Jump to content

Fruit Salad with hot water


baku_keku

Recommended Posts

Chandrababu : చంద్రబాబుకు అల్పాహారంగా నేడు ఇంటి నుంచి ఏం వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2023-09-11T09:58:03+05:30 IST

 

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది నేడు ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లిన సిబ్బంది.

Link to comment
Share on other sites

73 ఏళ్ల వయసులోనూ చలించని చంద్రబాబు

రెండు రోజులపాటు నిద్ర కరువు

నంద్యాల నుంచి 320 కిలోమీటర్ల ప్రయాణం

‘సిట్‌’ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ

ఆ తర్వాత మళ్లీ రాజమండ్రికి తరలింపు

అయినా స్థిర చిత్తంతోనే చంద్రబాబు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

 

73 ఏళ్ల వయసు... రోడ్డు మార్గంలో 320 కిలోమీటర్ల ప్రయాణం... సుమారు 48 గంటలపాటు కునుకు లేదు! అయినా సరే... అదే నిబ్బరం, అదే గాంభీర్యం! అలసట అన్నది కనిపించనే లేదు. అదీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు స్థిర చిత్తం! 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, సుధీర్ఘకాలం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలున్నా... ప్రతిసారీ అప్పటికప్పుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు జగన్‌ సర్కారు ఆయనను ‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు’లో అరెస్టు చేసింది. శుక్రవారం నంద్యాలలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ రోజు రాత్రి 10.30 గంటల నుంచే పోలీసుల నుంచి ‘చంద్రబాబు అరెస్టు’పై సంకేతాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి దాటాక ఆయన బస చేసిన ఫంక్షన్‌ హాలు వద్ద పోలీసుల హడావుడి మొదలైంది. తెల్లవారకముందే ఆయన నిద్రిస్తున్న బస్సు తలుపు తట్టి నిద్రలేపారు. వెరసి... ఆ రోజు రాత్రంత ఆయన కంటిమీద కునుకు లేదు. శనివారం ఉదయం 6.15 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారు. 320 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. దారి పొడవునా అనేక చోట్ల టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో... ఆయన వారికి సర్దిచెబుతూ వచ్చారు. శనివారం రాత్రి మొత్తం తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో చంద్రబాబును విచారణ పేరిట కూర్చోబెట్టారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెరసి... ఆయన పూర్తిగా రెండు రాత్రులు నిద్రపోలేదు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆయనకు విశ్రాంతి లేదు. వాస్తవానికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు వెళ్లాలని సీఐడీ పోలీసులు చంద్రబాబును వేకువజామున 2.30 గంటలకు చెప్పారు. వైద్య పరీక్షలు చేయించి తిరిగి సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇంత మాత్రానికి తెల్లవారుజామునే తీసుకెళ్లడం ఎందుకు.. తెల్లవారిన తర్వాతే వెళ్తే పోయేది కదా అని చంద్రబాబు ప్రశ్నించగా.. పోలీసు అధికారులు సమాధానం చెప్పలేదు.

 

ఆరోగ్యంగానే ఉన్నా...

చంద్రబాబుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 నిమిషాలపాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యపరంగా భేషుగ్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ సమయంలో కూడా డాక్టర్లు, వైద్యసిబ్బంది చంద్రబాబుతో సెల్ఫీ లు దిగారు. అరెస్టు అయ్యాననే ఆందోళన ఏమాత్రం కనిపించకుండా ఆయన వారితో ఫొటోలు దిగారు. డాక్టర్లు కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని కోరినా... మరేం ఫర్వాలేదు, నేను బాగున్నాను అని చంద్రబాబు బదులిచ్చారు.

 

కోర్టులో వాదనలు...

నిద్రలేని రాత్రులు, సుదీర్ఘ ప్రయాణం, సిట్‌ కార్యాలయంలో విచారణ, ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆదివారం ఉదయం 5.55 గంటలకు చంద్రబాబును విజయవాడలోని సిటీ కోర్టుల సముదాయానికి తీసుకొచ్చారు. ‘మీరు చెప్పాల్సిందేమైనా ఉందా?’ అని జడ్జి హిమబిందు అడిగినప్పుడు ఆయన అడ్వొకేట్‌గా మారి, కేసుకు సంబంధించి తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ సిద్ధార్థ లూద్రా వాదనల సమయంలో మీరు ఇక్కడే ఉంటారా? వేరే రూంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారా? అని అడిగినప్పుడు అక్కడే ఉంటానని చంద్రబాబు బదులిచ్చారు. వాదనల ఆద్యంతం కోర్టు హాల్లోనే కూర్చొని ఉన్నారు. తీర్పు కోసం వాయిదా వేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నారు.

 

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి

శనివారం రాత్రి సిట్‌ కార్యాలయంలో చంద్రబాబును భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితరులు కలిశారు. రాష్ట్రం బాగుపడాలని రాత్రింబవళ్లూ చాకిరీ చేస్తే ఏమిటీ పరిస్థితి అని కుటుంబ సభ్యులు వాపోయారు. రాజకీయాల్లో ఇటువంటివి వస్తూనే ఉంటాయని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. ఇక... ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ నేతలతోపాటు కుటుంబ సభ్యులు కూడా కోర్టు నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ తదితరులు కోర్టు ప్రాంగణానికి వచ్చి చంద్రబాబును కలిశారు. వారు ఆవేదన చెందుతుండగా ఆయన ధైర్యం చెప్పారు.

Link to comment
Share on other sites

3 minutes ago, baku_keku said:

Chandrababu : చంద్రబాబుకు అల్పాహారంగా నేడు ఇంటి నుంచి ఏం వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2023-09-11T09:58:03+05:30 IST

 

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది నేడు ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లిన సిబ్బంది.

Menu confirmed in all Dallas pulka hotels ani @TOM_BHAYYA cheppamannad

Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

Hot water..!!!! Hmm….eedini lopala esi 10gina ave natakalu ave raathalu…boothu kitti gadi paper ae na ie vaartha rasindi ?

 

inkevaru rastaru.. kiitigade..

 

next toiler to entha sepu kurchunnadu.. shape and colour kuda rasthadu kavochu

Link to comment
Share on other sites

16 minutes ago, Android_Halwa said:

Hot water..!!!! Hmm….eedini lopala esi 10gina ave natakalu ave raathalu…boothu kitti gadi paper ae na ie vaartha rasindi ?

 

Hot water will help with constipation from old age and this stress

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...