Jump to content

Chandrababu: చంద్రబాబు అరెస్టుపై నేడు కూడా హోరెత్తిన టీడీపీ నిరసనలు


psycopk

Recommended Posts

Chandrababu: చంద్రబాబు అరెస్టుపై నేడు కూడా హోరెత్తిన టీడీపీ నిరసనలు

21-09-2023 Thu 22:40 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • తీవ్రంగా మండిపడుతున్న టీడీపీ నేతలు
  • రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు
  • 9వ రోజు కూడా కొనసాగిన దీక్షలు... పాల్గొన్న టీడీపీ అగ్రనేతలు
Protests continues in state condemns Chandrababu arrest

అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశామని జగన్ రెడ్డి చంకలు గుద్దుకోవడం తప్ప సాధించేది ఏమీ లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు మచ్చలేని చంద్రుడిలా బతికారని, నాలుగేళ్ల పాలనంతా అవినీతిమయమైన జగన్ రెడ్డి... చంద్రబాబుపై అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబుకు రూపాయి కూడా అవినీతిని ఆపాదించలేరని టీడీపీ నేతలు పేర్కొన్నారు. 

 
 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 9వ రోజు ‘‘బాబుతో నేను’’ దీక్షల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. చంద్రబాబును అరెస్టు చేస్తే జగన్ రెడ్డికి జ్వరం పట్టుకుందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. 

రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరులో తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే దీక్షల్లో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు.మహిళలతో కలిసి పేరూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని, సుధారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు తొండవాడ నుండి చంద్రగిరి బైపాస్ వరకు వేలాది మందితో ర్యాలీ చేపట్టారు. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో(బంజార/సుగాలి) రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

కెనడాలోని సెంట్రల్ టొరంటో నగరంలో 500 మంది యువకులు నిరసన తెలిపారు.  కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఉరితాళ్లకు వేలాడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో పీలా గోవింద సత్యన్నారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ జెండాతో మాజీ సైనికులు నిరసన తెలిపారు. బాబుతోనే మేము అంటూ సంఘీభావం తెలిపారు. 

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ  తెలుగు యువత నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడి సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తొస్సిపూడి, మరియు పందలపాక తెలుగుదేశం పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆలూరు నియోజకవర్గం సిరుగుప్ప పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

మాడుగుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్ రాజు ఆధ్వర్యంలో ‘‘బాబుతో నేను’’ కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు పాల్గొన్నారు. ఒంటి కాలుపై నిలబడి సూర్య నమస్కారం చేస్తూ నిరసన తెలిపారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

బాపట్ల నియోజకవర్గం పాండురంగాపురం సముద్రతీరంలో బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి చింతకాయల విజయ్ అధ్వరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి సంఘీభావం తెలిపారు. 

నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎండీ ఫరూక్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, కూన రవి కుమార్. కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, బి. నాగ జగదీశ్వరరావు, జ్యోతుల నవీన్, గన్ని వీరాంజనేయులు, కొనకళ్ల నారాయణరావు, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జి.వి.ఆంజనేయులు, నూకసాని బాలాజీ, బికె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
20230921fr650c78c7707cb.jpg20230921fr650c78e005a7b.jpg20230921fr650c78ee2d9d1.jpg
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ బాపట్లలో బీచ్ ఆర్ట్... ఫొటోలు ఇవిగో!

21-09-2023 Thu 17:49 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసన తెలిపేందుకు కళారూపాన్ని ఎంచుకున్న నరేంద్ర వర్మ
  • బాపట్ల బీచ్ లో చంద్రబాబు సైకత కళాకృతి
  • సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ సాయంతో చంద్రబాబు చిత్రం 
  • కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు
Bapatla TDP Incharge Vegeshna Narendra Varma sculpts beach art of Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడంపై నిరసన తెలిపేందుకు, టీడీపీ బాపట్ల ఇన్చార్జి వేగేశ్న కళారూపాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ బాపట్ల సముద్రతీరంలో వేగేశ్న నరేంద్ర వర్మ బీచ్ ఆర్ట్ వేయించారు. సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ చంద్రబాబు ముఖాకృతిని రూపొందించారు. బాబుతోనే మేం, చంద్రబాబుకు న్యాయం జరగాలి అనే నినాదాలను తన బీచ్ ఆర్ట్ లోపొందుపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు, బాపట్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు.

