Jump to content

Ee mukka 10yr tarwata ra chepedi chekka antuna dalapathi


psycopk

Recommended Posts

Narendra Modi: గిరిజన వర్సిటీ జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే: ప్రధాని మోదీ 

01-10-2023 Sun 17:07 | Telangana
  • మహబూబ్ నగర్ సభలో మోదీ ప్రసంగం
  • వర్సిటీకి భూమి ఇవ్వడానికి ఐదేళ్లు జాప్యం చేశారన్న మోదీ
  • తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని విమర్శలు
  • తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని వ్యంగ్యం
 
Modi take a swipe at Telangana govt

ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ప్రభుత్వం ఆసక్తి చూపించి ఉంటే గిరిజన వర్సిటీ ఎప్పుడో ఏర్పాటయ్యేదని వెల్లడించారు. యూనిర్సిటీకి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేసిందని మోదీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని మోదీ విమర్శించారు. స్టీరింగ్ ఎవరు తిప్పుతున్నారో మీకు తెలుసు కదా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రెండు కుటుంబాలు నడిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కమీషన్, కరప్షన్... ఆ రెండు పార్టీల విధానం అని పేర్కొన్నారు. పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ది ఫ్యామిలీ, ఫర్ ది ఫ్యామిలీ అనేది వాళ్ల నినాదనం అని మోదీ విమర్శించారు.

కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ అభివృద్ధే ముఖ్యమని అన్నారు. అవినీతి అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం వద్దు అని పిలుపునిచ్చారు. 

ఇవాళ తమ సభకు వచ్చిన జనాల ప్రేమాభిమానాలు అద్భుతం అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లకు ఇక నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలకు గురువు ఎంఐఎం అని అభివర్ణించారు.

Link to comment
Share on other sites

Kishan Reddy: ప్రధాని మోదీ కార్యక్రమాలకు ఈ సీఎం ఎందుకు రావడంలేదు?: కిషన్ రెడ్డి 

01-10-2023 Sun 17:21 | Telangana
  • మహబూబ్ నగర్ సభ నుంచి అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
  • సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
  • దేశంలో ఇలాంటి సీఎం ఎక్కడైనా ఉన్నాడా అంటూ విమర్శలు
  • అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యలు
 
Kishan Reddy asks why does CM KCR not attend Prime Minister programs

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు, సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి  పనులకు ప్రారంభోత్సవం చేయగా, ఆ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీనిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

దేశంలో ఎక్కడైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రధాని వస్తే, ఆయన కార్యక్రమాలకు హాజరయ్యేంత తీరిక ఈ సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఓటు బ్యాంకు రాజకీయాలేనా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తే, సీఎం హాజరు కాకపోవడం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Telangana: మోదీజీ మీరు చేసింది సున్నా.. మీ పార్టీకి వచ్చేది పెద్ద సున్నానే: కేటీఆర్ 

01-10-2023 Sun 12:58 | Telangana
  • తెలంగాణలో బీజేపీకి వచ్చేవి సున్నా సీట్లేనన్న కేటీఆర్
  • ప్రధాని మోదీ పాలమూరు పర్యటన నేపథ్యంలో సెటైర్‌
  • పాలమూరుప్రాజెక్టుకు ఏం చేశారని ప్రశ్నించిన మంత్రి
 
BJP will get a big zero by people of Telangana satires KTR

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ పర్యటన ముంగిట తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చేది పెద్ద సున్నానే అని కామెంట్ చేశారు. పాలమూరు గడ్డపై పదేళ్ల కిందట ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ప్రాజెక్టుపై అప్పటి యూపీఏ ప్రభుత్వం తీరును మోదీ ప్రస్తావించిన వీడియోను షేర్ చేశారు.  

