Jump to content

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి కీలక నిర్ణయం.. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న చంద్రబాబు అర్ధాంగి! 


psycopk

Recommended Posts

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి కీలక నిర్ణయం.. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న చంద్రబాబు అర్ధాంగి! 

02-10-2023 Mon 09:05 | Andhra
  • టీడీపీలో శరవేగంగా చోటుచేసుకుంటున్న సరికొత్త పరిణామాలు
  • పార్టీని నడిపించేందుకు సిద్ధమవుతున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
  • ఈ నెల 5 నుంచి కుప్పం నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర
 
Chandrababu wife Nara Buvaneswari to take up Nara Bhuvaneswari

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీలో ఊహించని పరిణామాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. యువనేత లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీని ముందుండి నడిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను బ్రాహ్మణి కొనసాగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు బస్సు యాత్రకు భువనేశ్వరి సిద్ధమవుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. తొలి విడత బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల్లో కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ గాంధీ జయంతి అయిన ఈరోజు భువనేశ్వరి ఒకరోజు నిరాహారదీక్షను చేపట్టనున్నారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: నిజాయతీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారా అని షేక్ అయ్యా: నారా లోకేశ్ 

02-10-2023 Mon 09:48 | Andhra
  • చంద్రబాబు అరెస్టుపై సిగ్గుపడడం లేదు, బాధపడుతున్నామన్న లోకేశ్ 
  • సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టుకుంటూ పోతే ఏ ఒక్కరినీ వదలకుండా అరెస్ట్ చేయొచ్చని వ్యాఖ్య 
  • లండన్‌లో రాహుల్‌గాంధీని జగన్ కలిశారన్న వదంతులపై స్పందించనని కామెంట్ 
  • వైసీపీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టడంలో విఫలమయ్యామని వెల్లడి 
  • ప్రస్తుతానికి తాము జనసేనతోనే ఉన్నామన్న లోకేశ్  
 
Shocked To See Chandrababu In Jail Says Nara Lokesh

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తన తండ్రి చంద్రబాబును చూసిన క్షణంలో తాను షేకయ్యానని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నిజాయతీగా పనిచేసిన ఓ వ్యక్తి ఇక్కడికి వచ్చారా? అని బాధ అనిపించిందని పేర్కొన్నారు. గత రాత్రి ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుండడాన్ని తాను సందేహించబోనని పేర్కొన్నారు. అయితే, న్యాయం ఆలస్యం కావడాన్ని మాత్రం శిక్షగా భావిస్తున్నానని, ఓ పౌరుడిగా ఇది తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆధారాల్లేని కేసులో ఆయనను ఇన్ని రోజులుగా రిమాండ్‌లో ఉంచడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అరెస్టుపై తాము సిగ్గుపడడం లేదని, బాధపడుతున్నామని పేర్కొన్నారు. జగన్‌లా లక్షకోట్లు తిని జైలుకు వెళ్తే బాధ ఉండదని, తిన్నాం కాబట్టి జైలుకు వచ్చామని సర్దిచెప్పుకుంటామన్నారు. చేయని తప్పుకు జైలులో పెడితే ఏ కుమారుడికైనా బాధ ఉంటుందని లోకేశ్ చెప్పుకొచ్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. జగన్ కేసు ఒకటి కాదు
జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఒక్కటి కాదన్న లోకేశ్.. జగన్ కేసులో ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, స్కిల్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి మంత్రిని, ఎంపీని, ఎమ్మెల్యేను కూడా జైళ్లకు పంపొచ్చని లోకేశ్ అన్నారు. ‘పరిశీలించండి’ అని వినతిపత్రం ఇచ్చినా సరే రికమెండేషన్‌గా భావించి జైలుకు పంపొచ్చని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని అన్నారు. తాను మంత్రిగా 2 వేల ఫైళ్లను క్లియర్ చేశానని, ఒక్కో ఫైల్‌కు సగటున 55 నిమిషాలు మాత్రమే పట్టిందని అన్నారు. అంత వేగంగా పనిచేయడం తప్పని, కనీసం 55 రోజులు తీసుకుంటే బాగుండేదోమోనని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. టీసీఎల్ కంపెనీతో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఒక్క లంచ్ మీట్‌లోనే ఓకే చేశామని, ఇలాంటి వాటిని తప్పుపడితే కక్షలకు అంతే లేకుండా పోతుందని అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరిపైనా తాము న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