 
 
20230921fr650c3480711a5.jpg20230921fr650c34aeb4426.jpg20230921fr650c348b02c88.jpg
Link to comment
Share on other sites

Bhuma Akhila Priya: రాజన్న పాలన అని రాక్షస పాలన తెచ్చారు... చావడానికైనా సిద్ధమే కానీ తగ్గేదిలేదు: భూమా అఖిలప్రియ

21-09-2023 Thu 14:27 | Andhra
  • చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే ఆమరణ దీక్షకు కూర్చుంటామన్న అఖిలప్రియ
  • దీక్షకు అనుమతి ఇవ్వకుంటే వారు భయపడినట్లేనని వ్యాఖ్య
  • అక్రమ కేసులు, దీక్షలు తమ కోసం కాదని, ప్రజల కోసమేనన్న అఖిలప్రియ
Bhuma Akhila Priya on her hunger strike in Nandyal

తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాల ప్రాంతంలో తాము ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నామని, దీక్ష కోసమై తాము ఇప్పటికే చలానా కట్టామని, అంతేకాకుండా తాము దీక్ష చేసే ప్రాంతం ప్రయివేటు ప్రాంతమని, అనుమతి కోసం పోలీసులను ఆశ్రయించామని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ... తమకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోందన్నారు. ఈ అంశంలోకి తాను నంద్యాల ఎమ్మెల్యేను కూడా లాగుతున్నానని, తన దీక్షకు అనుమతి ఇవ్వకపోతే మీరు భయపడ్డారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. మహాత్మా గాంధీ వంటి వ్యక్తి స్వాతంత్ర్యం కోసం దీక్ష చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను, జగద్విఖ్యాత రెడ్డి దీక్షకు కూర్చుంటామన్నారు. దీనికి అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు.

 
 

తాము శాంతియుతంగా చేసే దీక్షను అడ్డుకొని, ఇబ్బందులకు గురి చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య మీ పోలీసుల నుంచి వచ్చినట్లుతుందని, కానీ తమ నుంచి కాదన్నారు. మీరు భయపడుతున్నారు కాబట్టి దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తప్పు మీ వైపు ఉంది కాబట్టే తమ దీక్షకు అడ్డు చెబుతున్నారని చెప్పకనే చెబుతున్నారన్నారు. తమను అడ్డుకుంటే ఆ చెడ్డ పేరు మీకేనని, తాము చావడానికైనా సిద్ధమే అన్నారు. 

ఈ దౌర్జన్యపు, అక్రమ కేసులు.. ఇక్కడితే ఆగిపోవాలనే తాము దీక్ష చేస్తున్నామన్నారు. తమకు తప్పకుండా ప్రజల మద్దతు అవసరమన్నారు. ఈ దీక్షలు, అక్రమ కేసులు, ధర్నాలు.. ఇవన్నీ తమ కోసం కాదని, కేసులు వేయించుకోవాలని తమకెవరికీ లేదని, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మహిళల భద్రత కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల కోసమే తాము చేస్తున్నామన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయాలని చంద్రబాబు, లోకేశ్ పిలుపునిచ్చారని, అందుకే తాము బయటకు వస్తున్నామన్నారు.

కొంతమంది బుర్రలేని వ్యక్తులు తనను ఆళ్లగడ్డలో ఆందోళన చేసుకోవాలని చెబుతున్నారని, కానీ ఇది ఆళ్లగడ్డకో, నంద్యాలకో సంబంధించిన అంశం కాదని, ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశమన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేతకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఎంతోమంది బయటకు వస్తున్నారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. ఈ వయస్సులో చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, చన్నీళ్లతో స్నానం చేయించే పరిస్థితి తెప్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇంత శాడిజమా? అని ప్రశ్నించారు. ఆయన వయస్సుకు, ఆయన రాజకీయ అనుభవానికి కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. ఏపీలో కక్ష సాధింపు, రాక్షస పాలన సాగుతోందన్నారు. ఏపీలో రాజన్న పరిపాలన వస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చి రాక్షస పాలన తెచ్చారన్నారు. చంద్రబాబును నంద్యాల నుంచి తీసుకు వెళ్లారు కాబట్టే తాము ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని నిర్ణయించామన్నారు. తాము చావడానికైనా సిద్ధమే కానీ, దీక్షపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. తమకు అనుమతి ఇవ్వకుంటే ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాల్లో దీక్ష చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో కూడా తీవ్ర గందరగోళం.. సభ వాయిదా

21-09-2023 Thu 10:36 | Andhra
  • ఉభయసభల్లో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
  • టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
  • టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
AP Legislative Council adjourned

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ శాసనసభ సమావేశాల్లో దుమారం రేపుతోంది. ఉభయసభల్లోను టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలిలో కూడా ఇదే సీన్ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర 

Link to comment
Share on other sites

AP Assembly Session: బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలందరిపై ఒకరోజు సస్పెన్షన్ వేటు.. సెషన్ మొత్తానికి పయ్యావుల సస్పెన్షన్!

