Jump to content

Telugudesam: ఏపీవ్యాప్తంగా 12వ రోజు టీడీపీ శ్రేణుల ఆందోళనలు


psycopk

Recommended Posts

Telugudesam: ఏపీవ్యాప్తంగా 12వ రోజు టీడీపీ శ్రేణుల ఆందోళనలు 

24-09-2023 Sun 22:33 | Andhra
  • రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు ఆమరణ దీక్షను అడ్డుకున్న పోలీసులు
  • విశాఖలో ఆర్కే బీచ్ వద్ద భారీ పోలీసు భద్రత
  • చంద్రబాబు విడుదల కావాలని మోకాళ్లపై ద్వారకా తిరుమల మెట్లు ఎక్కిన శ్రీధర్
  • కోవూరులో వీరాంజనేయస్వామి గుడి నుంచి కామాక్షమ్మ దేవాలయం వరకు పాదయాత్ర
  • పెదవాల్తేరు జాలరిపేటలో వందల పడవలతో మత్స్యకారుల నిరసన
 
TDP agitation for 12th day in andhra pradesh

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా  అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా 12వ రోజు ఆందోళనలు కొనసాగించాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. విశాఖ సౌత్ ఇంచార్జి గండి బాబ్జిని బీచ్ వద్దకు వెళ్ళనీయకుండా తన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ బీచ్ వద్ద 300 మంది మహిళా పోలీసుల మోహరించి ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో విశాఖ బీచ్‌ను దిగ్బంధం చేశారు. మరోవైపు నిరసన తెలుపుతున్న రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు ఆర్కే బీచ్‌లో అరెస్ట్ చేశారు.

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ మోకాళ్లపై ద్వారక తిరుమల మెట్లు ఎక్కి, శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మాడుగుల నియోజకవర్గానికి చెందిన కాళ్ళ నరసింగరావు (రాజు) కాశీలోని గంగానదిలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జిల్లా తెలుగదేశం ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జలదీక్షలో పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ  దగ్గర ఉన్న శారదా నదిలో టీడీపీ నాయకులు జలదీక్ష చేపట్టారు. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో చెవులు, నోరు, కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు వీరాంజనేయస్వామి గుడి నుండి కామాక్షమ్మ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పడాల గంగాధర్ రక్తంతో సంతకం చేశారు. విశాఖలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పెదవాల్తేరు జాలరిపేటలో వందల పడవలతో మత్స్యకారులు నిరసన తెలిపి, చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎన్.ఎం.డి ఫరూక్, రెడ్డెప్పగిరి శ్రీనివాసులు రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, కె.ఎస్. జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కాలవ శ్రీనివాసులు, బి.కె. పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, నియోజవర్గాల ఇంచార్జులు, మాజీ మంత్రులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

20230924fr65106af2ce9b5.jpg 
20230924fr65106b95e529b.jpg

20230924fr65106bb78d5f0.jpg

20230924fr65106bdda3dca.jpg

Link to comment
Share on other sites

Motkupally: ఏ పరిస్థితుల్లోనూ చంద్రబాబు తప్పుచేసే వ్యక్తి కాదు: మోత్కుపల్లి 

24-09-2023 Sun 13:06 | Both States
  • మానవత్వంలేని మనిషి అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • భువనేశ్వరి ఉసురు తగులుతుందన్న మోత్కుపల్లి
  • చంద్రబాబును ఇబ్బంది పెడితే నష్టం జగన్ కేనని వెల్లడి
 
At Any Circumstances Chandrababu Will Never Do Wrong Says Motkupally Narsimhulu

ఓ నియంతలా, సైకోలా వ్యవహరిస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమని బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఆయన పెళ్లి రోజే అరెస్టు చేసి రాక్షసానందం పొందారంటూ మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీస మానవత్వం లేదంటూ మండిపడ్డారు. కక్ష సాధింపునకూ ఓ పద్దతి ఉంటుందని, జగన్ లా దుర్మార్గంగా వ్యవహరించిన వారిని తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తప్పు చేయడని పేర్కొన్నారు. ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటంలేదని అన్నారు. అలాంటి నేత అరెస్టు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి నియంత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే నష్టపోయేది జగనేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు కాదు కదా 4 సీట్లు కూడా రావని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. నారా భువనేశ్వరిని కన్నీళ్లు పెట్టించారని, ఆమె ఉసురు జగన్ కు తప్పకుండా తగులుతుందని అన్నారు.

నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు పోవాల్సిందేనని మోత్కుపల్లి చెప్పారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి తాను పొరపాటు చేశానని, దీనికి ఇప్పుడు తల దించుకుంటున్నానని అన్నారు. ఎవర్ని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని చెప్పారు. అయితే, సీఎం పదవి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని జగన్ కు మోత్కుపల్లి హితవు పలికారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా షర్మిలను బయటకు పంపాడంటూ జగన్ పై మండిపడ్డారు. సొంత బాబాయ్‌ ని చంపిన నేరస్థులనే అరెస్టు చేయలేని అసమర్థుడని మోత్కుపల్లి దుయ్యబట్టారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...