Jump to content

Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా


psycopk

Recommended Posts

Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా 

06-10-2023 Fri 14:12 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
  • తీర్పును సోమవారానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • ప్రభుత్వం తరపున పొన్నవోలు, బాబు తరపున దూబే వాదనలు
 
ACB Court adjourns verdict in Chandrababu bail and custody petitions

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.

Link to comment
Share on other sites

Chandrababu: 13 మంది బెయిల్‌పై ఉన్నారని వాదనలు వినిపించాం: చంద్రబాబు లాయర్ ప్రమోద్ కుమార్ దుబే 

06-10-2023 Fri 15:06 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వ్యాఖ్య
  • ఈ కేసులో ఎక్కడా చంద్రబాబు పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయవాది
  • గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి
 
Chandrababu lawyer on bail petition

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే అన్నారు. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం దుబే మాట్లాడుతూ...  ఈ కేసులో ఇప్పటికే పదమూడు మంది బెయిల్‌పై ఉన్నారని తాము న్యాయస్థానంలో వాదనలు వినిపించినట్లు చెప్పారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చంద్రబాబును విచారించారని, అరెస్టైన పదిహేను రోజుల తర్వాత మళ్లీ కస్టడీ కోరడం సరికాదన్నారు. కాగా చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దుబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Link to comment
Share on other sites

Devineni Uma: లోకేశ్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి కావాలా?: దేవినేని ఉమ 

06-10-2023 Fri 15:15 | Andhra
  • ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగొచ్చిన లోకేశ్
  • నేడు రాజమండ్రి పయనం
  • లోకేశ్ వెంట వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం
  • పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు
 
Devineni Uma fires on police

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత రాత్రి ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన తన తండ్రి చంద్రబాబుతో ములాఖత్ కోసం రాజమండ్రి బయల్దేరారు. అయితే, ఆయన కాన్వాయ్ వెంట వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర తదితర టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై దేవినేని ఉమా మండిపడ్డారు. మేం నారా లోకేశ్ ను కలుసుకోకుండా మీరెందుకు అడ్డుకుంటున్నారు? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. 

"రాష్ట్రంలో రోజు రోజుకు నియంత పాలన కొత్త పుంతలు తొక్కతోంది. పిచ్చి పరాకాష్ఠకు చేరింది. అమరావతి నుంచి రాజమండ్రి బయల్దేరిన నారా లోకేశ్ వెంట ఎవరూ ఉండకూడదని పోలీసులు అడ్డుకుంటున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాలను ఆపేశారు. లోకేశ్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి తీసుకోవాలా? రాజమండ్రి వెళ్లాలంటే మీ దగ్గర వీసా తీసుకోవాలా?" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో చీకటిని సూచిస్తోంది: నారా భువనేశ్వరి 

06-10-2023 Fri 14:25 | Andhra
  • అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలన్న భువనేశ్వరి
  • చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని వ్యాఖ్య
  • కాంతితో క్రాంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు
 
Nara Bhuvaneswari calls for kanthi tho kranthi

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో ఉన్న చీకటికి నిదర్శనమని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని, కాబట్టి ఆయన అరెస్ట్ రాష్ట్రంలోని చీకటిని సూచిస్తోందన్నారు. అలాంటి చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని, అందుకే కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, శనివారం రాత్రి ఏడు గంటలకు మన ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు.

కాగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్ళలో లైట్లు ఆపేసి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి, వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...