21-09-2023 Thu 12:03 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్ పై అసెంబ్లీలో రచ్చ చేసిన టీడీపీ సభ్యులు
  • కోటంరెడ్డి, అనగాని, పయ్యావులపై సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు
  • టీడీపీ సభ్యుల తీరు క్రిమినల్స్ మాదిరి ఉందన్న బుగ్గన
All TDP MLAs suspended from AP Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నాటి సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కోటంరెడ్డి, అనగాని సత్యప్రసాద్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సభలో వీడియో తీస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ను కూడా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

 
 

మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. దీంతో దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన మాట్లాడుతూ... విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలో అద్దాలు, బాటిల్ పగులగొట్టారని... వారి తీరు క్రిమినల్స్ మాదిరి ఉందని చెప్పారు. ఇలాంటి సభా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బుచ్యయ్యచౌదరి, గద్దె రామ్మోహన్, చినరాజప్ప సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కూడా ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు.
Link to comment
Share on other sites

Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్ ఆందోళనకు గురవుతున్నారు: కోటంరెడ్డి

21-09-2023 Thu 10:56 | Andhra
  • చంద్రబాబు, లోకేశ్, పవన్ కార్యక్రమాలకు విశేషమైన స్పందన వస్తోందన్న కోటంరెడ్డి
  • బలప్రయోగాలతో తమను అడ్డుకోవడం ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్య
  • రెట్టించిన సమరోత్సాహంతో ప్రభుత్వాన్ని ఎండగడతామన్న కోటంరెడ్డి
CM Jagan is worried says Kotamreddy

టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు, యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్ ఆందోళనకు గురవుతున్నారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి పాలన అందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని ఎద్దేవా చేశారు. బలప్రయోగాలతో తమను అడ్డుకోవడం మీ వల్ల కాదని... రెట్టించిన సమరోత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వ అక్రమ కేసులను, వేధింపులను ఎదుర్కొంటామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన పాదయాత్రలో కోటంరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Balakrishna: అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ

21-09-2023 Thu 09:29 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్న బాలయ్య
  • ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగదని వ్యాఖ్య
  • ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారన్న బాలకృష్ణ
Never afraid of arrests says Balakrishna

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తమ అధినేత చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ఈ వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని... దీన్ని చూసి ఓర్చుకోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని, టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.

 
Link to comment
Share on other sites

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. చంద్రబాబు అరెస్ట్ పై అట్టుడుకుతున్న సభ

21-09-2023 Thu 09:18 | Andhra
  • అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ సభ్యులు
  • సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్
  • చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న టీడీపీ సభ్యులు
AP Assembly sessions started

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు టీడీపీ శాసనసభ, శాసనమండలి సభ్యులు పాదయాత్రగా వెళ్లారు. తొలుత వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు నివాళి అర్పించారు. అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి పాదయాత్రలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు. 

 
 
 
మరోవైపు, అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల అరుపులతో సభ అట్టుడుకుతోంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే సభ కొనసాగుతోంది.
Link to comment
Share on other sites

Balakrishna: మందబలంతో విర్రవీగుతున్నారు.. ప్రజలే బుద్ధి చెపుతారు: బాలకృష్ణ

21-09-2023 Thu 14:14 | Andhra
  • రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారన్న బాలకృష్ణ
  • స్కిల్ డెవలప్ మెంట్ లో విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని వ్యాఖ్య
  • జగన్ నియంత మాదిరి పాలిస్తున్నారని మండిపాటు
People will teach them a lesson says Balakrishna

 

 
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసులపై పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. ఇలాంటి కేసులను గతంలో ఎన్నో చూశామని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది యువత శిక్షణ పొందారని, ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. మందబలంతో విర్రవీగుతున్నవారికి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. 
 
