Jump to content

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా

psycopk

Recommended Posts

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా 

03-10-2023 Tue 13:39 | Andhra
  • స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు
  • నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్
  • హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
  • అఫిడవిట్ సమర్పించేందుకు సమయం కావాలన్న సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ
 
Chandrababu quash petition hearing adjourned to Monday

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. 

ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. 

బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు. 

జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ... అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. 

మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. 

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 

Link to comment
Share on other sites

Jagan: ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్న జగన్.. మోదీతో భేటీ 

03-10-2023 Tue 14:13 | Andhra
  • రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్న జగన్
  • అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం
  • చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్న జగన్
 
CM Jagan going to Delhi

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జగన్ తొలిసారి ఢిల్లీకి వెళ్తుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది.

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. అయితే, ఢిల్లీలో అపాయింట్ మెంట్లు ఖరారు కాకపోవడంతో అప్పుడు ఆయన వెళ్లలేకపోయారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ అంశం కూడా జగన్ పర్యటనపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Link to comment
Share on other sites

Pawan Kalyan: జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి... రేపు పెడనలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కల్యాణ్ 

03-10-2023 Tue 14:42 | Andhra
  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి విజయ యాత్ర
  • పెడన నియోజకవర్గంలో బహిరంగ సభ
  • వైసీపీ కిరాయి గూండాలు దాడి చేస్తారన్న సమాచారం ఉందన్న పవన్
  • 'జగన్.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు' అంటూ వార్నింగ్
 
Pawan Kalyan calls Janasena and TDP cadre should be alert in Pedana rally

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ మచిలీపట్నంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నామని, కానీ రేపటి సభలో దాడులు చేయడానికి కొంతమంది వైసీపీ కిరాయి గూండాలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందని వెల్లడించారు. సుమారు రెండు మూడు వేలమంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 

దయచేసి జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని పవన్ స్పష్టం చేశారు.

"జగన్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు... మాపై రేపు పెడన సభలో కత్తులు, రాళ్లతో దాడులు చేయించాలని చూస్తున్నావ్... ఏదైనా జరిగితే బాధ్యత నీదే. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ, అధికారులకు, కలెక్టర్లకు చెబుతున్నాను... శాంతిభద్రతలు కాపాడాల్సిన మీరు వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదు. గూండాలు వస్తే కచ్చితంగా ఎదుర్కొంటాం. అమలాపురం నుంచి అడుగడుగునా వారాహి విజయ యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. రేపు పెడన సభలో వైసీపీ కిరాయి రౌడీలు దాడులకు ప్రయత్నిస్తే... జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగొద్దు... వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించండి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: నారా లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా 

03-10-2023 Tue 15:12 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కి 41ఏ కింద సీఐడీ నోటీసులు
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన లోకేశ్
  • ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు
 
CID questioning on Nara Lokesh adjourned to Oct 10

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇటీవల 41ఏ కింద నోటీసులు ఇవ్వడం తెలిసిందే. లోకేశ్ అక్టోబరు 4న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. 

అయితే ఈ నోటీసుల్లోని కొన్ని అంశాలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ నోటీసులోని కొన్ని అంశాలను ఆయన సవాల్ చేశారు. లోకేశ్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టిన హైకోర్టు... ఇరు వర్గాల వాదనలు వింది. 

లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. 10వ తేదీన లోకేశ్ సీఐడీ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని హైకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. సీఐడీ అధికారులు విచారణ జరిపే సమయంలో లోకేశ్ న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. మధ్యాహ్నం గంట సేపు లంచ్ బ్రేక్ ఇవ్వాలని పేర్కొంది. 

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరయ్యేటప్పుడు హెరిటేజ్ సంస్థ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అకౌంటు పుస్తకాలు తీసుకురావాలని ఇటీవల సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. 

అయితే, హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని, అలాంటప్పుడు ఆ సంస్థ లావాదేవీల వివరాలు, పద్దుల పుస్తకాలు తానెలా తీసుకువస్తానని లోకేశ్ అంటున్నారు. ఈ మేరకు తన లంచ్ మోషన్ పిటిషన్ లో ప్రస్తావించారు.

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: మీ రాక మాకు బలాన్ని చేకూర్చుతోంది: రాజమండ్రి వచ్చిన అమరావతి రైతులతో నారా భువనేశ్వరి 

03-10-2023 Tue 15:56 | Andhra
  • అమరావతి నుంచి రాజమండ్రి వచ్చిన రైతులు, మహిళలు
  • నారా భువనేశ్వరికి ఆత్మీయ పరామర్శ 
  • రాజకీయ కక్షతోనే ప్రభుత్వం చంద్రబాబును జైలుపాలు చేసిందన్న రైతులు
  • చంద్రబాబు ఎప్పుడూ అమరావతి రైతుల త్యాగం గురించి చెబుతుండేవారన్న భువనేశ్వరి
 
Amaravathi farmers and women met Nara Bhuvaneswari in Rajahmundry

రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని, అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నారా భువనేశ్వరి అన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెపుతుండేవారని, ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని భువనేశ్వరి రైతులతో అన్నారు. 

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు పెద్ద ఎత్తున రాజమండ్రికి తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసుపెట్టి జైల్లో పెట్టిందని వారు అన్నారు. ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని రైతులు భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం, భూములు ఇచ్చిన రైతుల నేటి పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై రైతులు మాట్లాడారు. 

మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని అన్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టిందో వివరించారు. తనకు అన్నీ తెలుసని, రైతులు ధైర్యంగా నిలబడాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని భువనేశ్వరి అన్నారు. 

