Jump to content

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం


psycopk

Recommended Posts

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం 

29-09-2023 Fri 15:20 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 27న ప్రారంభమైన వాదనలు 
  • సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తోన్న ఏజీ శ్రీరామ్
  • చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు
 
Arguments on chandrababu bail petition in inner ring road case

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. ఈ బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 27న వాదనలు జరగగా, తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు.

రాజధానికి సంబంధించి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని అనుసంధానించే రోడ్ అలైన్మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్ 27న ఫిర్యాదు ఇచ్చారు. దీంతో మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు మొదటి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: స్కిల్ కేసులో నారా లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా 

29-09-2023 Fri 15:16 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ కు స్వల్ప ఊరట
  • అక్టోబర్ 4వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు
  • అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు
 
Nara Lokesh gets bail in Skill development case

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Nara Lokesh: ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు 

29-09-2023 Fri 12:16 | Andhra
  • పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరిన లోకేశ్
  • పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం
  • స్కిల్ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న చంద్రబాబు
 
Nara Lokesh files anticipatory bail petitions in Skill Development and Fernet cases

టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో కూడా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 21 రోజులుగా ఆయన జైల్లో వున్నారు. 

  • Haha 2
Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి 

29-09-2023 Fri 11:57 | Andhra
  • ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి
  • చంద్రబాబు మంచిచెడ్డల గురించి తెలుసుకున్న వైనం
  • రాజమండ్రిలోనే ఉంటున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
 
Nara Bhuvaneswari and Brahmani meets Chandrababu in Rajahmundry Central Jail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. గత 21 రోజులుగా ఆయన జైల్లోనే గడుపుతున్నారు. మరోవైపు చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి వీరిద్దరూ రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన కోసం జైలుకు భోజనం పంపిస్తున్నారు. మరోవైపు తమను కలిసేందుకు వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలకు వెళ్లి వారితో మమేకమవుతున్నారు

  • Haha 2
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా 

29-09-2023 Fri 18:39 | Andhra
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • ఇరువైపుల వాదనల అనంతరం వచ్చే నెలకు వాయిదా వేసిన న్యాయస్థానం
 
Chandrababu bail petition hearings postoponed to october 3

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తొలుత సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా, ఆ తర్వాత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

రెండు రోజుల క్రితం సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా ఢిల్లీ నుంచి వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అక్రమాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. ఆ తర్వాత తదుపరి వాదనలు కొనసాగించే క్రమంలో భాగంగా విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

Lokesh bail petitions oct 4 th ki vaida.. until then no arrest

 

3 hours ago, Anta Assamey said:

Inner ring road case no need of bail .. CID said it will not arrest but will Serve notices

yes first notices 

vcharana ki sahakarnchaka oote cid will go to court to get arrest warrant

vicharana ki velte better

Link to comment
Share on other sites

Just now, Spartan said:

 

yes first notices 

vcharana ki sahakarnchaka oote cid will go to court to get arrest warrant

vicharana ki velte better

Cbn ki kuda ee due process follow avalsindi

  • Haha 2
Link to comment
Share on other sites

35 minutes ago, Spartan said:

they did send notices to CBN also

anduke legal team is not contesting on that line

only baita media lo gola chestunnaru akramanga arrest chesaru ani

remember CBN openly told they are going to arrest me in few days in one of the meetings. appude vellai notices.

behind the scene chala unnai tactics from cbn also

At least from what I see , No, CBN ki notices were not served at all... CID even argued in the Court that in this case they don't need to serve ani...

Insider information is what CBN got about his arrest. But did not get notices, and not needed was the argument of CID in the court itself...33mtnj.gif

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...