Jump to content

Trs manifesto..


psycopk

Recommended Posts

BRS: నిరుపేద మహిళలకు నెలకు రూ. 3 వేల జీవనభృతి.. నేడు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల 

15-10-2023 Sun 09:55 | Telangana
  • పూర్తి జనరంజకంగా మ్యానిఫెస్టో తయారీ
  • రైతుబీమా కింద ఇస్తున్న రూ. 5 లక్షల పరిహారం అందరికీ వర్తింపు
  • పింఛన్ రూ. 3,016కు పెంపు
  • రైతుబంధు రూ. 16 వేలకు పెంపు
  • ప్రతి సీజన్‌లో రెండు బస్తాల యూరియా ఉచితం
  • వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 400 వరకు సబ్సిడీ
 
BRS to release manifesto today

తమ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయమని గత కొన్ని రోజులుగా చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ నేడు దానిని విడుదల చేయబోతోంది. దీనిని పూర్తి జనరంజకంగా తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, హ్యాట్రిక్ సీఎంగా పేరు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ మ్యానిఫెస్టోను పకడ్బందీగా తయారుచేసినట్టు సమాచారం.

బయటకు వచ్చిన వివరాల ప్రకారం..
ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ. 5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ. 3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి  ప్రస్తుతం అందిస్తున్న రూ. 2,016 పింఛన్‌ను రూ. 3,016కు పెంచుతారు. 

జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకం, రైతుబంధు సాయం రూ. 16 వేలకు పెంపు, ప్రతి సీజన్‌లో ఉచితంగా ఎకరానికి రెండు బస్తాల యూరియా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయం రూ. 1.25 లక్షలకు పెంపు, వంట గ్యాస్ సిలిండర్లపై రూ. 400 వరకు సబ్సిడీ, మహిళలకు రూ. 2 లక్షల మేర వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి. 

 

  • Upvote 2
Link to comment
Share on other sites

పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి. 

 

Link to comment
Share on other sites

Farmers ki as long as he continues 247 power and raithu bandhu and msp etc no one can touch anukunta , dora clearly knows ,

except corruption allegations on him , his family and local mlas mari goranga tintunaru anta 

people are more or less happy with his schemes I guess main farmer ni dil tho touch chesadu with power free, water table, lakes revival etc 

Link to comment
Share on other sites

Revanth Reddy: అన్నీ మా మేనిఫెస్టోలోని అంశాలే... కాపీ కొట్టారు: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై రేవంత్ స్పందన 

15-10-2023 Sun 17:17 | Telangana
  • తెలంగాణ ఎన్నికలకు మోగిన నగారా
  • నేడు మేనిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్
  • తమ 6 గ్యారెంటీలను పోలిన హామీలే ఇచ్చారన్న రేవంత్
  • కేసీఆర్ ఆలోచించే శక్తిని కోల్పోయారంటూ ఎద్దేవా
 
Revanth Reddy slams BRS Manifesto

మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలతో సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను పోలిన హామీలను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆరోపించారు. 

"మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు... ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నాడు... పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు... మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే... ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. 

ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే... రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది. 

కేసీఆర్, బీఆర్ఎస్ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. కేసీఆర్, ఆయన పార్టీ పరాన్నజీవులు. పక్కవాళ్ల మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీలో లోపించాయనడానికి వాళ్ల మేనిఫెస్టోనే నిదర్శనం. 

గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేం రూ.4 వేల పెన్షన్, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే... అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారు?

రైతులకు మేం ఇందిరమ్మ భరోసా కింద రూ.15 వేలు ఇస్తామంటే... అదెలా సాధ్యమవుతుంది అన్నారు... పేదలకు ఇళ్ల స్థలాల కోసం రూ.5 లక్షలు ఇస్తామంటే... నిధులు ఎక్కడ్నించి తెస్తారు అని మమ్మల్ని ప్రశ్నించారు... రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద మేం రూ.10 లక్షలు ఇస్తామంటే... అది అసాధ్యమన్నారు...   ఇప్పుడదే బీఆర్ఎస్ నేతలు రూ.15 లక్షల బీమా అని ప్రకటించారు. కేసీఆర్ బీమా అంటూ మరో రూ.5 లక్షలు అంటున్నారు. 

ఈ విధంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సొంత ఉనికిని, గుర్తింపును కోల్పోయారని వారి మేనిఫెస్టో చూశాక అర్థమైంది. నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు చూశాక వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి అర్థమైంది. ఈ హామీలను ఎలా అమలు  చేస్తారు? అని మమ్మల్ని అడిగే అర్హతను కేసీఆర్ కోల్పోయారు" అంటూ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

Pink color cheddi

Ninna TDP ni choosi BRS ki vanuku annavu kada anna.

 

Koncham TDP manifesto in TG koncham post cheyamanu...

 

Oo sorry mee party office kaali kada in TG. Manifesto print ki kuda dabbulu dandaga ani surveys vachaayi ani talk vachindi anta kada.

Last time lo kukatpalli lo kuda deposit raaledu ani gurthu undi

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...