Jump to content

CID wasted Another day — Lokesh


psycopk

Recommended Posts

Nara Lokesh: ఇవాళ లంచ్ ముందు బాహుబలి సినిమా చూపించారు: నారా లోకేశ్ 

11-10-2023 Wed 18:34 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ
  • నేడు రెండో రోజు సిట్ కార్యాలయానికి వచ్చిన లోకేశ్
  • గూగుల్ ఎర్త్ లో హెరిటేజ్ భూములు చూపించారని వెల్లడి
  • రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల గుండా వెళుతోందని చెప్పారని వివరణ
 
Lokesh funny comments on CID questioning

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు సీఐడీ విచారణ ముగిసిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. లంచ్ కు ముందు ఇవాళ తనకు బాహుబలి సినిమా చూపించారని అన్నారు. 

"నా ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి. హెరిటేజ్ నాడు ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసిందీ, ఏ సర్వే నెంబరు అనేది నాకు తెలుసు. కానీ ఇవాళ బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పై నీట్ గా చూపించారు. 

దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే... ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందట. దానర్థం, ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమిని కోల్పోయింది... ఇదీ ఇవాళ నేను తెలుసుకున్నది. మొత్తమ్మీద బాహుబలి సినిమా చూపించారు... దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఏవేవో ప్రశ్నలు అడిగారు. 

ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంతో నాకెలాంటి సంబంధం లేదు. అలైన్ మెంట్ లో నా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ కూడా కోర్ క్యాపిటల్ రీజియన్ లో కనీసం ఒక గజం స్థలం కూడా కొనలేదు. గత పదేళ్లుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రకటిస్తున్నాం. పేర్కొన్న దానికంటే ఒక్క గజం స్థలం ఎక్కువుందని నిరూపిస్తే, వాళ్లకు మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని ఆనాడే చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు. 

నన్ను రెండ్రోజుల నుంచి సీఐడీ వాళ్లు విచారిస్తున్నారు. నాకు సంబంధించిన ఆధారాలేవీ చూపించలేకపోయారు. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. నాకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మానుకుని వచ్చాను. వీళ్లు విచారణకు పిలిచి రెండ్రోజుల పాటు నా సమయాన్ని వృథా చేశారు. ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేటి?

మళ్లీ చెబుతున్నాను... వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. జీవోలతో సీఎంకు సంబంధం ఏముంటుంది? నాటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లంపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? సంతకాలు చేసిన అధికారులను విచారణకు పిలవకుండా, పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును 32 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం బాధాకరం. 

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కార్యదర్శిగా వ్యవహరించింది ప్రేమచంద్రారెడ్డే. ఆయన గుజరాత్ వెళ్లి పరిశీలించి స్కిల్ ప్రాజెక్టు అద్భుతం అని చెప్పారు. దీన్ని వెంటనే అమలు చేయాలి, రూ.285 కోట్లను వెంటనే విడుదల చేయండి అని ప్రేమచంద్రారెడ్డి నివేదిక ఇచ్చారు. కానీ ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. 

ఇక, లింగమనేని రమేశ్ గారికి 2019లో రెంటల్ అడ్వాన్స్ కింద రూ.27 లక్షలు ఇచ్చిన విషయం మా అమ్మగారి ఐటీ రిటర్న్స్ లో ఎందుకు లేదని అడిగారు. ఆ సంగతి ఆడిటర్ ను అడగాలని చెప్పాను. మా తల్లి ఖాతా నుంచి రూ.27 లక్షలు అద్దె కోసం చెల్లించినట్టు బ్యాంకు స్టేట్ మెంట్ ను సీఐడీ వాళ్లే చూపిస్తున్నారు. అన్ని ఆధారాలు వాళ్ల దగ్గరే ఉంచుకుని కూడా ఏదో జరిగిందని ప్రశ్నిస్తున్నారు" అని నారా లోకేశ్ వివరించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: రెండ్రోజుల సీఐడీ విచారణ అనంతరం ఢిల్లీకి లోకేశ్... ఎందుకంటే? 

