న ఎం.నాగేశ్వరరావు
  • గవర్నర్ అనుమతి లేకపోతే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవచ్చని వివరణ
  • చంద్రబాబు అరెస్ట్ లో చెడు ఉద్దేశాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్య
 
CBI Ex Director on Chandrababu Arrest

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ అరెస్ట్ పై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అని చెప్పారు. గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, గవర్నర్ అనుమతిని ఇవ్వకపోయినా దర్యాప్తు చెల్లుబాటు కాదని తెలిపారు. 

సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఏం చెప్పారంటే?

సీఐడీ అరెస్ట్ మెమో ప్రకారం చంద్రబాబును ఈ ఉదయం అరెస్ట్ చేశారు. 120బీ, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం 1988లోని 12, 13(2) రెడ్ విత్ 13(1)(C), (D) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోని ఫ్యాక్ట్స్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అవి నా దగ్గర లేవు. అందువల్ల ఈ కేసు చట్టబద్ధత, అరెస్ట్ గురించి మాత్రమే మాట్లాడతాను. 

అవినీతి నిరోధక చట్టం 1998కి పార్లమెంటు చాలా మార్పులు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్ మెంట్ యాక్ట్ 2018లో కొత్తగా 17ఏ సెక్షన్ ను చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఒక పబ్లిక్ సర్వెంట్ పై ఆరోపించబడిన ఏ నేరంపై అయినా ఏ పోలీసుల అధికారి విచారణ లేదా దర్యాప్తు చేయకూడదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అరెస్ట్ మెమోలో పేర్కొన్నవి... ఏపీ సీఎంగా తన అధికారిక విధులు లేదా విధులను నిర్వర్తించడంలో నిర్ణయాలకు సంబంధించినవి. 

17ఏ చట్టం ప్రకారం సీఎంలు, మంత్రులపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతిని తీసుకోవాలి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న కాపీని దర్యాప్తు అధికారి అందించాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతిని తీసుకోని పక్షంలో విచారించడం కుదరదు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసినట్టయితే అది చట్ట విరుద్ధమవుతుంది. అంతేకాదు, అరెస్ట్ చేసిన పోలీసు అధికారులపై ఐపీసీ 342, 166 సెక్షన్లతో పాటు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చు. 

సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం విచారణ అధికారి ముందు హాజరు కాకుండా, దర్యాప్తుకు సహకరించడానికి నిరాకరించిన సందర్భాల్లో మినహా పబ్లిక్ సర్వెంట్ లను అరెస్ట్ చేయకూడదు. విచారణకు హాజరు కావాలంటూ తొలుత నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. వారు విచారణకు హాజరు కాకపోతే నిందితుల సహాయ నిరాకరణ వివరాలను నమోదు చేసి, ప్రత్యేక కోర్టును ఆశ్రయించి, అరెస్ట్ వారెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కోర్టు నుంచి ఎలాంటి అరెస్ట్ వారెంట్ ను విచారణ అధికారి పొందలేదు. 

అంతేకాదు, రెండేళ్ల క్రితం 2021లో క్రిమినల్ కేసు నమోదు కాగా... సీఐడీ ప్రాథమిక విచారణను చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రిని అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది? చంద్రబాబు మాజీ సీఎం మాత్రమే కాదు, జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న వ్యక్తి. ఆయన ఎక్కడికీ పారిపోరు. పబ్లిక్ పర్సన్ కావడంతో అందుబాటులోనే ఉంటారు. ఈరోజు, రేపు కోర్టు సెలవులు కావడంతో చంద్రబాబు బెయిల్ పొందలేరు. ఆయన పోలీస్ కస్టడీకీ లేదా జైలుకు రిమాండ్ చేయబడతారు. ఈ కారణాల వల్ల చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే విషయమే కాదు, అరెస్ట్ చేయడంలోని చెడు ఉద్దేశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

కోర్టు అనుమతి లేకుండా పబ్లిక్ సర్వెంట్ ను అరెస్ట్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. అధికారాలను సరిగా వినియోగించకపోతే అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. తాను చెప్పిన అంశాలను చంద్రబాబు తరపు లాయర్లు దృష్టిలో ఉంచుకుని, కోర్టుకు వాటిని సమర్పించాలి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...