Jump to content

Chandrababu: చంద్రబాబు 'హౌస్ రిమాండ్' పిటిషన్ విచారణ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు


psycopk

Recommended Posts

Chandrababu: చంద్రబాబు 'హౌస్ రిమాండ్' పిటిషన్ విచారణ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు 

11-09-2023 Mon 15:45 | Andhra
  • 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్న న్యాయవాదులు
  • 409 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం
  • పిటిషన్ తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం  
 
Chandrababu lawyers will file bail petition

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి హౌస్ ‌రిమాండ్ విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హౌస్ రిమాండ్ ‌పై విచారణ అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరో రెండు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు పిటిషన్లను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విచారణ తర్వాత 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్, 409 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని మరో పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి కేంద్రకారాగారానికి తరలించారు. అయితే, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను సీఐడీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేస్తే చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు

  • Haha 1
Link to comment
Share on other sites

Sidharth Luthra: జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: సిద్ధార్థ లూథ్రా 

11-09-2023 Mon 11:58 | Andhra
  • ఏసీబీ కోర్టుకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
  • జైల్లో చంద్రబాబును ఉంచడం ప్రమాదకరమని వ్యాఖ్య
  • పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తామన్న సీనియర్ న్యాయవాది  
 
Chandrababu has life threat in Jail says advocate Sidharth Luthra

టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా కాసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన చెప్పారు. జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు.... హౌస్ రిమాండ్ అవసరంలేదు: ఏపీ సీఐడీ 

11-09-2023 Mon 15:23 | Andhra
  • చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
  • హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు
  • కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
  • సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ అనేదే లేదని స్పష్టీకరణ
 
AP CID files counter on Chandrababu house arrest petition

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆయన న్యాయవాదులు నిన్న హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు హౌస్ రిమాండ్ అవసరంలేదని స్పష్టం చేసింది. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని వెల్లడించింది.

పైగా, సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొంది. బెయిల్ లభించని కారణంగానే హౌస్ రిమాండ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఏపీ సీఐడీ తన కౌంటర్ లో ఆరోపించింది. 

అటు, ఏపీ సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణను ఈ మధ్యాహ్నం తర్వాత కొనసాగించనున్నారు. ఏపీ సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా 

11-09-2023 Mon 19:27 | Andhra
  • ఇరువైపుల వాదనలను మూడు విడతలుగా విన్న ఏసీబీ న్యాయస్థానం
  • సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు
 
Chandrababu Naidu house remand petition judgement tomorrow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నేడు మూడు విడతలుగా న్యాయస్థానం వాదనలు విన్నది. ఇరువైపుల న్యాయయవాదులు తమతమ వాదనలను బలంగా వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్‌కు ముందు, లంచ్ బ్రేక్ అనంతరం గం.4.30 తర్వాత, తిరిగి సాయంత్రం ఆరు తర్వాత... మూడు విడతలుగా వాదనలు జరిగాయి.

చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని, హౌస్ రిమాండ్‌లో ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, జైల్లో కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీని కల్పించామంటూ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అత్యవసరమైతే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

మరోవైపు, చంద్రబాబుకు జైల్లో ప్రమాదం ఉందని, ఆయనకు ఇప్పటి వరకు ఎన్ఎస్జీ భద్రత ఉందని, కానీ ఇప్పుడు జైల్లో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

ఇరువైపుల వాదనలు విన్న అనంతరం రాజమండ్రి కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కోరారు. సాయంత్రం ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేసి, ఆ తర్వాత తీర్పు ఇస్తామని తెలిపింది. మరోవైపు, ఇరువర్గాల న్యాయవాదులను రేపు కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...