 
స్కిల్ డెవలప్ మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు మేలు జరిగితే... అవినీతి జరిగిందని ఎలా చెపుతారని బాలయ్య ప్రశ్నించారు. నియంత మాదిరి జగన్ పాలిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలయ్య పైవ్యాఖ్యలు చేశారు.
Link to comment
Share on other sites

Ayyanna Patrudu: ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారు.. మరో కేసు పెడతారట: అయ్యన్నపాత్రుడు

21-09-2023 Thu 15:15 | Andhra
  • విశాఖలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన అయ్యన్నపాత్రుడు
  • టీడీపీ కోసం ప్రాణాలు వదిలేందుకు సిద్ధమని వ్యాఖ్య
  • విశాఖలో వైసీపీ నాయకులు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపణ
Ayyannapatrudu says he is ready to face cases

తనపై ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారని, మరో కేసు పెడతారంట.. దేనికీ భయపడేది లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ విశాఖలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ కోసం ప్రాణాలు కూడా వదిలేందుకు సిద్ధమన్నారు. వైసీపీ నాయకులు రౌడీలను పెట్టి మరీ విశాఖలో భూములు ఆక్రమించారని, నగరంలో దాదాపు రూ.75వేల కోట్ల ఆస్తులను లాక్కున్నారన్నారు.

 
 

దేశంలో అతి తక్కువ ధరకు ఫైబర్ నెట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. తమ హయాంలో రూ.149కే ఫైబర్ నెట్ ఇస్తే, ఇప్పుడు దానిని రూ.450కి పెంచారన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు మద్యం పైనే ఆధారపడ్డారన్నారు. 9.6 శాతం వడ్డీకి పాతికేళ్లకు తనఖా పెట్టి మద్యం అమ్మకాలపై అప్పు తెచ్చారని ఆరోపించారు. ఈ అప్పును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Nitin Gadkari: చంద్రబాబు గురించి కేశినేని నాని నుంచి ఆరా తీసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

21-09-2023 Thu 16:13 | Andhra
  • పార్లమెంట్ ఆవరణలో గడ్కరీకి ఎదురుపడిన కేశినేని నాని
  • చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపిన టీడీపీ ఎంపీ
  • చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, మచ్చలేని నాయకుడని తనతో అన్నారని వెల్లడి
Nitin Gadkari asks about Chandrababu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఆరా తీశారట. పార్లమెంట్ ఆవరణలో ఎదురుపడిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత గురించి కేంద్రమంత్రి అడిగారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తనతో గడ్కరీ మాట్లాడినట్లుగా చెబుతూ టీడీపీ ఎంపీ తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 
 

ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఎదురుపడి చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆయన ఒక్క గొప్ప నాయకుడని, ఎటువంటి తప్పు చేసే వ్యక్తి కాదని మచ్చలేని ప్రజా సేవకుడని, భగవంతుని ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగించుకొని కడిగిన ముత్యంలాగ బయటపడతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Balakrishna: మందబలంతో విర్రవీగుతున్నారు.. ప్రజలే బుద్ధి చెపుతారు: బాలకృష్ణ

21-09-2023 Thu 14:14 | Andhra
  •  

Eeyana producer nee kalchadam ni emi antaru ? Kalchadam  Telugu jathi atma gouravam kosam ayitey kadhu ga ?

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Nitin Gadkari: చంద్రబాబు గురించి కేశినేని నాని నుంచి ఆరా తీసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

21-09-2023 Thu 16:13 | Andhra
  • పార్లమెంట్ ఆవరణలో గడ్కరీకి ఎదురుపడిన కేశినేని నాని
  • చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపిన టీడీపీ ఎంపీ
  • చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, మచ్చలేని నాయకుడని తనతో అన్నారని వెల్లడి
Nitin Gadkari asks about Chandrababu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఆరా తీశారట. పార్లమెంట్ ఆవరణలో ఎదురుపడిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత గురించి కేంద్రమంత్రి అడిగారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తనతో గడ్కరీ మాట్లాడినట్లుగా చెబుతూ టీడీపీ ఎంపీ తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 
 

ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఎదురుపడి చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆయన ఒక్క గొప్ప నాయకుడని, ఎటువంటి తప్పు చేసే వ్యక్తి కాదని మచ్చలేని ప్రజా సేవకుడని, భగవంతుని ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగించుకొని కడిగిన ముత్యంలాగ బయటపడతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Thatha thaaathaaaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...