Jump to content

Nara Lokesh: జగన్ భారీ మూల్యం చెల్లించబోతున్నారు: నారా లోకేశ్


psycopk

Recommended Posts

 

 
full pressmeet

 

 

 

https://www.instagram.com/reel/CxDno3Pvtnd/?igshid=MzRlODBiNWFlZA==  
 

Nara Lokesh: జగన్ భారీ మూల్యం చెల్లించబోతున్నారు: నారా లోకేశ్

11-09-2023 Mon 19:02 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్... 14 రోజుల రిమాండ్
  • ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత
  • రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన లోకేశ్
  • చంద్రబాబు జోలికి వచ్చి జగన్ అతి పెద్ద తప్పు చేశాడని వ్యాఖ్యలు
  • చంద్రబాబు జైలుకెళితే మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం
  • ఎంత కక్ష సాధింపుతో కేసు పెట్టారో అర్థమవుతోందని వెల్లడి
 
Nara Lokesh warns CM Jagan

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాముకు తలలోనే విషం ఉంటుందని, జగన్ కు వళ్లంతా విషమేనని అన్నారు. 

చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నారు. జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని హెచ్చరించారు. జగన్ ను డైరెక్ట్ గా అడుతున్నా... నీ చరిత్ర ఏంటి? జగన్ నీపై ఎన్ని కేసులున్నాయి? వాటి వివరాలను మాలాగా పబ్లిగ్గా  చెప్పగలవా? అంటూ సవాల్ విసిరారు. 

జగన్ పై 38 కేసులున్నాయి... వాటిలో 10 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయి... జగన్ పై కేసులు పదేళ్లుగా ట్రయల్ కూడా రావడంలేదు... జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది అని విమర్శించారు. 

మా కంపెనీకి డబ్బు వచ్చిందంటున్నారు... ఎలా వచ్చిందో చెప్పలేకపోయారు... మా కంపెనీ వ్యవహారాలన్నీ పారదర్శకమే. మా కుటుంబ సభ్యులమే డైరెక్టర్లుగా ఉన్నాం. మా ఆస్తులు, వాటాలు, షేర్ల వివరాలు కూడా బయటపెట్టాం. ఎందుకీ దొంగ కేసులు, కక్ష సాధింపులు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. 

2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, రెండేళ్ల తర్వాత, అది కూడా 36 మంది తర్వాత 37వ వాడిగా చంద్రబాబు పేరు చేర్చారని లోకేశ్ విమర్శించారు. ఇంతకంటే కక్ష సాధింపు ఉంటుందా? అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు అరెస్ట్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జోహో సంస్థ సీఈవో శ్రీధర్ వెంబు తదితరులు ఖండించారని లోకేశ్ వెల్లడించారు. పింక్ డైమండ్, వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉందని అన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు, ఆయనకు చెందినవారి ఖాతాల్లోకి సొమ్ము వెళ్లిందన్న ఆరోపణలను నిరూపించలేకపోయారని తెలిపారు. 

"చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప మరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. దేశ రాజకీయాల్లో అరుదైన గుర్తింపు ఉన్న నేత చంద్రబాబు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈవోలు కూడా చెబుతారు. ప్రజాసేవ తప్ప అవినీతి అనేది మా రక్తంలోనే లేదు. 

జగన్ కు పాలన అంటే తెలుసా? చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. మేం ఇవాళ ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చి వివరణ ఇస్తున్నాం... నీపై ఉన్న కేసుల గురించి నువ్వు ప్రజలకు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలవా? బాబాయ్ హత్య కేసులో దోషులను కాపాడుతోంది నువ్వు కాదా? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే... కర్నూలులో శాంతిభద్రతల సమస్య ఉందని సీబీఐకి పోలీసులను అడ్డుగా పెట్టింది ఎవరు? 