లండన్‌లో రాహుల్ గాంధీని జగన్ కలిశారన్న వార్తలొచ్చాయి  
చంద్రబాబు అరెస్ట్ వెనక ఫలానా వారి హస్తం ఉందని అందరిలా ఆరోపించే రకం తాను కాదని లోకేశ్ పేర్కొన్నారు. లండన్‌లో రాహుల్‌గాంధీని జగన్ కలిశారన్న వార్తలు వచ్చాయని కానీ, ఇలాంటి ఊహాగానాలపై తాను మాట్లాడబోనని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ లాభపడిందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల ఫలితాలే చెబుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని, సీపీఐ, సీపీఎంతో కలిసి పనిచేయడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అందుకే సైకో పోవాలని అంటున్నారు
కోడికత్తి కేసు, బాబాయ్ హత్య, ఒకే కులం వారికి డీస్పీలుగా పదోన్నతులు వంటి అబద్ధాలను ఢిల్లీ వరకు ప్రచారం చేయడంలో అప్పట్లో వైసీపీ విజయం సాధించిందని, తాము సమర్థంగా వాటిని ఖండించలేకపోయామని లోకేశ్ పేర్కొన్నారు. ఇప్పుడవి అబద్ధాలని తెలియడంతోనే ప్రజలు సైకో పోవాలని అనుకుంటున్నారని అన్నారు. జగన్ తప్ప ఆ పార్టీలోని వారందరూ చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మీడియా బాధితురాలిగా మారిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: ఒక పని చేయండి... రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి: నారా లోకేశ్ 

02-10-2023 Mon 10:26 | Andhra
  • మోత మోగిద్దాం కార్యక్రమంలో విజిల్స్ వేసిన 60 మందిపై కేసులు పెట్టారని లోకేశ్ మండిపాటు
  • సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కేసులు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా
  • ఆదేశాలు ఇచ్చినోడికి సరే.. అమలు చేసినోడి బుద్ధి ఏమయిందని మండిపాటు
 
Nara Lokesh anger on filing cases against 60 people who participated Motha Mogiddham programme

టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి ఆ పార్టీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టాని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీరి తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 'ఒక పని చేయండి... రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి' అని మండిపడ్డారు. జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుందని అన్నారు. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే... అమలు చేసినోడి బుద్ధి, బుర్ర ఏమయిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక వార్తా పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు. 

 
  • Haha 1
Link to comment
Share on other sites

P Narayana: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు 

02-10-2023 Mon 10:45 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణకు నోటీసులు
  • ఈ నెల 4న లోకేశ్ తో పాటు విచారణకు రావాలన్న సీఐడీ
  • ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేశ్ కు నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు
 
CID issued notices to Ex minister P Narayana

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ అధికారులు ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన టీడీపీ యువనేత నారా లోకేశ్ తో పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసన.. ఢిల్లీలో లోకేశ్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం 

02-10-2023 Mon 10:47 | Andhra
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల ఒక రోజు నిరాహార దీక్ష
  • జైలులో చంద్రబాబు.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి దీక్ష
  • ఢిల్లీలో లోకేశ్‌కు మద్దతుగా కనకమేడల, గల్లా, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు
  • సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న దీక్షలు
 
Nara Lokesh Hunger Strike Starts In Delhi

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో నారా లోకేశ్ ఒక రోజు సత్యాగ్రహదీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగానూ టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొన్నారు. అధినేత అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. 

ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు దీక్ష చేపట్టారు. లోకేశ్‌ దీక్షలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. మంగళగిరిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు దీక్షకు కూర్చున్నారు. 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: ఈరోజు ఆయన జ్ఞాపకాలతో నా గుండె నిండిపోయింది: నారా భువనేశ్వరి 

02-10-2023 Mon 11:57 | Andhra
  • తన తండ్రి ఎన్టీఆర్ ను స్మరించుకున్న భువనేశ్వరి
  • సత్యానికి కట్టుబడి ఉండాలని తన తండ్రి నేర్పించారని వెల్లడి
  • తెలుగు ప్రజలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారన్న భువనేశ్వరి
 
My heart is filled with memories of my father says Nara Bhuvaneswari

తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ఆయన జ్ఞాపకాలతో ఈరోజు తన గుండె నిండిపోయిందని చెప్పారు. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా సత్యానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఆయన తమకు నేర్పించారని అన్నారు. న్యాయానికి ఆయన కట్టుబడిన విధానం, తెలుగు ప్రజలకు సేవ చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన విధానం... ఆయన పిల్లలుగా తమకందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.
20231002fr651a657916c31.jpg
20231002fr651a6580e8942.jpg
20231002fr651a6592d6e06.jpg
20231002fr651a65a98f377.jpg20231002fr651a660b7801b.jpg
20231002fr651a6615a31e5.jpg

 
 
Link to comment
Share on other sites

Nara Lokesh: లోకేశ్ దీక్షలో రఘురాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు.. ఫొటోలు ఇవిగో! 

02-10-2023 Mon 13:10 | Both States
  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ దీక్షలు
  • సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్షలు
  • ఢిల్లీలో కనకమేడల రవీంద్ర కుమార్ ఇంట్లో లోకేశ్ దీక్ష
 
Raghu Rama Krishna Raju in Nara Lokesh Deeksha

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలు తీవ్ర రూపం దాలుస్తున్నారు. ఈరోజు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు 'సత్యమేవ జయతే' పేరుతో ఒక్కరోజు దీక్షను చేపట్టాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీలో నిరసన దీక్షలో కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర కుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి కూడా హజరై లోకేశ్ కు సంఘీభావం ప్రకటించారు. 
20231002fr651a7327a25f5.jpg20231002fr651a734233521.jpg

 
Link to comment
Share on other sites

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మౌనదీక్ష.. దీక్షానంతరం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు 

02-10-2023 Mon 14:42 | Andhra
  • మచిలీపట్నంలో మౌనదీక్షకు దిగిన పవన్
  • జగన్ పై వ్యక్తిగత ద్వేషం లేదన్న జనసేనాని
  • అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరికాదని వ్యాఖ్య
 
Pawan Kalyan mouna deeksha

ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్షకు దిగారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మంటపం వద్ద గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పవన్ నివాళి అర్పించారు. అనంతరం రెండు గంటల పాటు ఆయన దీక్షను చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. 

మౌన దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... మచిలీపట్నం వంటి గొప్ప నేలపై గాంధీ జయంతిని చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మచిలీపట్నం గొప్పతనం ఏమిటంటే... జనసేన ఆవర్భావ సభలో జాతీయగీతం రాగానే 10 లక్షల మంది లేచి నిలబడ్డారని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గాంధీ జయంతి వేడుకలను మచిలీపట్నంలోనే జరుపుతామన్నారు. 

 
సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి చూపిన మహాత్ముడి బాటలో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ తదితరులు నడిచారని పవన్ చెప్పారు. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారత్ కు విముక్తిని కల్పించారని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్రిటీషర్ల లక్షణాలను పుణికిపుచ్చుకున్న పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ప్రజలను ముక్కలుగా విడదీస్తూ విభజించు పాలించు అనే ధోరణితో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. గాంధీజీ సత్యాగ్రహం, ఓటు అనే ఆయుధాలను ఉపయోగించి ఈ పాలకులను రాష్ట్రం నుంచి తరిమేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని... వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై మాత్రమే విభేదాలు ఉన్నాయని పవన్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరైనవి కాదని అన్నారు.
20231002fr651a897f91029.jpg
Link to comment
Share on other sites

Chandrababu: ఎన్టీఆర్ భవన్ లో దీక్ష చేపట్టిన బాలకృష్ణ అర్ధాంగి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు 

02-10-2023 Mon 15:03 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండులో చంద్రబాబు 
  • ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ అగ్రనేతల ఒక్కరోజు దీక్షలు
  • ఢిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి దీక్ష
  • హైదరాబాదులోనూ చంద్రబాబుకు సంఘీభావంగా కుటుంబ సభ్యుల దీక్ష
 
Balakrishna wife Vasundhara takes protest at NTR Bhavan in Hyderabad

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా పార్టీ అగ్రనేతలు దీక్ష చేపట్టడం తెలిసిందే. ఢిల్లీలో నారా లోకేశ్, రాజమండ్రిలో నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. కాగా, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర కూడా దీక్ష చేపట్టారు. 