11-10-2023 Wed 18:41 | Andhra
  • రెండు రోజుల పాటు సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్
  • నేడు విచారణ అనంతరం ఢిల్లీకి పయనం
  • ఎల్లుండి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • న్యాయవాదులతో సమీక్ష కోసం ఢిల్లీకి బయలుదేరిన లోకేశ్
 
Nara Lokesh to reach delhi tonight

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ ఆయనను రెండు రోజుల పాటు... నిన్న, ఈరోజు విచారించిన విషయం తెలిసిందే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించింది. సీఐడీ విచారణ కోసమే లోకేశ్ మొన్న రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. నిన్న విచారణ అనంతరం సీఐడీ ఈ రోజు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఉండిపోయారు. నేడు విచారణ అనంతరం నేరుగా ఢిల్లీ బయలుదేరారు. శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ఉంది. దీనికి సంబంధించి న్యాయవాదులతో సమీక్షించేందుకు లోకేశ్ ఢిల్లీకి పయనమయ్యారు. 

 

Link to comment
Share on other sites

Nara Lokesh: మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్నులు వీళ్ల చేతికి ఎలా వచ్చాయో తేల్చుకుంటా: లోకేశ్ 

11-10-2023 Wed 18:06 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేశ్ పై ఆరోపణలు
  • ఇవాళ రెండో రోజు కూడా లోకేశ్ పై సీఐడీ విచారణ
  • విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్
  • తన ముందు నారా భువనేశ్వరి ఐటీ డాక్యుమెంట్ ను పెట్టారని వెల్లడి
  • ఆ పత్రం అధికారికంగా వచ్చిందో, అనధికారికంగా వచ్చిందో తెలియాల్సి ఉందని వ్యాఖ్యలు
 
Lokesh second day CID questioning concluded

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు. సీఐడీ అధికారుల కోరిక మేరకు తాను ఇవాళ కూడా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. 

నిన్న అడిగిన ప్రశ్నలనే వాషింగ్ మెషీన్ లో వేసి, అటు తిప్పి ఇటు తిప్పి అడిగారని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ 47 ప్రశ్నలు అడిగితే, వాటిలో రెండో, మూడో కొత్త ప్రశ్నలు అని, మిగతావన్నీ పాత ప్రశ్నలేనని వెల్లడించారు. ఇవాళ తనను 6 గంటల పాటు ప్రశ్నించారని తెలిపారు. 

"ఇవాళ విచారణ సందర్భంగా నా ముందు ఓ డాక్యుమెంట్ పెట్టారు. అది మా అమ్మ నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించిన పత్రం. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని సీఐడీ అధికారులను ప్రశ్నించాను. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ కేసులో మా అమ్మ నిందితురాలు కాదు... ఆమె ఐటీ రిటర్నులు మీ వద్ద ఎందుకున్నాయని దర్యాప్తు అధికారిని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 

నిందితురాలు కానటువంటి వ్యక్తి ఐటీ రిటర్నులు ఏపీ ప్రభుత్వం చేతికి అధికారికంగా వచ్చాయా? అనధికారికంగా వచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చేందుకు ఐటీ శాఖకు లేఖ రాస్తాను. 

ఇవాళ్టి విచారణలో నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు కొన్ని అడిగారు. అవి నా శాఖకు సంబంధించినవి కావని, వాటిపై నాకు అవగాహన లేదని సీఐడీ అధికారులకు చెప్పాను. వాస్తవానికి ఇవాళ్టి విచారణ గురించి మీడియాకు చెప్పాల్సిన కొత్త  విషయాలు కూడా ఏమీ లేవు. ఇవాళ మరోసారి లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇస్తారేమో అనుకున్నాను. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇచ్చారు కదా.... మూడోది కూడా ఇస్తారా? అని దర్యాప్తు అధికారిని అడిగాను. అందుకాయన సమాధానం చెప్పలేదు" అని లోకేశ్ వివరించారు. 

"రాజధాని ఈ ప్రాంతంలో రావాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్ డెవలపర్ ఎవరు? సీడ్ కాపిటల్ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీసీఆర్డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఎవరు నిర్ణయించారు?... అంటూ ఈ ప్రశ్నలు అడిగారు. ఇవేవీ నా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినవి కావు. 