తనపై ఉన్న అవినీతి బురదను జగన్ ఈ రాష్ట్రంలోని నేతలందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై అవినీతి ముద్ర పడలేదు కానీ, జగన్ సైకోయిజం ఎంత పరాకాష్ఠకు చేరుకుందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనేది ఒక ఫేక్ కేసు. చంద్రబాబు ఫోర్జరీ చేసినట్టు గానీ, చంద్రబాబుకు డబ్బులు వచ్చినట్టు గానీ, చంద్రబాబు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకున్నట్టు గానీ ఈ ప్రభుత్వం రిమాండ్ రిపోర్టులో చూపించలేకపోయింది. 

2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్న సమయంలో ఇదే ప్రాజెక్టును ఆ రాష్ట్రంలోనూ అమలు చేశారు. ఇదే కంపెనీ వాళ్లు అక్కడ ఆ ప్రాజెక్టులోనూ సంతకాలు చేశారు. యువతకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంలోనూ తీసుకువచ్చింది. 

ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి... ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు... ఎందుకు? 

2021 డిసెంబరులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వం 30 మందిని అరెస్ట్ చేసింది. 4 దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించినా, ఈ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఒక్క చార్జిషీటు కూడా దాఖలు చేయలేకపోయింది... దీనర్థం ఒక్కటే... తప్పు జరగలేదు. ఈడీ రిపోర్టులోనూ మనీలాండరింగ్ జరగలేదు అని స్పష్టంగా పేర్కొన్నారు. 

ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుతున్నా... చంద్రబాబుకు డబ్బులు ఎక్కడ వచ్చాయో ఇప్పుడైనా నిరూపించగలరా? పబ్లిక్ స్టేట్ మెంట్లు ఇవ్వడం కాదు... ఆధారాలతో చెప్పగలరా? షెల్ కంపెనీలు అని చెబుతున్నారు కదా... వాటి బినామీల పేర్లు బయటపెట్టగలరా? ఇవాళ ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపించి, మంత్రులు సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలు గమనించాలి. సీఐడీ అనేది రాష్ట్రంలో కక్ష సాధింపు డిపార్ట్ మెంట్ గా మారిపోయింది" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. 

ఇక, ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయం తమకు తెలుసని, కేంద్రం కూడా ఉందో లేదో బీజేపీ మిత్రులనే అడగాలని లోకేశ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

ఇక, ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయం తమకు తెలుసని, కేంద్రం కూడా ఉందో లేదో బీజేపీ మిత్రులనే అడగాలని లోకేశ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

joke idhi 

Link to comment
Share on other sites

Babai case ki elagu dikku ledu..Jaffas need to answer this

ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి... ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు... ఎందుకు? 
 

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Babai case ki elagu dikku ledu..Jaffas need to answer this

ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి... ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు... ఎందుకు? 
 

Vallu research chesinappudu MOU s sign cheyyaledhu.

 

vallu research chesinappudu Siemens and DesignTech picture lo ledhu. 
 

CID and ED clearly knows that. 
 

the original fire alarm was raised by GST tax team from Center. That’s proof enough that this is not Jagans pre planned script. 

Link to comment
Share on other sites

Eedu abn chaala cbn ki vachey sympathy kooda thengabettadaniki.

Motham eedey handle chesi untadu naaku telisi scam ni. Andukey intha easy ga dorikaru.

mari Siemens ki telvakunda Siemens tho MOU endi raa lokesha comedy gaa

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Babai case ki elagu dikku ledu..Jaffas need to answer this

ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి... ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు... ఎందుకు? 
 

Idhi valid question. Govt needs to answer this

Link to comment
Share on other sites

Just now, MrDexter said:

Vallu research chesinappudu MOU s sign cheyyaledhu.

 

vallu research chesinappudu Siemens and DesignTech picture lo ledhu. 
 

CID and ED clearly knows that. 
 

the original fire alarm was raised by GST tax team from Center. That’s proof enough that this is not Jagans pre planned script. 