చంద్రబాబుకు సంఘీభావం పలుకుతూ ఈ దీక్షలో ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్, తారకరత్న అర్ధాంగి అలేఖ్యా రెడ్డి, నారా రోహిత్ తల్లి ఇందిర, నందమూరి జయశ్రీ, చలసాని చాముండేశ్వరి తదితరులు కూడా పాల్గొన్నారు. 

ఎన్టీఆర్ భవన్ లో నిర్వహిస్తున్న ఈ నిరాహార దీక్షలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా హాజరయ్యారు.

Link to comment
Share on other sites

Nandamuri Suhasini: చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు భవిష్యత్తులో గట్టి సమాధానం ఉంటుంది: నందమూరి సుహాసిని 

02-10-2023 Mon 16:30 | Telangana
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నేడు గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ నేతల నిరాహార దీక్ష
  • హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి సుహాసిని దీక్ష
 
Nandamuri Suhasini takes hunger strike in Hyderabad

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ నందమూరి హరికృష్ణ కుమార్తె, తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఎలుగెత్తారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆమె ఇవాళ హైదరాబాదు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ నేతలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ దారుణం, దుర్మార్గం అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయనను అరెస్ట్ చేశారని నందమూరి సుహాసిని ఆరోపించారు. ఇది అన్యాయమైన పాలన అని నిరూపించే ఘటన అని వివరించారు. 

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలను యావత్ దేశం గమనిస్తోంది, ఇది అక్రమం అని ప్రజలు కూడా గుర్తించారని తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్  చేశారని, 23 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారని అన్నారు.

మొన్న నారా లోకేశ్ కు కూడా సమన్లు పంపించారని, రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి ఆయనను కూడా జైలుకు పంపించేందుకు దారుణమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని నందమూరి సుహాసిని పేర్కొన్నారు. అసలు, లోకేశ్ ఆ డిపార్ట్ మెంట్ కు మంత్రి కూడా కాదని అన్నారు. 

చంద్రబాబు విడుదలయ్యేంతరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని నందమూరి సుహాసిని స్పష్టం చేశారు. "తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు... భవిష్యత్తులో గట్టి  సమాధానం ఉంటుంది... జాగ్రత్త!" అంటూ హెచ్చరించారు.

Link to comment
Share on other sites

Garapati Srinivas: కొడాలి నాని, వల్లభనేని వంశీ చేతికి గాజులు వేసుకున్నారు: ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ 

02-10-2023 Mon 12:33 | Both States
  • ఎన్టీఆర్, నారా కుటుంబాల్లోని ఆడవాళ్ల గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎటుపోయిందని ప్రశ్న
  • నారా కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అండగా ఉంటుందని వెల్లడి
  • చంద్రబాబును జైల్లో పెడితే తెలుగువారు సహించరని వ్యాఖ్య
 
NTR grandson Garapati Srinivas fires on Vallabhaneni Vamsi and Kodali Nani

వైసీపీ ప్రభుత్వంపై దివంగత ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. మంత్రి రోజా గురించి ఏదో మాట్లాడారంటూ కేసులు పెడుతున్నారని... ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబంలోని ఆడవాళ్ల గురించి వైసీపీ నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ ఎటు పోయిందని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబం గురించి దారుణంగా మాట్లాడుతున్నా... కొడాలి నాని, వల్లభనేని వంశీలు స్పందించకుండా, గాజులు తొడుక్కుని కూర్చున్నారని దుయ్యబట్టారు. నారా కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అండగా ఉందని తెలిపారు. ప్రజస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని... దీని ద్వారా భవిష్యత్ తరాలకు ఏం నేర్పించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును జైల్లో పెడితో తెలుగువారు సహించరని అన్నారు. 

