Jump to content

Lanka Dinakar: జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యాడు: లంకా దినకర్ 


psycopk

Recommended Posts

Lanka Dinakar: జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యాడు: లంకా దినకర్ 

14-10-2023 Sat 15:55 | Andhra
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి ఫోన్ పగిలిందన్న లంకా దినకర్
  • నాసిరకం మద్యం తయారీలో మీ అల్లుడి పాత్ర లేదా? అని ప్రశ్న
  • విజయసాయి మళ్లీ దిగజారుడు భాష వాడుతున్నారని విమర్శ
 
Lanka Dinakar comments on Vijayasai Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి? మీ అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. ఫోన్లలో సమాచారం దొరికితే ఎక్కడ దొరికిపోతామో అని పగలగొట్టిన ఫోన్లు ఎవరివని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ ఫోన్ పగిలిందని... ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకేమి పగులుతాయో అని చెప్పారు. నాసిరకం మద్యం తయారీ వెనుక మీ అల్లుడి పాత్ర లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ బయటపడతాయనే భయంతో తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి కొంచెం సైలెంట్ అయ్యారని... జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ యాక్టివ్ అయ్యాడని విమర్శించారు. ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి భాష సంస్కారవంతంగా మారిందని... ఇప్పుడు మళ్లీ దిగజారుడు భాషను వాడుతున్నారని మండిపడ్డారు. పురందేశ్వరిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. 

Link to comment
Share on other sites

Bonda Uma: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్యసమాజం అసహ్యించుకుంటోంది: బొండా ఉమ 

14-10-2023 Sat 16:00 | Andhra
  • జైల్లో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు
  • నిన్న వ్యంగ్యంగా స్పందించిన సజ్జల
  • అహంకారంతో మాట్లాడకు సజ్జలా అంటూ బొండా ఉమ ఫైర్
  • జైలు మాన్యువల్ తెలియని నువ్వు ప్రభుత్వ సలహాదారువా? అంటూ ఆగ్రహం
 
Bonda uma fires on Sajjala Ramakrishna Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నట్టు వార్తలు రాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యోక్తులు, చమత్కారాలతో స్పందించడం తెలిసిందే. 

అయితే, సజ్జల వ్యాఖ్యల పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారమదంతో, అహంకారంతో మాట్లాడకు సజ్జలా? అంటూ ఘాటుగా హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్యసమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. సజ్జల బయట కనిపిస్తే ప్రజలు ఆయన ముఖాన ఉమ్మడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

జైలు మాన్యువల్ ప్రకారం హై ప్రొఫైల్ వ్యక్తి, కేవలం రిమాండ్ పై జైల్లో ఉన్న చంద్రబాబుకి కనీస సౌకర్యాలు, వైద్యసేవలు అందించాలని తెలియని నువ్వు ప్రభుత్వ సలహాదారువా? అంటూ నిలదీశారు. వైద్య సేవలు, కనీస సదుపాయాలు పొందడం చంద్రబాబు హక్కు... దాన్ని కాదనే అధికారం సజ్జలకు, జైలు అధికారులకు లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. 

"చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన భార్య, కోడలికంటే తాడేపల్లి తబలా బృందానికి బాగా తెలుసా? జైల్లో ఉండి కుట్రలకు పాల్పడటం, రాజకీయాలు చేయడం సజ్జలకు జగన్ రెడ్డికే బాగా తెలుసు. కోడికత్తితో భుజంపై గీయించుకొని, అమాయక దళిత యువకుడిని జైల్లో పెట్టిన నీతిమాలిన చరిత్ర ఎవరిదో మర్చి పోయావా సజ్జలా? సొంత బాబాయ్ ని గొడ్డలిపోట్లకు బలిచేసి, గుండెపోటని నమ్మించేంత నేర్పరితనం చంద్రబాబుకి లేదు. సొంత తల్లీ, చెల్లిని అధికారం కోసం వాడుకొని రోడ్డున పడేసేంత చాకచక్యం జగన్ కు ఉన్నంత మా నాయకుడికి లేదు. 