రాజధాని విధ్వంసం కంటే చంద్రబాబును జైల్లో పెట్టిన ఘటనే తమకు ఎక్కువ బాధ కలిగించిందని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టగా భువనేశ్వరి వారిని ఊరడించారు. అమరావతి నుంచి ఉదయం బయలు దేరి రాజమహేంద్రవరం వస్తున్న తమను పోలీసులు వీరవల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారని మహిళలు, రైతులు భువనేశ్వరికి తెలిపారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినా కనికరించలేదని మహిళలు అన్నారు. 

అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళుతున్నామని చెప్పిన తర్వాతే తమను అనుమతించారని పేర్కొన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేందుకు పోలీసులు తమను అనుసరించారన్నారు. అమరావతి ఉద్యమం నాటి నుంచి ప్రభుత్వం తమను వేధిస్తూనే ఉందని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములు రాజధానికి ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. 

3 రాజధానుల నిర్ణయంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమవడంతో పాటు, రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమను ఈ ప్రభుత్వం పెట్టని ఇబ్బందంటూ లేదని మహిళా రైతులు భువనేశ్వరి వద్ద వాపోయారు. రాజధాని ఉద్యమానికి సహకరించి, రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు భువనేశ్వరికి గుర్తు చేశారు. మందడంలో రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నామన్న రైతులు... రామకోటి రాసే పుస్తకాన్ని భువనేశ్వరికి అందించారు. 

అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ...‘‘రాజధాని రైతుల గొప్పదనం గురించి చంద్రబాబు నాతో ఎప్పుడూ అంటుండేవారు. తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చారని చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవారు. మీ త్యాగాలు వృథాకావు. మహిళల పట్ల అమానవీయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మహిళలు, రైతులను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా బయటకు వచ్చి పోరాడుతున్నారు. రాజమండ్రి వస్తుంటే మిమ్మల్ని పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారని తెలిసి బాధేసింది. 

ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి, ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని కోరుతున్నా. మీరంతా అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ రాక మాకు బలాన్ని చేకూర్చుతోంది. వారు అడ్డదారిలో రావడానికి సిద్ధంగా ఉన్నారు...ఎలా వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఈ ప్రభుత్వానికి మహిళల శక్తి తెలియడం లేదు. 

చంద్రబాబు జైల్లో ఉన్నా మానసికంగా ధృడంగా ఉన్నారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. చంద్రబాబు మచ్చలేకుండా బయటకు వస్తారు. గెలిచేందుకు ప్రత్యర్థులు ఎన్నో ఎత్తులు వేస్తారు...వాటిని మనం ఎదుర్కోవాలి’’ అని భువనేశ్వరి ధైర్యం చెప్పారు. రైతులతో కలిసి భువనేశ్వరి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
20231003fr651bebef6c39f.jpg20231003fr651bebf8932c7.jpg20231003fr651bec166edb7.jpg20231003fr651bec2a702ea.jpg

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా 

03-10-2023 Tue 13:39 | Andhra
  • స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు
  • నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్
  • హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
  • అఫిడవిట్ సమర్పించేందుకు సమయం కావాలన్న సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ
 
Chandrababu quash petition hearing adjourned to Monday

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. 

ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. 

బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు. 

జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ... అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. 

మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. 

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 

Courts evi antha twaraga techavu kaka. 

Link to comment
Share on other sites

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ 

03-10-2023 Tue 17:53 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
  • వర్చువల్‌గా వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాది లూథ్రా
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
 
Judgement reserved on chandrababu anticipatory bail

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా టీడీపీ అధినేత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఏజీ శ్రీరామ్ వాదనలకు లూథ్రా కౌంటర్ వాదనలు కూడా వినిపించారు. రాజకీయ దురుద్దేశ్యంతో సీఐడీ కేసు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా 

03-10-2023 Tue 13:39 | Andhra
  • స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు
  • నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్
  • హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
  • అఫిడవిట్ సమర్పించేందుకు సమయం కావాలన్న సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ
 
Chandrababu quash petition hearing adjourned to Monday

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. 

ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. 

బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు. 

జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ... అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. 

మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. 

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 

quash petition 17A technical point meeda vesary kaani...akkada scam jaragaledu ani kaadu kda bhayya...please clarify

Link to comment
Share on other sites

Just now, anandam2012 said:

quash petition 17A technical point meeda vesary kaani...akkada scam jaragaledu ani kaadu kda bhayya...please clarify

Judge asked if its 17A or 409.

APCID team said we booked him

in both. And you decide which one applies and make a decision.

then the judges adjourned for Monday. 

Link to comment
Share on other sites

1 minute ago, MrDexter said:

Judge asked if its 17A or 409.

APCID team said we booked him

in both. And you decide which one applies and make a decision.

then the judges adjourned for Monday. 

scam jariginda leda ani mana TS (thread starter) bhayya nunchi vindamani...okavela jaragaledu antey aa maata cheppi quash cheyamanu vachu kada? ED vaallu wrong ga arrest chesaru DesignTech MD  Kanvelkar ni..70crores wrong ga attach chesaru ani cheppochu kada @psycopk bhayya please clarify

Link to comment
Share on other sites

Just now, anandam2012 said:

scam jariginda leda ani mana TS (thread starter) bhayya nunchi vindamani...okavela jaragaledu antey aa maata cheppi quash cheyamanu vachu kada? ED vaallu wrong ga arrest chesaru DesignTech MD  Kanvelkar ni..70crores wrong ga attach chesaru ani cheppochu kada @psycopk bhayya please clarify

Antha deep discussion ki phulkas digaru valla blood vere. So waste! 
ongobetti vesukodame vallani back nundi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...