Jump to content

మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదు: ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు


Peruthopaniemundhi

Recommended Posts

Medigadda Barriage: మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదు: ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు

మేడిగడ్డ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై నిపుణుల బృందం పరిశీలించిందని రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వరులు తెలిపారు. ఘటనాస్థలికి వెళ్లి 20వ నెంబరు పిల్లర్‌ పరిశీలించిన అధికారులు.. పిల్లర్‌ అడుగున్నర కుంగిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని, ఈ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ నిర్మించిందని చెప్పారు. బ్యారేజీ కుంగుబాటు తర్వాత నీటిని దిగువకు విడుదల చేశామని, త్వరలోనే మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని, ఎవరినీ బ్యారేజీ పరిసరాల్లోకి అనుమతించలేదన్నారు. గతంలో 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని ఈ సందర్భంగా వెంకటేశ్వరులు వివరించారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు. బ్యారేజీ బి బ్లాక్‌లో 20వ పిల్లర్‌ కుంగిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం. ఘటనపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఏం జరిగిందంటే?

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. శనివారం పొద్దుపోయాక భారీ శబ్దంతో బి-బ్లాకులోని పిల్లర్ల మధ్య ఉన్న వంతెన  కుంగిపోయింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. 

 

రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకుని పరిస్థితి సమీక్షించారు.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...