మీడియాతో ఒకలా... కోర్టుల్లో ఇంకోలా... జనంలో మరోలా మాట్లాడటం సజ్జల, జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య" అంటూ బొండా ఉమ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

జైలు అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు

మోస్ట్ హై ప్రొఫైల్ ఉన్న వీవీఐపీ అయిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ ఎవరు పడితే వారు విడుదల చేయడం ఏమిటి? జైలు సిబ్బందికి ఆ అధికారం ఎక్కడిది? తాడేపల్లిలో కూర్చొని మాట్లాడే సజ్జల లాంటి లఫూట్ లకు చంద్రబాబుస్థాయి తెలియదు సరే... జైలు అధికారులకు కూడా తెలియదా? జగన్ రెడ్డి అండతో చంద్రబాబుని ఇబ్బందిపెట్టే జైలు అధికారులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. జైలుని క్రీడామైదానంగా మార్చుకొని రాజభోగాలు అనుభవించిన జగన్ రెడ్డి, ఏ తప్పూ చేయకుండానే జైల్లో ఉన్న చంద్రబాబు ఒక్కటేనని అనుకోవడం సజ్జల అహంకారానికి నిదర్శనం.
 
చంద్రబాబును జైల్లో బాగా చూసుకుంటే బరువెందుకు తగ్గారు?

చంద్రబాబుకి పంపే ఇంటిభోజనం నేరుగా ఆయనవద్దకు వెళ్లదు... జైలు అధికారులు మొత్తం పరిశీలించాకే భోజనం లోపలికి పంపిస్తారు. భోజనంపై కూడా బుద్ధిలేకుండా సజ్జల మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? చంద్రబాబుని జైల్లో బాగానే చూసుకుంటే ఆయన బరువు ఎందుకు తగ్గారో సజ్జల చెప్పాలి. 

బయట ఉన్నప్పడు చంద్రబాబు రోజూ బరువు చెక్ చేసుకునేవారు. ఆయన జైలుకెళ్లే రోజు ఎంత బరువున్నారో జైలు రికార్డుల్లో ఉంటుంది. జైలు అధికారులు ఇప్పుడు చంద్రబాబు 66 కిలోలు ఉన్నారంటున్నారు. కానీ చంద్రబాబు వాస్తవంగా 72 కిలోల బరువుంటారు. లోఫర్, లఫూట్ ఐడియాలు సజ్జలకు, జగన్ రెడ్డికే వస్తాయి. 
 
తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి

ప్రభుత్వ కక్షసాధింపులకు తోడు... జైలు అధికారులు చంద్రబాబుకి కనీస సౌకర్యాలు కూడా కల్పించనందునే ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యంపై వెంటనే రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. మాకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, క్షేమంగా బయటకు రావడమే ముఖ్యం. ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తే, అంతగా నష్టపోతుంది. చంద్రబాబుకి చిన్న అపకారం జరిగినా జగన్ రెడ్డే బాధ్యుడు” అని బొండా ఉమ స్పష్టంచేశారు.

Link to comment
Share on other sites

Devineni Uma: చంద్రబాబు ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్, ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమ! 

14-10-2023 Sat 19:07 | Both States
  • ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆవేదన
  • కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పని చేశారని గుర్తు చేసిన దేవినేని ఉమ
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమమని అందరికీ అర్థమైందని వ్యాఖ్య
 
Devineni Uma responds on KTR tweet on chandrababu

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ ట్వీట్ తనను ఆవేదనకు గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై దేవినేని ఉమ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.

ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేసిన వారేనని, వివిధ దేశాల్లో చంద్రబాబు కోసం సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో అడ్డుకుంటున్నారన్నారు. బావ కళ్ళల్లో ఆనందం చూసిన మొద్దు శీనుకు ఏం గతి పట్టిందో చూశామని, చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి గుణపాఠం చెబుతారన్నారు. జగన్‌ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలంతా చంద్రబాబు వైపే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని అందరికీ అర్థమైందన్నారు.

సకల శాఖ మంత్రి మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒళ్లు బలిసి, కొవ్వెక్కి మాట్లాడుతున్నాడన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఎవరు బలుపుతో మాట్లాడినా అంతరంగం జగన్‌దే అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ ఐటీ ప్రొఫెషనల్ చేస్తుంటే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...