నాడు ఏపీ సీఆర్డీఏలో కొందరు లే అవుట్లు వేసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో, దాన్ని పరిష్కరించేందుకు మంత్రుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది నేను మంత్రిని కాకముందు ఏర్పాటైన మంత్రుల సంఘం. 99 ప్లాట్లకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అంతే తప్ప కొత్తగా ఏమీ లేదు. దాంట్లో రింగ్ రోడ్డు అలైన్ మెంట్ గురించి ఏమీ లేదు" అని లోకేశ్ స్పష్టం చేశారు. 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Dhulipala Narendra Kumar: ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర: ధూళిపాళ్ల నరేంద్ర 

11-10-2023 Wed 14:58 | Andhra
  • దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చారో సీఎం జవాబు చెప్పాలన్న ధూళిపాళ్ల
  • ఇందులో ప్రభుత్వ పాత్ర స్పష్టంగా తెలుస్తోందని వెల్లడి
  • సీఎంకు దాసోహమైన అధికారులపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని హెచ్చరిక
 
Dhulipalla Narendra press meet on Inner Ring Road issue

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దర్యాప్తు అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ చేస్తున్న అధికారిని ఉన్నపళంగా ఎందుకు మార్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజ్ ను మార్చి, డీఎస్పీ స్థాయి విజయ్ భాస్కర్ ను ఎందుకు నియమించారో ప్రభుత్వం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. 

"అధికారి మార్పుని బట్టే... ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో ప్రభుత్వ పాత్ర ఉందని స్పష్టమవుతోంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ కీలక దశలో ఉందని చెప్పే ప్రభుత్వం... అర్థం పర్థం లేకుండా విచారణాధికారుల్ని ఎందుకు మారుస్తోంది? తాము చెప్పినట్టు వినడం లేదనే జయరాజ్ ను తప్పించారా? అధికారిని మార్చడం ద్వారా ప్రభుత్వం పెద్ద కుట్రకు ప్రణాళికలు వేస్తోందని అర్థమవుతోంది. దర్యాప్తు అధికారిని మార్చి అతని ద్వారా తాము అనుకునేది చక్కబెట్టుకోవాలని ప్రభుత్వం అనుకుంటే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. అలాగే పరిధి దాటి వ్యవహరించే అధికారులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ రాజకీయ కుట్రలతో ఆడించే ఆటలపై... వాటిలో పావులుగా మారి, ముఖ్యమంత్రికి దాసోహమైన అధికారులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంది” అని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. 

ఆ పేటెంట్ హక్కులు పూర్తిగా ముఖ్యమంత్రివే!

 
జగన్ కు తెలిసింది అరాచకం, దోపిడీ, విధ్వంసమేనని... వాటిపై పూర్తి  పేటెంట్ హక్కులు ఆయనవేనని ధూళిపాళ్ల విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి చెప్పడం ఆయనలోని నటనా కౌశలానికి మచ్చుతునక అని ఎద్దేవా చేశారు. జగన్ నవ్వు పైశాచికత్వానికి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు.   
 
అవేవీ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనిపించవు
 
శాంతిభద్రతల వ్యవహారాలు... వాటిని పర్యవేక్షించే విభాగాలు, విచారణాసంస్థలు అన్నీ ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంటాయని అందరికీ తెలుసని ధూళిపాళ్ల పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం విచారణ జరిపే సంస్థలు, అధికారులు అందరూ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. 

"ముఖ్యమంత్రి, ప్రభుత్వం మోపే అన్ని అభియోగాలు, అభాండాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా సమాధానం చెబుతూనే ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వాస్తవాలను అన్ని రూపాల్లో ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అవేవీ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కనిపించవు. కేవలం చంద్రబాబు జైల్లో ఉండాలి... తాము ఆనందించాలన్నదే వారి లక్ష్యం. చంద్రబాబు అరెస్ట్ పై, ఆయన జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, మరికొందరి వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. చంద్రబాబునాయుడి భద్రత, జైల్లోని పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం మంత్రులకు హాస్యంగా కనిపిస్తోంది" అని ధూళిపాళ్ల మండిపడ్డారు. 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

As usual, any questions single answer anta kada…

Q: Inner ring road alignment enduku chesinaru ?

A: Emo saar

Q: paalu pandlu ammukunetodiki ring road facing enduku ?

A: Telvadu saar

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...