Aa mukka case lo

perlu vesi enquiry chesi chepali.. nuvvu kadu chepalsindi

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Aa mukka case lo

perlu vesi enquiry chesi chepali.. nuvvu kadu chepalsindi

2 years nundi case inverisgation chesthunnaru 

Endharino probables ga assume chesi investigate chesi case ni mundhuku theesukeltharu 

case final hearing ayyaka RTI act dwara thousands of pages of documents anni release chestharu. 
 

nuvvu adigithe ivvaru 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, MrDexter said:

2 years nundi case inverisgation chesthunnaru 

 

case final hearing ayyaka RTI act dwara thousands of pages of documents anni release chestharu. 
 

nuvvu adigithe ivvaru 

 

 

Ani neke chepi chesaru.. 

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Ani neke chepi chesaru.. 

naku cheppi cheyyadam kadhu facts chadivithe clear ga ardhamavuthundi 

 

design tech ni Siemens fake name tho picture Loki theeuskochindi CBN

 

first PpT presentation nundi involve ayyindi CBN

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Sanjiv said:

Crime chesina vaadni prosecute cheyyadam thappu enduk ayitadi?? Cheyyaka povadam thappu.

there is a due process for everything. No one is above the law

Adhi yellow fever vachinavallaki ardham avvadhu.

 

Thappu cheyyaka pothe babu bangaram laga bayatakosthadu ani endhuku anatledhu.

 

vadi peru ledhu Fir ledu. arrest cheyodhu, bail ivvali, anni madharCh arguments.

Link to comment
Share on other sites

2 minutes ago, Sanjiv said:

Crime chesina vaadni prosecute cheyyadam thappu enduk ayitadi?? Cheyyaka povadam thappu.

there is a due process for everything. No one is above the law

There is a due process.. process follow avaledu ade problem 

  • Haha 1
Link to comment
Share on other sites

బాబు అంటే మోడీ కి అక్కసు ఎందుకంటే ప్రతిపక్షం లో  కీలక పాత్ర పోషించే నాయకుడు కాబట్టి. ఒక అరవై పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపే సత్త ఉన్న పార్టీ కాబట్టి. కొడుకు కూడా రాజకీయాల్లో తండ్రి కి తగ్గ తనయుడు గా రాణిస్తున్నాడు కాబట్టి.

 
కాదు ఆ నాయకుడు చంద్రబాబు కాదు! లాలూ ప్రసాద్ యాదవ్! లాలూ ని జైలు పంపించారంటే ఒక అర్థం ఉంది. అందులో అవినీతి ఉంది. రాజకీయ కుట్ర కోణం ఉంది. 
ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మంచి పట్టు ఉంది కాబట్టి! 
చంద్రబాబు కి ఏముందని కేంద్రం అంత పనికట్టుకుని జైలు కి పంపిస్తుంది? బీహార్ లో రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ ఏ పార్టీ అధికారం లో ఆ పార్టీ కి మద్దత్తు ఇచ్చి రాజకీయ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆ పార్టీ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ మాత్రమే. తెలుగు దేశం కూడా అంతకన్నా పెద్ద గొప్ప పార్టీ ఏం కాదు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు. ఎప్పుడో ఒకటి అరా సందర్భాలలో సమైక్యఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా కాస్త పలుకుబడి ఉండి  ఉండేదేమో కానీ ఇప్పుడు ఈయన విభజించిన ఆంధ్ర ప్రదేశ్ కి ప్రతిపక్ష నాయకుడు అది కూడా ఘోరపరాజయం పాలైన ఒక సాధారణ నాయకుడు. తమిళ నాడు విజయకాంత్ మన చంద్రబాబు ఇద్దరు ఒక్కటే!
దానికి ఎదో అతిగా ఊహించుకుని మోడీ కి బాబు అంటే గిట్టదు అని పిచ్చి ప్రేలాపనలు మాని ఇంకా గతం లో బతకకుండా వర్తమానానికి రావాలి లేకపోతే ఇంకా ప్రజాధారణ నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే వచ్చే ఎన్నికలలో మరో పరాజయం మూట కట్టుకోవటం ఖాయం గా  కనిపిస్తుంది. ఇక ఇంతటి తోటి చంద్ర బాబు రాజకీయ భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోయే సమయం ఆసన్నమైంది! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...