‘పీఎం నరేంద్ర మోదీజీ. 2014లో పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల యూపీఏ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మీరు ప్రశ్నించారు. 10 సంవత్సరాలుగా నిద్రపోతున్నారా అని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ, మీ ప్రభుత్వం వచ్చాక చేసిందేంటి?  మహబూబ్‌నగర్‌పై బీజేపీ ఉదాసీనతకు ఇప్పుడు మరో పదేళ్లు గడిచిపోయాయి. ఈ పదేళ్లలో పాలమూరు అభివృద్ధికి మీరేం చేశారో ఈ రోజు అద్దంలో చూపించాలని అనుకుంటున్నా. ఇన్నేళ్లలో మీరు పాలమూరుకు చేసింది శూన్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ బీజేపీ పార్టీకి ఇచ్చే సీట్లు కూడా పెద్ద సున్నానే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

39 minutes ago, Narcos said:

ila abusing chestene tdp situation ila undi ippudu

Puvva… naa views kuda tdp views anukuntunav ante nuvvu enta bewerse oo telustundi.. mee

ka paul chepinatu massage lunchesi bagane manage chesukuntunaru.. state future ni galiki vadilesi..

Link to comment
Share on other sites

  • తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని వ్యంగ్యం

Idi ardam kaledu naaku... evari chetullo undi antunnadu Modi...

Link to comment
Share on other sites

"

  • తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని వ్యంగ్యం"

-->. icheyyiraaa...adani gaadiki icheyyiii AP ni ichinattu..bodi nayalaa

Link to comment
Share on other sites

venky-movie-venky-comedy.gif

Reg. BJP and BRS

kumbhak avvaka pothe bandi ni theesi kishan endhku pettinattu. Kavitha ni inka endhku lopala veyyaledhu? elections varaku hearing endhuku push cheshtunnaru. Bjp assalu BRS ki favaorable decsions endhku thesukuntunnaru?

Endhkante BJP dose penchithe janam Congress ki vote vestharu kabatti.

Andhuke annanu vado goppa vedhanthi vedo peddha sindhanthi ani. iddharu dongale.

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, Anta Assamey said:

 

  • తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని వ్యంగ్యం

Idi ardam kaledu naaku... evari chetullo undi antunnadu Modi...

Mim

Link to comment
Share on other sites

KTR: 'నమో' అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు: మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ 

01-10-2023 Sun 20:23 | Telangana
  • మహబూబ్ నగర్ సభలో బీఆర్ఎస్ సర్కారుపై మోదీ విమర్శలు
  • తెలంగాణ ప్రాజెక్టుల్లో చుక్క నీరు రాదని వ్యాఖ్యలు
  • ప్రాజెక్టులపై మోదీ చెప్పినవన్నీ అబద్ధాలేనన్న కేటీఆర్
  • ఓట్ల కోసం చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టీకరణ 
 
KTR strong reply to PM modi remarks

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మహబూబ్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసని మోదీ వ్యాఖ్యానించగా, బీజేపీ స్టీరింగ్ అదానీ చేతుల్లోకి వెళ్లిపోయిందా? అని కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతుల్లో భద్రంగా ఉందని స్పష్టం చేశారు. 

'నమో' అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీయే జరగలేదని మోదీ అంటున్నారని, అంతకుమించి జోక్ ఇంకేమైనా ఉంటుందా అని వ్యాఖ్యానించారు. ఒక కొత్త రాష్ట్రం రెండు పర్యాయాలు రైతు రుణమాఫీకి చర్యలు తీసుకోవడంతో దేశంలో మరెక్కడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రాజెక్టులపై మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ కొట్టిపారేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై మోదీ చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలని అన్నారు. "తెలంగాణ ప్రాజెక్టుల్లో చుక్క నీరు కూడా రావడంలేదని మోదీ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు ప్రపంచ సాగునీటి చరిత్రలో గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్ నీటిపారుదల రంగానికి మార్గదర్శకాలు. తెలంగాణలో సాగునీటి విప్లవం కొనసాగుతోంది. 

తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరు కూడా మాట్లాడుతున్నారా? ధాన్యాన్ని కొనకపోగా నూకలు తినమన్న కేంద్ర ప్రముఖుల మాటలు తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. పదేళ్లుగా విభజన హామీలపై ఏంచేశారు? ఇప్పుడొచ్చి ఓట్ల కోసం మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా?" అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...