Jump to content

Fiber grid case postponed to 9th


psycopk

Recommended Posts

Chandrababu: పైబర్ నెట్ కేసు: చంద్రబాబు పిటిషన్ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

20-10-2023 Fri 11:04 | Andhra
  • వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా.. నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
  • అప్పటి వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశం 
  • ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు
  • నేడు ఏసీబీ కోర్టులో నాలుగు పిటిషన్లపై విచారణ
 
chandrababu bail petition postponed in Supreme court

పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన అండర్ టేకింగ్ కొనసాగించాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయ్యాక చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ.. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని తాము దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు వివరించారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

పైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబు పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు రాగా.. జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో శుక్రవారం చంద్రబాబుకు సంబంధించి నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు లీగల్ ములాఖత్ ల పెంపునకు నో చెప్పిన ఏసీబీ కోర్టు 

20-10-2023 Fri 13:45 | Andhra
  • రోజుకు మూడు ములాఖత్ లు ఇప్పించాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్
  • కనీసం 45 నుంచి 50 నిమిషాలు టైమ్ ఇప్పించాలని విజ్ఞప్తి
  • ప్రతివాదుల పేర్లు చేర్చలేదంటూ పిటిషన్ పై విచారణకు తిరస్కరించిన కోర్టు
 
Chandrababu lawyers Petition Denied by ACB Court

టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ విషయంలో ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆయనను కలిసేందుకు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడు సార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని చెప్పారు. లీగల్ ములాఖత్ పై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

Link to comment
Share on other sites

5 minutes ago, megadheera said:

Malli vayinda endi? Friday edo final judgement annaru kada @psycopk

Jaffa gadi lawyers written documents

submit cheyala…

last day last minute ko chestaro leka time kavali ani cheptaro chudali

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబుకు రోజూ 2 లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు 

20-10-2023 Fri 18:08 | Andhra
  • హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చంద్రబాబుకు పలు కేసులు ఉన్నాయన్న చంద్రబాబు న్యాయవాదులు
  • న్యాయవాదులు కలిసేందుకు ప్రతి రోజు ములాఖత్ లు ఇవ్వాలని విన్నపం
  • సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు
 
ACB Court orders for  2 mulakhats everyday for Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు ఉన్న నేపథ్యంలో... ఆయనను న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖత్ లు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్ లు ఇవ్వనున్నారు. 

Link to comment
Share on other sites

10 minutes ago, csrcsr said:

Waste anna mari too much , hopes poyavi they are just postponing 

Yes they want the corrupt moosali to enjoy chippa food as much as possible before he kicks the bucket 

Link to comment
Share on other sites

2 minutes ago, ForEverJava said:

Cbn and tdp done deal and next election ysrcp landslide..cbn bayaytiki eppudu ravali veedu party ni nadipiyyali

# +1 rupee into account 

Link to comment
Share on other sites

22 minutes ago, Anta Assamey said:

Asalu main news veyaledu kada nuvvu @psycopk ... Skill case lo judgement will be given before Nov 8th ani cheppindi Supreme Court...47osjd.gif

squash judgement 8th.. until then interm bail antaru anukuna.. uselessfellows

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...