Jump to content

తాను పదే పదే చెప్పుకున్నట్లు నిజంగానే నిప్పు అని నిరూపించుకునే అవకాశం తెలిసో తెలియకో ఈ ప్రభుత్వం కల్పించింది.


JackSeal

Recommended Posts

వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ద్వారా, చట్టంలో లొసుగుల ద్వారా, స్టేలు తెచ్చుకొని బయటకు వస్తారు కానీ, ఏ కేసులో కూడా నిజాయితీగా సహకరించి బయటపడరు అని ప్రజల్లో ఉన్న అభిప్రాయం తప్పు అని నిరూపించుకోవటానికి జీవిత చరమాంకంలో ఇది ఒక అద్భుతమైన ఛాన్స్. మాజీ ముఖ్యమంత్రిగారు అతను అవినీతిపరుడు కాదు అని కోర్టు తీర్పు కాపీతో మరల ప్రజల ముందుకు వచ్చి ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతారని ఆశిస్తున్నాను.

నిజం నిరూపణ అయ్యేవరకు ఒక వ్యక్తి నిందితుడే కానీ నేరస్తుడు కాదు. నేరస్తుడు అని, బెయిల్ రాదని, ఇంత కాలం శిక్ష అని మీరే తీర్పులు ఇవ్వకండి. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసులో తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా కేసు నిష్పాక్షకంగా, పారదర్శకంగా వ్యవస్థల మీద నమ్మకం కలిగేలా వ్యవహరించాలి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...