Jump to content

"నాకు Depression ఉంది." అని ఎవరైనా చెప్పగానే, ఏ ఒక్కరూ కూడా "అది నాకు అవగాహన లేని విషయం" అని చెప్పరు. 


JackSeal

Recommended Posts

మొక్కలు నాటండి - మంచి సంగీతం వినండి - కుక్క పిల్లతో ఆడుకోండి అని, మంచి ఉద్దేశంతోనే, చాలా సలహాలు ఇస్తారు. 

ఒక ఊబి లోకి జారిపోతున్న మనిషికి ఒక దారం ముక్క ఇచ్చినట్టు ఉంటుంది ఇది. 

Depression గురించి అందరికీ తెలుసు అనుకోవడమే - ఎవ్వరికీ తెలియదు అని చెప్పడానికి నిదర్శనం. 

Depression అంటే negative thinking అని - general గా అందరికీ వచ్చే సమస్యలనే ఒకరు face చేయలేకపోతున్నారనే దురభిప్రాయంలో ఉంటారు. 

వాళ్ళు ఇచ్చే motivation - positivity - meditation techniques - సమస్యని పరిష్కరించకపోగా, ఇంకా ముదిరేటట్టు చేస్తుంది. 

అలా ఎందుకు అవుతుంది అని మీకు ఆశ్చర్యంగా అనిపిస్తే... మీకు depression అంటే ఏమీ తెలియదు అని అర్థంచేసుకోండి. 

ఎవరైనా depression ఉంది అని చెప్తే...ఈ 5 పాటించండి. 

1) Depression అంటే ఒక complex condition అని. మీకు అవగాహన లేని విషయం మీద సలహా ఇస్తున్నారని గ్రహించండి. సలహా ఇచ్చేసి help చేసేయాలి అనే ఆత్రుత చాలా ఉంటుంది. ఆ urge ని control చేసుకోండి. 

2) ఎట్టి పరిస్తుతుల్లో కూడా వాళ్ళ సమస్యని invalidate చేయకూడదు. సమస్యని కొట్టిపారేయడం కానీ - తక్కువ చేయడం అస్సలు చేయకూడదు. మీకు depression అంటే ఏంటో తెలుసు అనుకుని advice ఇవ్వడం కూడా ఒకరకమైన invalidation ఏ. ఎందుకంటే ఆ depressed person కి అర్ధం అవుతుంది - సమస్య ఏంటో మీకు ఏమాత్రం అర్దమవ్వలేదు అని. 

3) 🔴 వాళ్ళ బాధని వినండి. మీరు effort పెట్టాల్సింది ఈ ఒక్క దాని మీదే. ఏ judgement లేకుండా వినండి. అర్థంచేసుకోండి. మీకు ఒక friendly physical intimacy ఉంటె వాళ్ళని hug చేసుకోండి. వాళ్ళ చేతిని మీ చేతిలోకి తీసుకోండి. 

ఎట్టిపరిస్తుతుల్లో ఈ సమయంలో logic మాట్లాడకూడదు. వినడం - అర్థంచేసుకోడం వల్ల వాళ్ళ emotional state కి ఒక relief దొరుకుతుంది. 

4) 🔴 ఖచ్చితంగా ఒక mental health professional దెగ్గరకు తీసుకువెళ్ళండి. ఇంకో మాట లేదు. 

5) మీరు వాళ్ళ కోసం ఉన్నారని తెలియజేయండి. కలవండి. వాళ్ళు slow గా recover అవుతారు. అదొక long term struggle. పూర్తిగా heal అయ్యేవరకు వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి. 

అంతే!

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...