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: నా ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలి: నారా భువనేశ్వరి 

02-10-2023 Mon 17:54 | Andhra
  • రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష విరమించిన భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ తమ కుటుంబాన్ని మనోవేదనకు గురిచేసిందన్న భువనేశ్వరి
  • నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయామని ఆవేదన
  • ఏనాడూ ఇలా బయటికొచ్చి మాట్లాడతానని అనుకోలేదని వెల్లడి
 
Bhuvaneswari speech in Rajahmundry

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. 

చంద్రబాబు అరెస్ట్ తమ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. చంద్రబాబు, తాను, లోకేశ్, బ్రాహ్మణి నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయామని ఆవేదన వెలిబుచ్చారు. 

"ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ దీక్షలో నేను పాల్గొన్నది చంద్రబాబు కోసమో, మా కుటుంబం కోసమో కాదు. ప్రజల కోసం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడానికి ఈ దీక్షలో పాల్గొన్నాను. నాడు తెల్లదొరలపై పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదు. ఆయన ఎంతో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చాక ప్రజలతో కలిసి మళ్లీ పోరాడారు. 

ఇలా పబ్లిక్ మీటింగుల్లో, రాజకీయ సభల్లో ప్రసంగించడం నాకు అలవాటు లేదు. కానీ ప్రజలంతా నా వెంట ఉన్నారన్న ధైర్యం నాకుంది. కుటుంబానికి కూడా కొంచెం సమయం కేటాయించండి అని ఒకప్పుడు చంద్రబాబునాయుడ్ని నిలదీసేదాన్ని. ఇవాళ చెబుతున్నాను... నా ఆయుష్షు కూడా పోసుకుని ఆయన జీవించాలి... ఇంకా ప్రజాసేవ చేయాలనేదే నా ఆకాంక్ష. సత్యమేవ జయతే... అహింసా నినాదాలను నేను నమ్ముతాను... ఆ సత్యం కోసమే నేను ఇవాళ దీక్షలో పాల్గొన్నాను. 

ఎన్టీఆర్ నీతినిజాయతీ, క్రమశిక్షణే ప్రాతిపదికగా ముందుకెళ్లారు... ఆయన అడుగుజాడల్లోనే మేం నడుస్తున్నాం. ఇప్పటివరకు మా కుటుంబంపై ఒక్క ఆరోపణ లేదు, ఒక్క కేసు కూడా లేదు. మా పనేదో మేం చేసుకుంటూ వెళుతుంటాం. అందుకు కారణం ఎన్టీఆర్ నేర్పించిన క్రమశిక్షణే.

నా తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, నా భర్త ముఖ్యమంత్రిగా చేశారు... కానీ ఎప్పుడూ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. చంద్రబాబును ఎప్పుడూ మేం ఆపలేదు. ఆయనకిష్టమైన ప్రజాసేవ చేసుకోమని ప్రోత్సహించాం. కానీ, ఇవాళ మేం తలో దిక్కుగా అయిపోయాం. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. 

పాతికేళ్ల కిందటే చంద్రబాబు ఐటీ గురించి ఆలోచించారు. సైబరాబాద్ ఐటీ కేంద్రంగా ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బిల్ గేట్స్, క్లింటన్ వంటి ప్రముఖులు హైదరాబాద్ వచ్చారంటే అందుకు కారణం చంద్రబాబు. హైదరాబాదులో పేరుమోసిన ఐటీ కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు కఠోరశ్రమే కారణం. చంద్రబాబు రోజుకు 19 గంటలు పనిచేస్తారు. 

విభజన తర్వాత ఏపీలో పోలవరం, అమరావతి గురించి కలలు కన్నారు. విభజన తర్వాత సీఎం అయ్యాక ఆయన పడిన కష్టం ఎప్పుడూ చూడలేదు. రోజుకు కేవలం మూడ్నాలుగు గంటలే నిద్రపోయేవారు. ఒక ఇల్లు కట్టాలంటేనే కొన్నిసార్లు రెండేళ్ల సమయం పడుతుంది. అలాంటిది ఏమీ లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించండి. 

కానీ ప్రజలు చంద్రబాబును దూరం చేసుకున్నారు. ఈసారి అటువంటి పొరపాటు జరగనివ్వవద్దు. మీ ఓటు వేసి టీడీపీని గెలిపించండి. మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు... పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు... వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు" అంటూ భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...